హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news : బంధువుల ముందు భర్త ఇన్సల్ట్ చేశాడని తమ్ముళ్లతో కలిసి ఆమె అంత పని చేసింది

Crime news : బంధువుల ముందు భర్త ఇన్సల్ట్ చేశాడని తమ్ముళ్లతో కలిసి ఆమె అంత పని చేసింది

(wife killed husband)

(wife killed husband)

wife kill husband : కామారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కేసులో మిస్టరీని కేవలం 48గంటల్లో చేధించిన పోలీసులు నిందితురాలు మృతుడి భార్యేనని తెలిసి షాక్ అయ్యారు. భర్తను ఎవరితో చంపించిందో ..ఎందుకు హత్య చేయించాల్సి వచ్చిందో తెలిసి ఆశ్చర్యపోయారు పోలీసులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kamareddy, India

(P.Mahendar,News18,Nizamabad)
క‌ల‌కాలం తోడు-నీడగా ఉంటామ‌ని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి ఒక్కటైన భార్యభర్తల బంధాన్నితెంచుకుంది ఓ వివాహిత. కామారెడ్డి (Kamareddy)జిల్లాలో జరిగిన హత్య కేసులో మిస్టరీ(Mystery)ని కేవలం 48గంటల్లో చేధించిన పోలీసులు(Police)నిందితురాలు మృతుడి భార్యేనని తెలిసి షాక్ అయ్యారు. కేవలం భర్తపై కోపంతో సోదరుడితో కలిసి మర్డర్(Murder)చేయించిన విషయం బయటకు రావడంతో స్థానికులు సైతం అవక్కయ్యారు. కట్టుకున్న వాడ్ని భార్యే కడచేర్చిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.


YouTuber Suicide: పాపం ఓ యూట్యూబర్ పురుగుల మందు తాగాడు .. కారణం అదేనంటభర్త తిట్టాడనే కోపంతో..

కామారెడ్డి జిల్లా మ‌ద్నూర్ మండ‌లం షేక‌పూర్ గ్రామానికి చెందిన బోయినివార్ మొగుల‌జీ , బోయినివార్ శోభభాయి  దంప‌తులు. వ్య‌వసాయ కూలీలుగా ప‌నిచేసుకుంటు జీవ‌నం సాగిస్తున్నారు. అయితే  8నెలల క్రితం మొగులజీ  కూతురుకు వివాహం చేశారు. కూతురు పెళ్లితో మొగులాజీ, శోభభాయి దంప‌తుల‌ు అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చేందుకు భార్యభర్తలిద్దరూ వ్యవసాయ పనుల కోసం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దగ్గరలోని ఇబ్రహీంపట్నం గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న మొగులాజీ రోజూ గొడవపడే వాడు.తమ్ముళ్లతో హత్య చేయిన భార్య..

ఆగ‌ష్టు15న కూతురు శ్రీమంతం కోసం మొగుల‌జీ , బోయినివార్ శోభభాయి  దంప‌తులు కోటగిరి వచ్చారు.  ఆగ‌ష్టు17న శ్రీమంతం అయ్యాక‌ మొగులజీ, తన భార్య శోభ తో కలిసి కోటగిరి నుండి మీర్జాపూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు రాత్రి బంధువుల ముందు మొగులజీ మద్యం తాగిన మైకంలో భార్య శోభను కొట్టి..  అవమానించాడు. దీంతో మన‌స్తాపానికి గురైన శోభబాయి ఎలాగైనా తన భర్త ను చంపాలని తన చిన్నమ్మ కొడుకు సంతోష్‌కి ఫోన్‌ చేసి తన బాధను చెప్పుకుంది. మొగులజీని చంపు లేదా నేను చస్తానంటూ చెప్పింది.


Telangana : హాస్టల్‌ స్టూడెంట్ శవంతో బంధువులు రోడ్డుపై ఆందోళన .. చావుకు కారణమైన వారిపై చర్యలకు డిమాండ్48గంటల్లో బయటపడ్డ నిజం..

సోదరి ఫోన్‌తో సంతోష్ తన సొంత తమ్ముడు సుభాష్‌తో కలిసి బావ మొగులజీ వార్నింగ్ ఇచ్చారు. గొడవపడవద్దని హెచ్చరించినప్పటికి మార్పు రాకరపోవడంతో శోభ, సంతోష్ , సుభాష్ ముగ్గురూ కలిసి మొగులజీ చంపాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి సంతోష్ బావ‌ మొగులజీ కి ఫోన్ చేసి తన బైక్ మీద నస్రుల్లాబాద్ నుండి బిచ్‌కుంద తీసుకొని వస్తుండగా దారి మధ్యలో ద్వారకానగర్ వెంచర్‌లోకి రమ్మని ఫోన్ ద్వారా పిలిపించాడు. అక్కడికి వచ్చిన బావ మొగులజీకి ఇద్దరూ బావమరదులు మద్యం తాగించారు. ఫూటుగా మద్యం తాగిన తర్వాత సిమెంట్ దిమ్మెతో మొగులజీ  మొఖం మీద బలంగా కొట్టి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మర్డర్ కేసును రెండ్రోజుల్లో చేధించారు.

First published:

Tags: Kamareddy, Telangana crime news, Wife kill husband

ఉత్తమ కథలు