Home /News /telangana /

NIZAMABAD WIFE KILLED HER HUSBAND FOR HAVING AN EXTRA MARITAL AFFAIR IN KAMAREDDY DISTRICT SNR NZB

Crime news : ప్రియుడే ముద్దు .. మొగుడు వద్దు కామారెడ్డి జిల్లాలో వివాహిత చేసిన దారుణం అంతా ఇంతా కాదు

(ప్రియుడి కోసం భర్తను ..)

(ప్రియుడి కోసం భర్తను ..)

OMG: ప్రియుడితో పొందుతున్న శారీరక సుఖం ఆమెను నేరస్తురాలిగా మార్చింది. తాత్కాలిక ఆనందంతో నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంది. తండ్రి లేక..తల్లి జైలుపాలు కావడంతో ముగ్గురు బిడ్డలు అనాధలుగా మారారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణ జరిగింది.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    భార్య, భర్తల మధ్య ఉండే నూరేళ్ల బంధం కాస్తా మూడు నాళ్ల ముచ్చటగా మారుతోంది. తాత్కాలిక సంతోషం, శారీరక సుఖం, డబ్బు వ్యామోహంతో కట్టుకున్న మొగుడ్ని భార్యే కాటికి పంపిచిన దారుణ సంఘటన కామారెడ్డి(Kamareddy)జిల్లాలో చోటుచేసుకుంది. జీవనోపాధి వలస వచ్చిన జంటలో భర్త హత్యకు గురవడంతో భార్య జైలు(Prison)పాలైంది. ముగ్గురు పిల్లలు దిక్కులేని వాళ్లుగా మారారు. ఎల్లారెడ్డి(Ellareddy)లో కేవలం భర్తతో శారీరక సుఖం కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది.

    మొగుడు కంటే ప్రియుడే ఎక్కువ..
    కర్ణాటక చెందిన రమేష్ అనే 30సంవత్సరాల యువకుడు తన భార్యతో కలిసి వికారాబాద్ పట్టణంలో వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. ఇద్దరికి ఎనిమిది సంవ‌త్స‌రాల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్ల‌ల‌లో క‌లిసి ఎల్లారెడ్డిలో నివాసముంటున్నారు. ఆ సమయంలో వికారాబాద్ టౌన్‌కి చెందిన దస్తప్పాతో రమేష్‌ భార్య వెన్నెల వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు దస్తప్పతో తరచూ శారీరకంగా కలుస్తూ ఉండేది. ఈవిషయంలోనే భర్త ఆమెతో గొడవపడేవాడు. అయినప్పటికి భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు.



    శారీరక సుఖం కోసమే..
    ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనములో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. తన భార్య వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందనే కారణంతోనే రమేష్ ఫ్యామిలీని వికారాబాద్ నుంచి ఎల్లారెడ్డికి మార్చినప్పటికి ఆమెలో మార్పు రాలేదు. ఎల్లారెడ్డికి చేరుకున్నప్పటికి ప్రియుడు దస్తప్పను ఇంటికి పిలిపించుకొని పలుమార్లు శరీరక సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో మరోసారి భార్యను హెచ్చరించాడు.ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని..అతడ్ని చంపేస్తే తాను ప్రియుడితో సుఖంగా ఉండవచ్చనే ఆలోచన చేసింది రమేష్‌ భార్య.

    OMG: జగిత్యాల జిల్లాలో భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ ఇద్దరు భార్యలు ఏం చేశారంటే



    భర్త చంపి భూమిలో పాతిపెట్టిన భార్య..
    ప్రియుడు దస్తప్పతో కలిసి భర్తను చంపడానికి వేసిన పథకం వేసిన వెన్నెల గత నెల 30వ తేదిన రమేష్‌ను హత్య చేసి అతను వాచ్‌మెన్‌గా పని చేస్తున్న నిర్మాణ భవనంలోనే పాతిపెట్టారు. భర్తను హతమార్చిన తర్వాత వెన్నెల కర్నాటకలోని స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు భర్త రమేష్ ఏమయ్యాడని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన రమేష్ కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో ఎల్లారెడ్డి సీఐ, ఎస్‌ఐ మృతుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న భవనం దగ్గరకు వెళ్లి గోడ కింద తవ్వి చూడటంతో రమేష్ శవం బయటపడింది.

    Mulugu: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జిల్లా కలెక్టర్: రూ. కోట్లలో ఆదాయం తెస్తున్నఆ ఐడియా..



    అనాధలైన ముగ్గురు పిల్లలు..
    రమేష్ మృతదేహాన్ని పోస్ట్‌ మార్టంకు పంపించిన పోలీసులు కేసు విచారణలో భాగంగా పోలీసులు మృతుని భార్య వెన్నెల మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అందులో ప్రియుడు దస్తప్పతో ఎక్కువ సార్లు ఫోన్‌కాల్స్ చేసి మాట్లాడినట్లుగా గుర్తించారు. ఈకేసులో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆమె తన ప్రియుడి తో కలిసి రమేష్‌ను హత్య చేసినట్టు తెలిపింది. త‌న సుఖం కోసం క్ష‌ణికావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌తో క‌ట్టుకున్న భ‌ర్త‌ను, సొంత పిల్ల‌ల‌కు దూర‌మై క‌ట‌కాటాల పాలైంది తల్లి తీచేసిన తప్పుకు పిల్లలు అనాధలయ్యారు.

    Mulugu: గిరిజన మహిళలకు బిజినెస్​ పాఠాలు: స్వయం ఉపాధిపై శిక్షణ తరగతులు.. పూర్తి వివరాలివే..


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Crime news, Extra marital affair, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు