(P.Mahendar,News18,Nizamabad)
గత కొన్ని రోజులుగా వీఆర్‌ఏలు న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ (KCR)ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ అమలు కోసం గత జులై 25 నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే పే స్కెల్ అమలవుతుందో లేదో అనే దిగులుతో కామారెడ్డి(Kamareddy)జిల్లాలో ఓ వీఆర్ఏ(VRA) బలవన్మరణం చేసుకోవడం కలకలం రేపింది. నాగిరెడ్డిపేట (Nagireddypet)మండలంలోని బొల్లారం(Bollaram)గ్రామానికి చెందిన కోరబోయిన అశో క్(Ashok)అనే పాతికేళ్ల యువకుడు వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. గత 42 రోజులుగా పే స్కేలు అమలు చేయాలని వీఆర్ఎలు నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో సమ్మెలో పాల్గొంటున్నారు.
మనస్తాపంతో సూసైడ్..
నెల రోజులకు పైగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న అశోక్ పే స్కేలు అమలు కాదనే లేదని మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి బొల్లారం వీఆర్ఎ అశోక్ తన గ్రామంలోని చెరువు కట్ట దగ్గరున్న దుర్గమ్మ ఆలయ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ మృత దేహాన్ని ఆదివారం ఉదయం పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శవంతో ఆందోళన..
అయితే విషయం తెలుసుకున్న అశోక్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అశోక్ కుటుంబ సభ్యుల నిరసనకు ఎల్లారెడ్డి మండల పరిధిలోని వీఆర్ఏలు, అన్నీ రాజకీయ పార్టీ నేతలు మద్దతు పలికారు. ధర్నాలో పాల్గొన్నారు. అశోక్ ఆత్మహత్యకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమంటూ వీఆర్ఏలు ఇతర పార్టీ నాయకులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తారాస్థాయికి నిరసనలు ..
అయినా ఎవరు వినకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు సైతం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధమవుతున్నారు. చనిపోయిన అశోక్ కుటుంబానికి అండగా ఉంటామని స్థానిక రాజకీయ పార్టీల నేతలు సైతం మద్దతు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Suicide, Telangana News