హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఆ ప‌ల్లేలో మ‌ద్యం సీసాలు క‌నిపిస్తే చాలు అంతే సంగ‌తులు.. ఎందుకంటే..

OMG: ఆ ప‌ల్లేలో మ‌ద్యం సీసాలు క‌నిపిస్తే చాలు అంతే సంగ‌తులు.. ఎందుకంటే..

గ్రామపంచాయతీ కార్యాలయం

గ్రామపంచాయతీ కార్యాలయం

Nizamabad: తెలంగాణ రాష్ట్రంలో మ‌ద్యం దందా మూడు పూవులు.. ఆరు బీర్లు అన్న‌ట్టుగా సాగుతుంది.. అయితే ఆ ప‌ల్లేలో మాత్రం మ‌ద్యం గ‌త నెల రోజుల క్రితం ఏరులై పారింది.. కానీ ఇప్పుడు మద్యం కనిపిస్తే చాలు.. బాటిళ్లు పగలకొడతారు.. మద్యం విక్రయిస్తే.. సదరు వ్యక్తి మెడలో మందూ బాటిళ్లు వేసి ఊరేగిస్తారు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

పి మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు, నిజామాబాద్.

పచ్చని పల్లెల్లో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. మహిళలు, గ్రామాబివృద్ది క‌మీటి మద్యం పై పోరు ప్రకటించాయి. దీంతో మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్క‌నూర్ మండ‌లం పెద్ద మల్లారెడ్డి గ్రామం . ఈ గ్రామంలో సుమారు 11 వేల మంది జనాభా ఉంది. 8 వేల మంది ఓటర్లు ఉన్నారు. గ్రామం పేరుకు తగ్గట్టే..  బెల్టు షాపులు కూడా ఎక్కువ గానే ఉన్నాయి.  పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.  22 బెల్ట్ షాపులు ఈ ఒక్క గ్రామంలో ఉన్నాయంటే.. మద్యం విక్రయాలు ఏ స్దాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.  మద్యానికి బానిసైన యువకులు.. వరుసగా మృత్యువాత పడుతుండటం గ్రామస్ధులను ఆందోళనకు గురి చేసింది.

కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆగ్రహించిన గ్రామస్ధులు.. మద్యాన్ని గ్రామంలోకి రాకుండా కట్టడి చేయాలని మద్య నిషేధానికి ఏకగ్రీవ తీర్మాణం చేశారు...  గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేశారు... ఐతే కొందరు అక్రమంగా మద్యం విక్రయాలు చేప‌ట్ట‌డంతో రెండు రోజుల క్రితం 30 వేల మద్యం బాటిల్స్ ను  గ్రామ‌స్తులు, మహిళ‌లు ధ్వంసం చేశారు.. పచ్చని కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతుండటంతో మహిళలు.. మద్యం పై పోరుబాట పట్టారు.

అయితే పెద్ద మల్లారెడ్డిలో గ్రామ‌స్తులు.. మ‌హిళాలు సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించారు.. మద్యం అమ్మితే భారీగా జరిమానా విధించడంతో పాటు.. మెడలో మద్యం బాటిళ్లు వేసి.. ఊరంతా తిప్పుతున్నారు. మద్యం బాటిల్ కనిపిస్తే చాలు.. మహిళలు ధ్వంసం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధగా.. పెద్ద మల్లారెడ్డిలో 22 బెల్ట్ షాపులు ఉండటం, మద్యం కల్తీ చేస్తూ..ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం ఆడుతుండటంతో.. గ్రామాభివృద్ది కమిటీ బెల్ట్ షాపులను నిషేధించింది. గ్రామంలో.. మద్యం అమ్మకాలు చేయరాదని తీర్మానించింది. అయితే గ్రామ పెద్ద‌లు మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో నెల రోజులుగా బెల్ట్ షాపులు మూతపడ్డాయి. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి.

ఐతే కొందరు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ వ్యాపారులు.. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేస్తుండటంతో.. మహిళలు ఇలా తమ ప్రతాపం చూపెడుతున్నారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేస్తూ.. వ్యాపారి మెడలో బాటిళ్లు వేసి ఊరేగిస్తున్నారు. మా గ్రామంలో మ‌ద్యం విక్ర‌యాలు రాత్రి ప‌గ‌లు తేడ లేకుండా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి.. దీంతో 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గల యువ‌కులు మద్యానికి బానిస‌లై.. ఇంట్లో భార్యల‌ను హింసించ‌డం..  ఇంట్లో ఉన్న డ‌బ్బులు.. బంగారు న‌గ‌లు, బియ్యం అమ్ముకుని తాగుతున్నారు.  చివ‌ర‌కు ఆనారోగ్యం పాలై మృతి చెందుతున్నారు.. దీంతో చిన్న చిన్న పిల్ల‌లు ఆనాదాలుగా మారుతున్నారు.

దీంతో గ్రామస్తులు అంత క‌లిసి కులానికి ఇద్ద‌రు చోప్పున గ్రామంలో ఓ క‌మిటిని ఏర్పాటు చేసాము.. ఆ క‌మీటి గ్రామంలో సంపూర్ణ మ‌ద్య నిషేదం చేయాల‌ని నిర్ణం తీసుకున్నాము.. గ్రామంలో ఎవ‌రు మ‌ద్యం అమ్మిని మ‌హిళ స‌హ‌కారంలో మ‌ద్యం బాటిల్ ప‌గుల గోడుతున్నాము.. అ మ‌ద్యం సీసాల‌ను మేడ‌లో వేసి గ్రామంలో ఊరేగింపు చేస్తున్నామ‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు..  రెండునెలలుగా మా గ్రామంలో మద్యపానా నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్న‌మ‌ని ఎర్కోల సాయిలు  చెబుతున్నారు.. గ్రామంలో పది పదిహేను మంది  యువకులు చనిపోయారు.

ఎందుకు చనిపోయారని విచారిస్తే వారు మద్యానికి బానిస వడం వల్ల చనిపోయినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు.  దీంతో కులానికి ఇద్ద‌రు చోప్పున‌ తీసుకొని గ్రామాభివృద్ది క‌మీటి ఏర్పాటుచేసి సంపూర్ణ మద్యనిషేధం ఏర్పాటు చేసాము అన్నారు..   అయితే మద్యం పోరుబాటలో.. పెద్ద మల్లారెడ్డి పల్లె చైతన్యానికి.. ఎక్సైజ్ అధికారుల సహకారం కరువైంది. ఇప్పటి కైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెద్ద మల్లారెడ్డి పల్లెకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మద్యం పై పోరుకు సహకారం అందించాలని గ్రామస్ధులు ముక్త కంఠంతో కోరుతున్నారు..

First published:

Tags: Liquor ban, Nizamabad, Telangana

ఉత్తమ కథలు