ఎన్నికల హామీని అమలుచేయకపోవడంతో సర్పంచ్ భర్త పై గ్రామస్తులు దాడి...

సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చలేదంటూ గ్రామస్తులు సర్పంచ్ భర్తపై దాడి చేశారు.

news18-telugu
Updated: July 26, 2020, 7:37 PM IST
ఎన్నికల హామీని అమలుచేయకపోవడంతో సర్పంచ్ భర్త పై గ్రామస్తులు దాడి...
సర్పంచ్ భర్తపై దాడిచేస్తున్న గ్రామస్తులు
  • Share this:
(మహేందర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స గ్రామ సర్పంచ్ చిల గంగామణి భర్త గంగారాం పై గ్రామస్థులు దాడికి దిగారు. సర్పంచ్ ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి అవసరమైన 2 ఎకరాల 7 గుంటల భూమిని విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారు. మరికొందరు సైతం ఎన్నికల్లో భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చినా గంగారాం గత ఎన్నికల్లో పలుమార్లు ఓడిపోవడం తో గ్రామస్థులు ఆయనకు అవకాశం ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం సర్వే నెంబర్ 143/A లో భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. హామీ ఇచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు భూమి ఇవ్వకపోవడం గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు గ్రామంలో పాఠశాల భవనానికి, రైతు వేదిక భవనాల నిర్మాణానికి స్థలం లేదు. సర్పంచ్ హామీ ఇచ్చి స్థలం విషయంలో మిన్నకుండి పోవడంతో గ్రామస్థులు ఏకమై సర్పంచ్ భర్త గంగారాంని నిలదీశారు. తనకు ఎవరు సహకరించడం లేదని తను స్థలం ఇవ్వనంటూ మొండికేయడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. స్థలం ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థలం కబ్జా చేసి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి వినియోగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.


ఎన్నికల హామీ నెరవేర్చలేదని సర్పంచ్ భర్తపై గ్రామస్థులు దాడికి పాల్పడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 26, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading