Home /News /telangana /

NIZAMABAD TWO THIEVES MADE STRANGE DEMANDS AFTER BEING CAUGHT IN A VILLAGE IN NIZAMABAD NZB PRV

Thieves: దొంగల వింత డిమాండ్​.. ఐదుగురం దొంగతనం చేశాం.. ఇద్దరినే పట్టుకుంటే ఎలా?

పట్టుబడిన దొంగలు

పట్టుబడిన దొంగలు

దొంగే దొంగా.. దొంగా అన్న‌ట్టుగా ఉంది ఈ వ్య‌వ‌హ‌రం.. గ్రామంలో త‌ర‌చూ చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేస్తున్న ముఠా నుంచి ఇద్ద‌రు స‌భ్యుల‌ను  గ్రామ‌స్తులు ప‌ట్టుకున్నారు.. వారిని ప్ర‌శ్నిస్తే వాళ్లు చేసిన డిమాండ్​ ఊరి వాళ్లను షాక్​ అయ్యేలా చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P. Mahender, News18, Nizamabad) దొంగే దొంగా.. దొంగా అన్న‌ట్టుగా ఉంది ఈ వ్య‌వ‌హ‌రం.. గ్రామంలో త‌ర‌చూ చిల్ల‌ర దొంగ‌త‌నాలు (Theft) చేస్తున్న ముఠా నుంచి ఇద్ద‌రు స‌భ్యుల‌ను (Thieves)  గ్రామ‌స్తులు ప‌ట్టుకున్నారు.. వారిని ప్ర‌శ్నిస్తే గ‌త కొంత కాలంగా చోరీలు చేసిన మాటా వాస్తవమే.. కానీ వారి ముఠాలోని మ‌రో ముగ్గురు కూడా ఉన్నారు.. వారిని కూడా తీసుకు వ‌చ్చి మా అందరినీ ఒకే సారి పోలీసుల‌కు ప‌ట్టించండ‌ని డిమాండ్ చేస్తున్నారు.. ఇది విన‌డానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం.. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్  (Nizamabad) జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో కొంతకాలంగా వ‌రుస చోరీలు జ‌రుగుతున్నాయి  గ్రామానికి చెందిన ముగ్గురు..  నిజామాబాద్ న‌ర‌గానికి చెందిన మ‌రో ఇద్ద‌రితో ముఠాగా ఏర్ప‌డ్డారు. గత కొద్దిరోజులుగా ఈ ముఠా గ్రామంలో వ‌రుస చోరీల‌కు పాల్ప‌డుతోంది. దీంతో గ్రామ‌స్తులు వారిని (Thieves)  ప‌ట్టుకునేందుకు పథకం వేశారు. అలా ఉదయం టాక్టర్​ బ్యాటరీ చోరీ చేస్తున్న ఇరువురిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.  పట్టుకొని నిర్బంధించారు. గ్రామ చావిడిలో వారిని విచారించగా మొత్తం ఐదుగురు యువకులు (Five Thieves)  కలిసి గత కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. అయితే నిందితులను గతంలోనే పోలీసులకు పట్టించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.. గ్రామంలో విచ్చలవిడిగా పేకాట, మట్కా, బహిరంగంగా సాగుతుంటే ఇటు వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదని గ్రామ‌స్తులు  ఆగ్రహం వ్యక్తంచేశారు.. ప్రతి రోజు గ్రామంలో ఏదో ఒక చోట దొంగతనాలు జరిగిన సంఘటనలు ఉన్నప్పటికీ పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. దొంగలను పోలీసులకు అప్పగిస్తే  వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేశారని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకొని గస్తీ పెంచాలని కోరుతున్నారు.. కాగా, ఐదుగుర‌ం ముఠాగా ఏర్పడి చోరిల‌కు పాల్ప‌డిన మాట వాస్తవం అని పట్టుబడిన దొంగ.. మోహ‌న్ చెబుతున్నాడు.. ‘‘పోచారం గ్రామానికి చెందిన బుర్ల శ్రీనివాస్, నాగ‌రాజు, నిజామాబాద్ న‌గ‌రానికి చెందిన మ‌లిపెద్ది కార్తిక్, కార్తీక్ స్నేహితుడు శేఖ‌ర్ వీరిద్ద‌రు ఆటో న‌డిపిస్తారు.. మేం ఐదుగుర‌ం మొద‌ట గ్రామంలోని కొళ్ల ఫారంలో ఇనుప రాడ్లు విప్పి చోరీకి పాల్ప‌డ్డాం.. తరువాత రెండు రోజుల‌కు జేసీబీ బ్యాట‌రీ చోరీ చేశాం..  ఆ బ్యాట‌రీని దొంగలించిన మాట వాస్తవమే.. కానీ నాకు అ బ్యాట‌రీ డ‌బ్బులు ఇవ్వ‌లేదు.. అయితే మేం దొంగ‌ల‌మే.. దొంగ‌త‌నం చేసిన మాటా వాస్తవమే.. కానీ మాతో క‌లిసి చోరీల‌కు పాల్ప‌డిన వారిని ర‌ప్పించి అంద‌రిని క‌లిసి పోలీసుల‌కు ప‌ట్టించండి’’ అని దండుగుల మొహ‌న్ డిమాండ్ చేయడం గమనార్హం.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Nizamabad, Telangana, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు