(P.Mahendar,News18,Nizamabad)
పోట్ట కూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చారు. పగలంతా వీధుల వెంట తిరుగుతూ బెడ్ షీట్లు(Bed sheets),చద్దర్లు అమ్ముతుంటారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడం ...సరిగ్గా రాత్రి వేళల్లో అదే ఇళ్లలో చోరీలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ఈ విధంగా పోలీసుల కళ్లు గప్పి నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో కేంద్రంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు గుల్ల చేస్తున్నారు. దీంతో వీళ్ల చోరవృత్తి మూడు పువ్వులు, ఆరు ఆరు కాయలుగా సాగుతుంది. యూపీ(UP),రాజస్ధాన్(Rajasthan)కు చెందిన ఇద్దరు కిలాడీల ఆగడాలపై కన్నేసిన పోలీసులు(Police) ఎట్టకేలకు వాళ్లను పట్టుకున్నారు. దొంగతనం చేసి తిన్నదంతా కక్కించారు.
పగలు ఆ బిజినెస్..నైట్ మరొకటి..
నిజామాబాద్ నగరంలో పట్టపగలు మ్యాట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ రాత్రిళ్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఛటాకు చెందిన మహేంద్ర ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా బగద్ రాజపుర్ లో ఉంటున్నాడు. అయితే అదే ప్రాంతాన్నికి చెందిన అమర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు నిజామాబాద్ జిల్లా శివారులో గుడారాలు వేసుకొని ఉండి మద్యాహ్నం పూట ఊర్లలో తిరుగుతూ మ్యాట్లు ,బెడ్ షీట్లు అమ్ముతూ అదే సమయం లో తాళం వేసిన ఇండ్లను గమనిస్తారు. చీకటి పడగానే తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చొరబడి బంగారు నగలు, డబ్బు దొంగిలించడం పనిగా పెట్టుకున్నారు.
వీధి వ్యాపారులతో జాగ్రత్త..
తాళాలు వేసి ఉన్న ఇళ్లలోనే కాదు ఇంట్లో ఎవరైనా ఉన్నప్పటికి లోపలికి టెక్నిక్‌గా చొరబడి లోపల వేసుకున్న గొళ్లెం తొలగించి యజమాని పడుకున్న గదిలో కాకుండా వేరే గదిలోకి చొరబడి నగలు, డబ్బు దొంగిలిస్తారాని సీపీ తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్లో మ్యాట్లు , బెడ్ షీట్లు అమ్ముతున్నట్లు నటించి ఎవరైన ముసలి వాళ్ళు, చూడటానికి డబ్బున్న ముసలి వాళ్ళను ఎంచుకుని వారి వద్ద ఏవైన బంగారు నగలు లేదా హ్యాండ్ బ్యాగ్‌లను దొంగిలించడంలో సిద్ధహస్తులని పోలీసులు తెలిపారు.
అపరిచితులతో అప్రమత్తం..
నగరంలోని అశోక్ వీధికి చెందిన ప్రసాద్ జోషి అనే పురోహితుడు ఇంట్లో ఆగస్ట్ నెలలో చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఇంచార్జి నగర సిఐ విజయ్ బాబు, రెండవ టౌన్ ఎస్సై పూర్ణేశ్వర్ ఆధ్వర్యంలో రాజస్థాన్ కు చెందిన మహేంద్ర అలియాస్ నాయక్, అమర్ సింగ్ ఇద్దరిని అరెస్టు చేశారు. పట్టుబడిన దొంగల నుంచి 7 లక్షల 75 వేల సొత్తును రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. నగరంలోని వీదుల్లో ఆనుమానస్పందంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ నగర ప్రజలకు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.