(P.Mahendar,News18,Nizamabad)
కూతురు పుట్టిన రోజును తిరుమ(Tirumala)లలో జరుపుకుందామని ఓ కుటుంబం ప్రయాణం అయింది. అయితే మరి కొన్న గంటల్లో స్వామి వారి వద్దకు చేరుకుంటాము అనగా రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందగా.. తండ్రి మరో కూతురు కు త్రీవ్ర గాయలు అయ్యాయి. ఈ ఘటన ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తెలంగాణలోని నిజామాబాద్(Nizamabad)జిల్లాకు చెందిన ఫ్యామిలీ కారులో వెళ్తుండగా మార్గం మధ్యలో జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal)జిల్లాలో ప్రమాదానికి గురైంది.
వెంటాడిన మృత్యువు..
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మెరుగు ప్రకాశ్. గత పదేళ్ల క్రితం బాన్సువాడలోని శాంతినగర్ కాలనీలో కుటుంబంతో స్థిరపడింది. అయితే మెరుగు ప్రకాశ్ మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిసెంట్‌గా పని చేస్తున్నారు. ప్రకాశ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు శిరీష (21) బర్త్ డే శనివారం కావడంతో కూతురి పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామి సన్నిధిలో జరుపుకోవాలని భావించారు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం కారులో మెరుగు ప్రకాశ్, భార్య లక్ష్మి, రెండో కూతురు శిరీష, చిన్న కూతురు మానసతో కలిసి తిరుమలకు ప్రాయాణమయ్యారు.
బర్త్ డే రోజు విషాదం..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం 44వ జాతీయ రహదారి ధర్మవరం స్టేజీ సమీపంలో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మి, శిరీష అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశ్, మానసలకు గాయాలయ్యాయి. వారిని కర్నూల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన కుటుంబంతో దైవ దర్శనం కోసం బయల్దేరితే ఈవిధంగా జరగడం దురదృష్టకరమని స్థానికులు అంటున్నారు. అయితే ప్రకాష్ కుటుంబంలోని అందరు కలిసి వెల్లడం అందులో ఇద్దరు మృతి చెంది మరో ఇద్దరు గాయలపాలవ్వడంతో వారు నివసిస్తున్న కాలనీలో విషాదాన్ని నింపింది.
శోకసంద్రంగా మారిన కాలనీ..
తల్లి, సోదరి చనిపోవడం, మరో సోదరి, తండ్రికి గాయలైన విషయం తెలుసుకొని పెద్ద కూతరు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గాయపడిన ప్రకాష్‌తో పాటు ఆయన రెండో కుమార్తెకు చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న బంధువులు పుట్టిన రోజు నాడు ఇంతటి విషాద వార్త వింటామని అనుకోలేదని విచారం కన్నీటిపర్యంతమవుతుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Road accident, Telangana News