హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : ఆడుకుంటున్న చిన్నారులను పరుగులు పెట్టించిన కోతుల గుంపు .. భయపడిన నలుగురిలో ఇద్దరు..

Sad news : ఆడుకుంటున్న చిన్నారులను పరుగులు పెట్టించిన కోతుల గుంపు .. భయపడిన నలుగురిలో ఇద్దరు..

NIZAMABAD SAD NEWS

NIZAMABAD SAD NEWS

Sad news: దసరా సెలవుల్లో సరదాగా ఆడుకుంటుంటే కోతుల గుంపు రావ‌డంతో భయపడిన నాలుగురు చిన్నారులు భ‌యంతో చెరువులో దుకారు. అందులో ఇద్ద‌రు చిన్నారులు మృతి చెంద‌గా .. మ‌రో ఇద్ద‌రిని స్థానికులు కాపాడారు.. పండగ పూట ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. ఇంతటి విషాద సంఘటన ఎక్కడ జరిగిందంటే..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma)పండుగ రోజు చావు కబురు వింటామని ఆ రెండు కుటుంబాలు ఊహించలేకపోయాయి. దసరా(Dussehra)సెలవుల్లో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్లారని తల్లిదండ్రులు అనుకున్నారు. కాని ఆ పిల్లల ప్రాణాలకు కోతుల బెడదే కారణమవుతుందని ఊహించలేకపోయారు. నిజాబాబాద్(Nizamabad)జిల్లాలో వానరసైన్యం(Monkeys)కారణంగా పిల్లల ప్రాణాలు పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతి చెందగా ..మరో ఇద్దరిని స్థానికులు కాపాడగలిగారు.

  Telangana : గాంధీజీని దేవుడిగా కొలుస్తున్న గ్రామస్తులు .. మహాత్ముడికి అక్కడ నిత్య పూజలు

  కొంప ముంచిన కోతులు..

  నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి ప‌ల్లి గ్రామంలో 12ఏళ్ల అఖిల్...13సంవత్సరాల రాజేష్, అభిలాష్, హన్మంతులు అనే నలుగురు బాలురు కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయడానికి సోమవారం సాయంత్రం చెరువు గట్టుకు వెళ్లారు. అక్కడ ఉన్న కోతులు వీరిని తరిమి వేయడంతో నలుగురు భయంతో పరుగులు పెట్టారు. కోతుల వెంటపడటంతో నలుగురు బాలురు ఎటు వెళ్లాలో తెలియక చెరువులో పడిపోయారు.

  నలుగురిలో ఇద్దరు సేఫ్..

  గ్రామంలో చిన్నారులు చెరువులో పడిన విషయాన్ని గమనించిన ్సతానికులు వెంటనే కోతులను తరిమివేసి హన్మంత్, అభిలాష్‌ను కాపాడాడు. మిగిలిన ఇద్దరు అఖిల్, రాజేష్ అప్పటికే నీటిలో మునిగి చనిపోయారు. మృతులు అఖిల్ 7వ తరగతి, రాజేష్ 8వ తరగతి చదువుతున్నారు. వీరు దసరా సెలవులకు ఇంటికి వచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా చెరువులో గాలించి ఇద్దరి శవాలను బయటకు తీశారు.

  Telangana : సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు .. అక్కడ ఒక్కో రైతు నెలకు ఎంత సంపాధిస్తున్నారో తెలుసా..?

  పండుగ పూట విషాదం..

  పండుగకు ఒకరోజు ముందు  కొడుకుల మరణాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అఖిల్ చెరువు వద్దే మృతి చెందినప్పటికీ .. కొడుకు బతికే ఉన్నాడన్న ఆశతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని నార్త్ రూరల్ సిఐ నరహరి, ఎస్ ఐ చెరుకుని వివరాలను సేకరించారు.

  Hyderabad: ట్రాఫిక్ పోలీసులు ఆపారనే కోపంతో బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ...వీడియో ఇదిగో

  వరుస విషాదాలు..

  దసరా సెలువుల్లో సరదాగా గడపవచ్చనుకుంటున్న పిల్లలకు తెలంగాణలో ఇదే తరహా సంఘటనలు భయపెడుతున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మొత్తం డజన్ మంది పిల్లలు నీళ్లలో, నీటి గుంతల్లో, చెరువుల్లో పని చనిపోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ముగ్గురు, ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు వరుసగా జలసమాధి అయ్యారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Telangana News

  ఉత్తమ కథలు