హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ .. తనను సంప్రదించిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ట్వీట్

Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ .. తనను సంప్రదించిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ట్వీట్

MLC Kavitha - File Photo

MLC Kavitha - File Photo

Kalvakuntla Kavitha: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. ఫ్లూ లక్షణాలు కలిగి ఉండటంతో కోవిడ్ టెస్ట్‌ చేయించుకున్నారు కవిత. రిపోర్ట్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె తనకు కోవిడ్ పాజిటివ్‌ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ (TRS mlc)కల్వకుంట్ల కవిత Kalvakuntla Kavithaకరోనా బారినపడ్డారు. ఫ్లూ లక్షణాలు కలిగి ఉండటంతో కోవిడ్(Covid) టెస్ట్‌ చేయించుకున్నారు కవిత. రిపోర్ట్ పాజిటివ్‌(Positiv)గా నిర్ధారణ కావడంతో ఆమె తనకు కోవిడ్ పాజిటివ్‌ వచ్చిందని సోషల్ మీడియా (Social media)ద్వారా వెల్లడించారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని...ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని ఆందోళన చెందాల్సిన పని లేదని ట్వీట్ చేశారు. గడిచిన రెండు రోజుల నుంచి తనను సంప్రదించిన వాళ్లు, కలిసిన వాళ్లకు ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వాళ్లు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఎవరికి వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా వైరస్‌ని వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు.

త్వరగా కోలుకోవాలని ట్వీట్స్..

మరోవైపు కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోని నెగిటివ్‌ రిపోర్ట్‌ రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Covid positive, Kalvakuntla Kavitha, Telangana News

ఉత్తమ కథలు