(న్యూస్ 18 తెలుగు ప్రతినిధి, పి మహేందర్)
గత యేడున్నర సంవత్సరాలుగా తెలంగాణ (Telangana) రాష్ట్రానికి బీజేపీ శనిలా ఉందని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి (Jeevan reddy) మండిపడ్డారు. సడేసాత్ బీజేపీ అని దుయ్యబట్టారు. ఎంపీ అరవింద్ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి పనిలో ఉన్నారని ఆరోపించారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ (BJP)పై నిప్పులు చేరిగారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని జీవన్ రెడ్డి (Jeevan reddy) అన్నారు. మేం అభివృద్ధి గురించి మాట్లాడితే ఎంపీ అర్వింద్ మాత్రం మత విద్వేషాలను రెచ్చగొట్టడం గురించి మాట్లాడుతారు. ఎంపీ అర్వింద్ (MP Aravindh) అంటే పెద్ద ఫేక్, ఫ్రాడ్ అని ఆరోపించారు జీవన్‌రెడ్డి. తెలంగాణ గురించి, తెలంగాణ పుట్టుక గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Pm narendra modi) చేసిన వ్యాఖ్యలు ఎంపీ అర్వింద్ సమర్థించడం సిగ్గుచేటన్నారు. మోదీ వాఖ్యలు సమర్ధిస్తే తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆయనను కొడతారు.. పన్నెండు వందల మంది అమరవీరుల ఆత్మ బలిదానలతో తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అని జీవన్‌రెడ్డి తెలిపారు. అలాంటి రాష్ట్రం గురించి ప్రధానమంత్రి ఎలా మాట్లాడారని, ఆయనను సమర్ధించడం ఎంతవరకు సమంజసమని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.
ఎన్ని నిధులు తెచ్చావో శ్వేతపత్రం విడుదల చేయాలి..
నిజామాబాద్ (Nizamabad) పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని జీవన్ రెడ్డి తెలిపారు. ఎంపీ అర్వింద్ గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చావో ఎంత అభివృద్ధి చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎంపీ అరవింద్ (MP Aravindh) ను పసుపు రైతులు మాత్రమే అడ్డుకున్నారని, తెలంగాణ (Telangana) పై విషం చిమ్మిన పీఎం కు మద్దతుగా నిలిచినందుకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గ్రామ గ్రామాన తిరగకుండా అడ్డుకుంటారని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
నిధులు ఇచ్చింది లేదు.. సచ్చింది లేదు..
ఎన్నికల్లో ఎవరైనా హామీ ఇస్తారు.. కానీ బాండ్ పేపర్ (Bond paper) మీద రాసి ఎవరికీ ఇవ్వరు.. దిమాక్ లేని ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చాడని, ఇలా చేసిన వ్యక్తి ఈయన ఒక్కడే అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ సడేసాతిగా తయారైందని, నిధులు ఇచ్చింది లేదు.. సచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం జీవన్‌రెడ్డి చేశారు. మేం చేసిన అభివృద్ది చేసి తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల అందరిని రెండు సార్లు గెలిపించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ది సీఎం కేసీఆర్ తోనే సాధ్యమైందని ఆయన మరోసారి పునరుద్ఘటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dharmapuri aravind, Jeevan reddy, Nizamabad, TRS leaders