NIZAMABAD TIGERS ENTERING THE FIELDS OF NIRMAL DISTRICT FARMERS AND VILLAGERS TREMBLING WITH FEAR SNR ADB
Nirmal:పంట పొలాల్లో మాటు వేసిన పులులు..గజగజ వణికిపోయిన కాపలా రైతులు
(పొలాల్లో మాటేసిన పులి)
Tiger FEAR:నిర్మల్ జిల్లాలో చిరుత పులుల భయంతో రైతులు, ప్రజలు హడలిపోతున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లో కాపలాకు వెళ్లిన రైతులకు పులుల కదలికలు గుర్తించారు. రైతులు గుంపులుగా వెళ్లి టార్చ్‌లైట్లు వేసి వాటిని అడవిలోకి వెళ్లేలా గట్టిగా అరుపులు, కేకలు వేశారు.
దట్టమైన అడవులకు కేంద్రంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పులుల సంచారం కలకలం రేపుతోంది. అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు జనం మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే నిర్మల్ (Nirmal)జిల్లా సారంగాపూర్ (Sarangapur)మండలం బీరవెల్లి( Beervelli)గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం (Thursday)రాత్రి అటవీ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లో చిరుత పులి కనిపించింది. గ్రామ శివార్లలో చిరుత (Tigers)సంచరించినట్లుగా గుర్తించిన స్థానికులు, రైతులు హడలిపోయారు. పంట పొలాల్లో (Fields)కాపలాకు వెళ్లిన రైతులకు చిరుత అరుపులు వినిబడటంతో భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళ టార్చిలైట్లు (Torchlights) వేసుకొని తోటలో చిరుత అలజడి , కదలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూశారు. రాత్రి 10గంటల సమయంలో రైతులు టార్చ్‌లైట్లు వేసుకొని చూసిన సమయంలో పంట పొలాల్లో చిరుత కనిపించడంతో మిగిలిన రైతులకు సమాచారమిచ్చారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో మొత్తం గ్రామంలో ఉన్న 30-40మంది రైతులు టార్చ్‌లైట్లు పట్టుకొని పొలం దగ్గరకు చేరుకున్నారు. పులులను తరిమివేసేందుకు టార్చ్‌లైట్లు వెలుతురులో గట్టిగా అరుపులు, శబ్ధాలు చేశారు. అప్పటికి పులులు కదలకపోవడంతో పొలంలో అగ్గి రాజేశారు. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలను చూసి పులులు సమీపంలో ఉన్న అడవుల్లోకి వెళ్లిపోయాయని రైతులు తెలిపారు.
చెమటలు పట్టిస్తున్న చిరుతలు..
నిర్మల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో పులులు సంచారం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఎక్కువగా ఊళ్లలోకి , వ్యవసాయ పొలాల్లో కనిపించేవి. ఈమధ్య కాలంలో కాస్త తగ్గాయని ఊపిరి పీల్చుకునే సమయంలోనే మళ్లీ చిరుత పులులు పొలాల దగ్గర సంచరించడంతో గ్రామస్తులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం చిరుత పులులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పటికి సమీప గ్రామ ప్రజలు మాత్రం మళ్లీ ఏ సమయంలో వచ్చి ఊరిపై పంజా విసురుతాయోనని భయపడిపోతున్నారు.
రాత్రి వేళల్లో పొలాల్లో అలజడి..
ఎలాగైనా పులుల నుంచి రక్షణ కల్పించమని..గ్రామల పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి తమ ప్రాణాలను కాపాడని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ ప్రాంతం అంతా పులులు ఉన్నాయని అవి మనుషుల్ని ఏం చేయవని..ఎవరికి హాని తలపెట్టవని చెబుతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో పంటపొలాలు ఉన్న రైతులు రాత్రి పూట ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. అధికారులు ధైర్యం చెబుతున్నప్పటికి అటవీ ప్రాంతంలోని పొలాల్లో కాపలాకు వెళ్లాలంటే రైతులు మాత్రం గజగజ వణికిపోతున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.