Home /News /telangana /

NIZAMABAD THIEVES DIED IN A ROAD ACCIDENT NEAR KAMAREDDY WHILE STEALING AN AUTO SNR

Twist : రోడ్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్ .. మృతుల్లో ఐదుగురు దొంగలే..! అసలేం జరిగిందంటే

KAMAREDDY ACCIDENT

KAMAREDDY ACCIDENT

Road accident: ఆటో చోరీ చేసిన దొంగలకు మరణశిక్ష పడింది. నేరస్తులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. పోలీసులు ఏ కోర్టులో హాజరుపరచలేదు. కేవలం చోరీ చేసిన ఆటోలో వెళ్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అసలు ట్విస్ట్ ఇదేనంటున్నారు పోలీసులు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
కామారెడ్డి(Kamareddy) జిల్లా రోడ్డు ప్రమాదం(Road accident)లో ఆరుగురు మృతి చెందిన ఘటనలో అసలు ట్విస్ట్(Twist)బయటపడింది. ప్రమాదానికి కారణం చనిపోయిన ఆరుగురిలో ఐదుగురు పొరపాటు వల్లే జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ ఘటనలో ఏ పాపం తెలియని స్టూడెంట్ (Student)బలైపోయినట్లుగా గుర్తించారు. అంతేకాదు మృతులు ఐదుగురు ఎవరో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. నేరం చేసిన వాళ్లకు పోలీసులు(Police) వేసే శిక్ష కంటే పెద్ద శిక్షే పడిందని స్థానికులు అంటున్నారు. అసలు ఆ ప్రమాదానికి కారణం ఏమిటి..? మృతులు ఐదుగురు ఎవరో తెలుసా..?

అసలు జరిగిందేంటో తెలుసా..
కామారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోలో వెళ్తున్న ప్రయాణికుల్లో ఆరుగురు(Six people died)స్పాట్‌లోనే మృతి చెందారు. మద్నూర్ మండలం మెనూరు దగ్గర ఆటో రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా కంటైనర్ లారీని డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. స్ధానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన ఆటోలోని ఆరుగురిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేకపోవడంతో ఆటో నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆటోలో మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో అసలు నిజం బయటపడింది.

(కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ )
(కామారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ )


మృతుల్లో ఐదుగురు దొంగలే..
కామారెడ్డి మెనూరు దగ్గర ప్రమాదానికి గురైన ఆటో నిజామాబాద్ జిల్లా రుద్రూరుకు చెందిన షేక్ అస్వద్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ప్రమాదానికి గురైన ఆటో ఆదివారం చోరీకి గురైంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన ఆరుగురిలో ఆటోలో ఉన్న ఐదుగురు వ్యక్తులే ఆటోని చోరీ చేసి ఎత్తుకెళ్తినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అంతే కాదు ఆటోని చోరీ చేసిన వెంటనే గ్యాంగ్‌ మహరాష్ట్రలోని టెంగ్లూర్‌ దగ్గర ఓ బైక్‌ని ఢీకొట్టారు. తిరిగి అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. మద్నూర్‌ దగ్గర ఓ ఇంటర్ స్టూడెంట్‌ లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకొని రాంగ్‌ రూట్‌లో వెళ్తూ లారీ కింద చిక్కుకున్నారు.

Minor Girl Rape : కలెక్టరెట్‌లో కామాంధుడు .. టెన్త్ విద్యార్ధినిపై రెండేళ్లుగా అత్యాచారం ఎక్కడంటే..?



పాపం స్టూడెంట్‌ బలయ్యాడు..
పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఒక్క స్టూడెంట్ మాత్రమే అనవసరంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు. మిగిలిన ఐదుగురు ఆటో చోరీ చేసి ఎత్తుకెళ్తున్న వారేనని నిర్ధారించారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి ఆటో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాంగ్‌ రూట్‌లో నపడటమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. రెండోవది ఆటోను పోలీసులకు చిక్కకుండా పారిపోదామనే కంగారులో రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా కామారెడ్డి పోలీసులు తెలిపారు.

Cyber Crime : సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే ..సిద్దిపేట పోలీసులు చెప్పినట్లు చేస్తే చాలు



రోడ్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్ ..
కంటైనర్ ఢీకొనడంతో ఆటో ముందు భాగం పూర్తిగా కంటైనర్‌లోపలికి దూసుకుపోవడంతో నుజ్జు నుజ్జైంది. కంటైనర్‌, ఆటోకి మధ్యలోనే ఆరుగురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. బలంగా ఢీకొట్టడంతో రెండు వాహనాల మధ్య చిక్కుకుపోయిన వాళ్లను బయటకు తీసేందుకు క్రేన్‌ సహాయంతో ఆటోతో పాటు మృతదేహాల్ని బయటకు తీశారు.ఇంటర్ స్టూడెంట్ వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో మృతుని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈమొత్తం ఘటనలో ఏ తప్పు చేయని ఓ విద్యార్ధి చనిపోవడం చూసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Kamareddy, Road accident, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు