హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news: ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే ఎత్తుకెళ్లడమే వాళ్ల పని .. తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా..?

Crime news: ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే ఎత్తుకెళ్లడమే వాళ్ల పని .. తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా..?

nizamabad thieves arrest

nizamabad thieves arrest

Crime news: వాళ్లు ఒంటరిగా ఉన్న మ‌హిళాల‌ కోసం గాలిస్తూ ఉంటారు. ఎవరైనా ఆడవాళ్లు నిస్సహాయస్థితిలో కనిపించినా .. నిర్మానుష్య ప్రదేశానికి దగ్గర్లో దొరికినా వదలరు. ఎత్తుకెళ్లి ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు పోలీసులు. అలాంటి ఇద్దరు దుర్మార్గుల నుంచి నిజాన్ని కక్కించారు.    

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  నిజామాబాద్Nizamabad జిల్లాలో ఒంట‌రి మ‌హిళాల‌ే టార్గెట్‌గా చోరీలు చేస్తున్న ఇద్దర్ని పోలీసులు(Police) పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు ఎవరైనా ఒంటరి మహిళలు కనపడితే వారిని కొట్టి, చంపి వారి ఒంటి మీద ఉండే బంగారు నగలు దోచుకోవాలనే ఉద్దేశంలో నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో ఆటోలో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. గ‌త నెల 24న  నిజామాబాద్‌ చంద్ర శేఖ‌ర్‌ కాల‌నీ(Chandra Shekhar colony)కి చెందిన‌ పత్తి లక్ష్మి (Patti Lakshmi)అనే మహిళ అదృశ్యమైందని కొడుకు శివకుమార్(Sivakumar)మాక్లూర్(Maclure)పీఎస్‌లో ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారించారు. తప్పిపోయిన మహిళ మృతదేహాన్ని ఆగ‌స్టు 28న‌ డీకంపల్లి అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ల ద్వార గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వారు మహిళమీద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి హత్య చేసినట్లుగా నిర్ధారించుకున్నారు పోలీసులు. పట్టుబడిన ఇద్దరు నేరస్తులు నగలు, డబ్బు కోసం ఒంటరి ఆడవాళ్లే టార్గెట్‌గా చోరీలు, దారి దోపిడీలకు తెగ బడ్డట్లుగా నిర్ధారించారు.

  Bhadradri: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

  ఒంటరి మహిళలే టార్గెట్ ..

  పత్తి లక్ష్మీ మిస్సింగ్‌ కమ్ మర్డర్ కేసులో మిస్టరీని చేధించేందుకు విచారణ చేపట్టిన నిజామాబాద్ పోలీసులు జిల్లాలో ఇదే తరహాలో జరిగిన నేరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. నాగారంలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన అల్లేపు మల్లయ్య అలియాస్ రాజుతో పాటు కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మగేని పోశెట్టిని గుర్తించారు. ఇద్దరిలో అల్లేపు మ‌ల్ల‌య్యను అరెస్ట్ చేశారు. మ‌గేని పోశెట్టి పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నేరస్తుడు నేరం అంగీకరించడంతో తాను గతంలో చేసిన నేరాలను కూడా బయటపెట్టాడు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల , సిద్దిపేట జిల్లాలలో వివిధ కేసులలో నిందితుడుగా ఉన్న మల్లయ్య కోర్టు కేసులకు హాజరు కాకుండా పారిపోతూ నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. అతనిపై ఎనిమిది నాన్ బెయిలబుల్ వారంట్లు జారి చేశారు పోలీసులు.

  నగల కోసమే దారుణాలు..

  హత్యకు గురైన పత్తి లక్ష్మీ మర్డర్ కేసకులో సీసీ పూటేజ్ ఆధారంగా నెంబ‌ర్ లేని ఆటోను ప‌ట్టుకున్న పోలీసులు ఆటో షోరూంలో విచారించడంతో నేరస్తుల వివరాలు తెలిశాయి. పట్టుబడిన నేరస్తుడు మల్లయ్య తన చిన్నకొడుకు పెళ్లి చేయడం కోసం ఈతరహా దారుణాలకు తెగబడినట్లుగా తేలింది. 2019నుంచి ఇప్పటి వరకు కేవలం ఒంటరిగా రోడ్లపై వెళ్తున్న మహిళలు, నిస్సహాయస్థితిలో ఉన్న ఆడవాళ్లపై దాడి చేయడం, అటుపై చంపడం వాళ్ల దగ్గరున్న నగలు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లడం చేసినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి 15తులాల గోల్డ్‌ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Telangana crime news, Women missing

  ఉత్తమ కథలు