హోమ్ /వార్తలు /telangana /

Different Holi: ఇది విన్నారా? ఉదయం రంగులు పూసుకున్నారు.. సాయంత్రం ఊరు ఊరంతా కొట్లాడుకున్నారు.. ఎక్కడో తెలుసా?

Different Holi: ఇది విన్నారా? ఉదయం రంగులు పూసుకున్నారు.. సాయంత్రం ఊరు ఊరంతా కొట్లాడుకున్నారు.. ఎక్కడో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాయంత్రం అయితే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. హొలీ రోజున ఈ వింత సంప్రదాయాన్ని పాటించే గ్రామం తెలంగాణాలో ఉంది. అవును ఆ గ్రామంలో జనం హొలీ పర్వదినాన ఉదయం రంగులతో ఆదుకున్నారు. సంబరాలను చేసుకున్నారు

హోలీ పండుగ అంటే అందరూ సరదాగా రంగులు పూసుకుని జరుపుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం లోని ఒక గ్రామం లో హోలీ పండుగ (Holi festival) అంటే ఆరోజు ముష్టిఘాతాలకు దిగుతారు. ఇష్టమొచ్చినట్టుగా పిడిగుద్దులతో కొట్టుకుంటారు. అలా పిడిగుద్దులాట ఆడకుంటే తమకు ఎంతో నష్టం జరిగిపోతుంది అని తెగ ఫీల్ అయిపోతారు. ఇంతకీ ఎక్కడా ఆ గ్రామం, ఏంటి ఆ విశేషం అంటే  సాయంత్రం అయితే ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. హొలీ రోజున ఈ వింత సంప్రదాయాన్ని (Strange Tradition) పాటించే గ్రామం తెలంగాణ (Telangana)లో ఉంది. అవును ఆ గ్రామంలో జనం హొలీ పర్వదినాన (Holi 2022) ఉదయం రంగులతో ఆదుకున్నారు. సంబరాలను (Celebrations) చేసుకున్నారు. సాయంత్రం కాగానే ఊరంతా ఒక చోటకు చేరుకొని.. పిడికిళ్లు బిగించి కొట్టుకున్నారు (Fighting). ఈ హొలీ సంబరాలు నిజామాబాద్​ (Nizamabad)జిల్లా బోధన్​ మండలంలోని హున్సా (Hunsa) గ్రామంలో జరిగాయి.

ఈ హున్సా (Hunsa) గ్రామంలో హొలీ రోజున ఈ వింత ఆచారాన్ని కొన్ని వందల ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇలా గత 300 ఏళ్లుగా ఈ గ్రామంలో హొలీ రోజున సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఆచారంలో భాగంగానే ఈరోజు ఉదయమంతా రంగులు చల్లుకున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఊరి మధ్యలోని ఆంజనేయస్వామి గుడి ముందుకు ఊరేగింపుగా అంతా చేరుకున్నారు. అక్కడే ఉన్న స్తంభాలకు బలంగా ఓ తాడుకట్టారు. ఇరువైపులా ఉన్న జనం.. సామాజిక వర్గాలుగా విడిపోయి మొదటగా కుస్తీ పోటీలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా.. గ్రామం నలుమూలల నుంచి పురుషులంతా పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.

వాళ్ల మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవు.. అయినప్పటికీ పిడికిళ్లు బిగించి ఇష్టమున్నట్టు ఒకరినొకరు కొట్టుకున్నారు. పది నిమిషాల పాటు కొట్టుకున్న తరువాత తాడు వదిలేయడంతో ఆట ముగిసింది. ఈ తంతును మహిళలు, పిల్లలంతా ఎంతో ఆసక్తిగా వీక్షించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఎక్కువ పిడిగుద్దులు కురిపించిన వారిని భుజాలపై ఎత్తుకుని తమ వాడలకు తీసుకెళ్లారు. కొట్లాటలో గాయాలు అయినవారు కామదహనంలోని బూడిదను ఒంటికి

పూసుకున్నారు. అయితే దీనిని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఈ గ్రామస్థులు పోలీసులు ఆంక్షలను లెక్కచేయరు.. హొలీ రోజున ఇలా చేయకపోతే అరిష్టమని గ్రామస్థులు భావిస్తారు. అందుకనే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఈరోజు కూడా ఈ పిడిగుద్దులాటను కొనసాగించారు.

హోలీ సందర్భంగా ముష్టిఘాతాలతో పిడిగుద్దులు గుద్దుకునే ఆటలో ఉడుం పట్టు పట్టేందుకు సిద్ధమవుతున్నారు గ్రామంలోని మగవారు. ఇదేం ఆట అనిగతంలో ఓసారి ఈ పిడిగుద్దులాటను నిర్వహించలేదట. అయితే ఆ ఏడాది ఊర్లోని ట్యాంకు కూలిందని.. పిడిగుద్దులాటను జరపకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని ప్రజలు బలంగా విశ్వసించారు. ఇక కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పిడిగుద్దులాట ఆడని గ్రామస్తులు ఈసారి పిడిగుద్దులాటకు రెడీ అయ్యారు. ఈ ఆచారాన్ని వదిలిపెట్టేదే లేదని తేల్చేశారు.ఇకకుల మతాలకు అతీతంగా వారంతా ఈ పిడిగుద్దులాటను ఆడుతారు

First published:

Tags: Holi 2022, Nizamabad

ఉత్తమ కథలు