హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: కాపలా ఉన్న ఇంటికే కన్నం వేశాడు..చివరకు ఏం జరిగిందంటే?

Crime News: కాపలా ఉన్న ఇంటికే కన్నం వేశాడు..చివరకు ఏం జరిగిందంటే?

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

న‌మ్మిన బర్రె పోతు దుడ్డే పెట్టిందనే సామేత పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఆపార్ట్ మెంట్ కు కాపలా ఉంటాడ‌ని వాచ్ మేన్ ను పెట్టుకుట్టే త‌న చేతివాటాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌ను కాపలా ఉంటున్న ఆపార్ట్ మెంట్ లోని ఓ యాజ‌మ‌ని ఇంటికి క‌న్నం వేసాడు. ఏకంగా 41 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

న‌మ్మిన బర్రె పోతు దుడ్డే పెట్టిందనే సామేత పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ఆపార్ట్ మెంట్ కు కాపలా ఉంటాడ‌ని వాచ్ మేన్ ను పెట్టుకుట్టే త‌న చేతివాటాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌ను కాపలా ఉంటున్న ఆపార్ట్ మెంట్ లోని ఓ యాజ‌మ‌ని ఇంటికి క‌న్నం వేసాడు. ఏకంగా 41 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Crime : యూట్యూబ్‌లో లైక్స్ కొట్టిన ఐటీ ఉద్యోగి.. రూ.19 లక్షలు హాంఫట్

కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..బాన్సువాడ ప‌ట్ట‌ణం  చైతన్య కాలనీలోని మధుకుమార్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యాపారి బచ్చు భుజేందర్ ఈనెల 1న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. 3న ఇంటికి తిరిగి వచ్చారు. అయితే 8న ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించడం లేదని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బంగారు ఆభరణాల దుకాణాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే  గురువారం గాంధీచౌక్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారిం చగా చోరీ చేసినట్లు అంగీకరించాడు.

Minister KTR: కొత్త లుక్ లో కేటీఆర్ ..చాలా స్టైలిష్ గా..చిల్ అవుతున్న మంత్రి

నిందితుడు అదే అపార్ట్ మెంట్ వాచ్ మేన్ రాజు విశ్వనాధ్ ఒగ్లేగా గుర్తించారు.  మహారాష్ట్రలోని ఖందర్ తాలూకా కౌట గ్రామానికి చెందిన విశ్వనాద్ ఒగ్గేకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె పెళ్లి చేసాడు. ఇంకా నాలుగురు కూతుళ్ల‌ పెళ్లిళ్లు చేయడానికి తాను చేసే జీతం డబ్బులు సరిపోవడం లేదు. దీంతో దొంగతనం చేశానని నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి మొత్తం 41 తులాల బంగారు ఆభరణాలను, 15 వేల రూపాయ‌ల‌ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించామ‌న్నారు.

ఈ కేసును ఛేదించడంలో ప్ర‌తిభ‌ క‌న‌భ‌ర్చిన వారికి రివార్డులు అందించారు.

First published:

Tags: Crime, Crime news, Nizamabad, Telangana

ఉత్తమ కథలు