హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..

Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shocking Incident: ఆస్తి ముందు ఏ బంధం కూడా బ‌ల‌మైంది కాద‌నేల వ్య‌వ‌హ‌రిస్తున్నారు కొంతమంది. త‌ల్లి పేరున ఉన్న ఐదేక‌రాల భూమికి వ‌చ్చే రైతుబంధు డ‌బ్బుల కోసం క‌ని.. పెంచి.. పెద్ద చేసి.. విద్యాబుద్దులు నేర్పిన త‌ల్లిని అతిదారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో వెలుగు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(P.Mahender,News18,Nizamabad)

ఆస్తి ముందు ఏ బంధం కూడా బ‌ల‌మైంది కాద‌నేల వ్య‌వ‌హ‌రిస్తున్నారు కొంతమంది. త‌ల్లి (Mother) పేరున ఉన్న ఐదెక‌రాల భూమికి వ‌చ్చే రైతుబంధు(Raithu bandhu) డ‌బ్బుల కోసం క‌ని.. పెంచి.. పెద్ద చేసి.. విద్యాబుద్దులు నేర్పిన త‌ల్లిని అతిదారుణంగా హ‌త్య(Murder) చేసిన ఘ‌ట‌న నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. తర్వాత అతడికి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని కూడా చేసింది. కొడుకు ముక్కెర నారాయణ‌, కొడ‌లుతో క‌లిసి సాయ‌మ్మ ఉంటుంది.

KCR Biopic: కేసీఆర్ బయోపిక్ విడుదల తేదీ ఖరారు.. వివరాలివే..


అయితే తల్లి సాయ‌మ్మ‌ పేరిట  ఐదు ఎకరాల వ్య‌వ‌సాయ భూమి ఉంది. ఆ భూమిని తన పేరు మీదకు మార్చాలని కొడుకు నారాయణ పలుమార్లు త‌ల్లితో గొడవప‌డ్డాడు. రైతు బంధు డ‌బ్బులు ఆరునెల‌ల‌కు ఒక‌సారి 25వేల రూపాయ‌లు వ‌స్తున్నాయి. ఆ డ‌బ్బులు త‌ల్లి బ్యాంక్ లోకి జమ అవుతున్నాయి. అయితే డ‌బ్బుల విష‌యంలో పేచి వ‌చ్చింది.. దీంతో ఎలాగైనా భూమి తన పేరున మార్చుకుంటే డ‌బ్బులు త‌న బ్యాంకు ఖాతాలోకి వ‌స్తాయ‌ని భావించాడు. దీంతో త‌ల్లితో భూమి నా పేరున ఎప్పుడు మార్చుతావ‌ని రోజూ గొడవ పెట్టుకునేవాడు. అయితే బుధవారం అర్థరాత్రి సమయంలో  అతడు కసాయిగా మారి త‌ల్లిని బలంగా గోడకేసి కొట్టాడు. దీంతో కింద ప‌డిపోయిన త‌ల్లిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ ఫ్యాన్స్ కు భారీ షాక్.. అసలేం జరుగుతోంది..


హత్య చేసిన అనంతరం నిందితుడు ముక్కెర నారాయణ హత్యకు సంబంధించిన‌ ఆనవాళ్లు ఏమి లేకుండా రక్తం మరకలు తుడిచివేసి నిద్రలోనే సాయ‌మ్మ మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. విష‌యం తెలిసిన బోధన్ ఏసీపీ రామారావు తో కలిసి సిఐ అశోక్ రెడ్డి, వర్ని ఎస్ఐ అనిల్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారించారు.

Airtel KYC Fraud: ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం.. ఆ కేటుగాళ్లు ఏం చేస్తారో తెలుసా..


కన్న కొడుకే తన పాలిట కాలయముడు అవుతాడని ఆమె పసిగట్టలేక కసాయి కొడుకు చేతిలో ఆమె ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కూతురు శోభ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.

First published:

Tags: Nizamabad, Son kills his mother

ఉత్తమ కథలు