హోమ్ /వార్తలు /telangana /

Ukraine Crisis : అప్పుడు లాక్‌డౌన్‌లో ఇప్పుడు ఉక్రెయిన్‌లో.. కొడుకు కోసం 1400 కి.మీ బైక్ పై వెళ్లిన తల్లికి మరో కష్టం..

Ukraine Crisis : అప్పుడు లాక్‌డౌన్‌లో ఇప్పుడు ఉక్రెయిన్‌లో.. కొడుకు కోసం 1400 కి.మీ బైక్ పై వెళ్లిన తల్లికి మరో కష్టం..

లాక్‌డౌన్ సమయంలో 1400 కిమీ ప్రయాణించిన రజియా బేగం

లాక్‌డౌన్ సమయంలో 1400 కిమీ ప్రయాణించిన రజియా బేగం

Ukraine Crisis : తన కొడుకు కోసం లాక్‌డౌన్‌ సమయంలో తన కొడుకు కోసం ఏకంగా 1400 కిలోమీటర్లు బైక్‌పై వెళ్లి తీసుకువచ్చిన తల్లికి మరోసారి కష్టం వచ్చిపడింది. అప్పుడు లాక్‌డౌన్ అయితే ఇప్పుడు ఏకంగా రెండు దేశాల మధ్య యుద్దంలో ఆమె కొడుకు చిక్కుకున్నాడు.

ఇంకా చదవండి ...

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్దం అక్కడి స్థానిక ప్రజలనే కాదు భారత దేశవ్యాప్తంగా అక్కడి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన కొనసాగుతోంది. అయితే ఈ ఆందోళణ అందరి తల్లిదండ్రుదయినా తాజాగా ఓ తల్లి వేదన మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓసారి చదువు కోవడానికి వెళ్లిన తన కొడుకు పక్క రాష్ట్రంలో కష్టాల్లో చిక్కుకుంటే కష్టపడి రక్షించుకున్న తల్లికి ఇప్పుడు మరోసారి కష్టం వచ్చిపడింది. అప్పుడంటే.. పక్క రాష్ట్రం కాబట్టి వెళ్లి కాపాడుకుంది. కాని ఇప్పుడు దేశం కాని దేశంలో చదువుకోసం వెళ్లిన తన కొడుకు కోసం ఆ తల్లి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.

తెలుగు ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ లో రజియాబేగం స్టోరీ.. జిల్లాలోని సాలంపాడ్ క్యాంపు విలేజ్ లో ఈమె ప్రభుత్వ ఉపాధ్యయురాలిగా పని చేస్తోంది. 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన రజియా బేగంకు నిజాముద్దీన్ అమన్ అనే కొడుకు ఉన్నాడు. 2020 సంవత్సరం మార్చిలో కరోనా ఉధృతంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. దీంతో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో రజియా బేగం కొడుకు నెల్లూరులో చిక్కుకుపోయాడు. వెంటనే తన కొడుకుని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఏమి ఆలోచించకుండా.. టూ వీలర్‌పై వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బోధన్ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి అనుమతి తీసుకుంది. దీంతో దాదాపు 1400 కిలోమీటర్లు పాటు ప్రయాణించిన ఆమెకు పలు పోలీసు చెక్ పోస్టులను దాటుకుని తన కొడుకుని టూవీలర్‌పై క్షేమంగా గ్రామానికి తీసుకొచ్చింది. దీంతో ఆ సంఘటన మీడియాలో సంచలనంగా మారింది. కొడుకు కోసం తల్లి పడ్డ ఆరాటాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.

CM KCR Jharkhand: జార్ఖండ్ చేరుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్​, ఎంపీ సంతోష్​, సీఎస్​ సోమేశ్​ల బృందం.. హేమంత్​ సోరెన్​తో భేటీ.. ఫొటోలు


అయితే తాజాగా మరో సంఘటనలో ఆమె కొడుకు చిక్కుకున్నాడు.. ఇది వరకే మూత్రపిండాల వ్యాధితో చనిపోయిన భర్తను కోల్పోయిన ఇలాంటీ పరిస్థితి ఇతరులకు రాకుండా చూసేందుకు తన కొడుకును డాక్టర్ చేయాలని నిర్ణయించింది. దీంతో వైద్య చదువుల కోసం ఈశన్యా ఉక్రెయిన్‌కు పంపింది. కాగా రజీయా కొడుకు ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ప్రస్తుతం రష్యా చేపడుతున్న దాడులతో ఎంతో మంది భారతీయులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలతో వారిని ఇండియాకు రప్పిస్తున్నారు. అయితే.. నిజాముద్దీన్ ఇంకా అక్కడనే ఉన్నాడని, వెంటనే అతడిని ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు.

First published:

Tags: Nizamabad District, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు