Home /News /telangana /

NIZAMABAD THE PARENTS WERE DIED IN A ROAD ACCIDENT WHILE RETURNING HOME WITH THEIR DAUGHTER IN A HOSTEL IN KAMAREDDY NZB PRV

Parents Died: హాస్టల్​లో కూతురిని చూసి వ‌స్తూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం..  అనాథలైన నలుగురు పిల్ల‌లు 

మృతిచెందిన తల్లిదండ్రులు (ఫైల్​)

మృతిచెందిన తల్లిదండ్రులు (ఫైల్​)

నలుగురు పిల్ల‌లతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం వెంటాడింది.. నలుగురు పిల్ల‌ల‌ను ఆనాథలుగా మార్చింది.  గురుకులాలో ఇంటర్ చదువుతున్న పెద్ద  కూతురును చూసి తిరిగి ప్రయాణం అయినా త‌ల్లిదండ్రుల‌ను రోడ్డు ప్రమాదం బ‌లి తీసుకుంది

    నలుగురు పిల్ల‌లతో (Four Children) ఆనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం వెటాడింది..  పిల్ల‌ల‌ను ఆనాథలుగా (Orphans) మార్చింది.  గురుకులాలో ఇంటర్ చదువుతున్న పెద్ద  కూతురును చూసి (Visit) తిరిగి ప్రయాణం (Journey) అయినా త‌ల్లిదండ్రుల‌ను రోడ్డు ప్రమాదం (Parents Accident) బ‌లి తీసుకుంది. ఈ ఘ‌ట‌న‌ నిజామాబాద్ (Nizamabad) జిల్లా లో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.   కామారెడ్డి (Kamareddy) జిల్లా క్యాసంపల్లి తండాకు చెందిన దేవసత్ దేవీ (35) , దేవసత్ పెంట్యా (37) దంప‌తులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. దేవసత్ పెంట్యా (Pentya) పారిశుధ్య కార్మికుడిగా, దేవి వ్యవసాయ కూలీ పనులు (daily wager) చేస్తూ బ‌తుకు బండిని లాగుతున్నారు.. నలుగురు పిల్ల‌లతో ఆనంద‌ంగా గ‌డుపుతున్నారు. పెద్ద కూతురు నందిని ఇంటర్ మొదటి సంవత్సరం.. కుమారుడు భానుతేజ తొమ్మిదో తరగతి.. రెండో కూతురు కల్యాణి ఏడో తరగతి..  మూడో కూతురు నవనీత ఐదో తరగతి చదువుతున్నారు. అయితే పెద్ద కూతురు నందిని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని  దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాలలో (Mahatma Jyotiba Poole BC Gurukul College) ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం చదువుతోంది. అయితే ఆదివారం సెలవు కావడంతో ఆమెను చూసేందుకు భార్యాభర్తలిద్దరూ బైక్ పై గురుకులానికి వచ్చారు.

    44వ నెంబరు జాతీయ రహదారి పై..

    కూతురుతో ఆనందంగా క‌బుర్లు చెప్పుకున్నారు. మధ్యాహ్నం ద్విచ‌క్ర వాహ‌నం (Bike) పై స్వగ్రామానికి తిరిగి ప్రయాణం అయ్యారు.. అయితే నిజామాబాద్ జిల్లా డిచ్ ప‌ల్లి మండ‌లం బీబీపూర్ తండా శివారులో 44వ నెంబరు జాతీయ రహదారి పై వీరి వాహ‌నాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన కంటెయినర్  ఢీకొట్టింది. దీంతో  కిందపడిన దేవి పైనుంచి కంటెయినర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పెంట్యాకు తీవ్ర గాయాలు అయ్యాయి.

    ప్ర‌భుత్వం మృతుల పిల్ల‌ల‌ను ఆదుకోవాల‌ని..

    విష‌యం తెలిసిన పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకుని పెంట్యాను జిల్లా కేం ద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెంట్యా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీంతో దంప‌తులు ఇద్ద‌రు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వీరి నలుగురు పిల్లలు అనాథలయ్యారు. దీంతో క్యాసం ప‌ల్లి తండాలో విషాధచాయ‌లు అలుముకున్నాయి. తెలిసి తెలియ‌ని పిల్లలు ఏలా బతుకుతార‌ని స్థానికులు కంట‌త‌డి పెట్టారు. ప్ర‌భుత్వం మృతుల పిల్ల‌ల‌ను ఆదుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.. డిచ్ ప‌ల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Kamareddy, Parents died

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు