Home /News /telangana /

NIZAMABAD THE LOAN APP OPERATORS FIXED THE ADULTERERS RATES FOR THE FAMILY MEMBERS OF THE BORROWERS IN NIZAMABAD NZB PRV

Lona Apps: మరీ ఇంత దుర్మార్గమా..? కుటుంబ సభ్యులను వేశ్యలతో పోలుస్తూ రేట్లు ఫిక్స్​ చేసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడు అవసరానికి లోన్​ యాప్​ ద్వారా రూ. 45‌‌‌‌00 తీసుకున్నాడు. తిరిగి వారంలో కట్టేశాడు. అయితే లోన్​ యాప్​ నిర్వాహకులు మాత్రం హద్దులు దాటేశారు. నీచాతి నీచంగా ఫొటోలను వాడారు.

     (P. Mahendar, News18, Nizamabad)   

    బ్యాంకుల చుట్టు ఇంటి పత్రాలు, ప్లాట్ పత్రాలు, వ్య‌వ‌సాయ భూమి ప‌ట్టా పాస్​బుక్​ ప‌ట్టుకుని తిరిగిన లోన్ రావాలంటే రోజులు.. నెల‌లు, సంవ‌త్స‌రాలు కూడా ప‌ట్టవ‌చ్చు .. కానీ డిజిట‌ల్ యుగంలో లోన్ యాప్ (Loan app) ఉండగా ఎక్క‌డికి వెళ్లనవ‌స‌రం లేదు.. నీ మొబైల్​ నుంచి ఒక క్లిక్ చేయండి.. మీ ఆకౌంట్ లో డ‌బ్బులు జ‌మ అవుతాయ‌ని నిర్వాహకులు యువ‌కుల‌ను ఆక‌ర్శిస్తున్నారు. దీంతో యువ‌త ఆ ఆన్ లైన్ లోన్ యాప్​లో ఉచ్చులో ప‌డి జీవితాలను పాడు చేసుకుంటున్నారు.

    తాజాగా నిజామాబాద్  (Nizamabad) జిల్లాలో ఓ యువ‌కుడు లోన్ యాప్​లో రూ. 4,500 రూపాయ‌లు లోన్ తీసుకున్నాడు. తిరిగి వారంలో చెల్లించాడు. అయినా నిర్వాహకులు వేధింపులు చేయడం ఆపలేదు. దీంతో వేధింపులు తాళ‌లేక ఆ యువ‌కులు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.  బాధితుడు, పోలీసులు తెలిపిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపునకు చెందిన కోటిప‌ల్లి శివ కుమార్ (Kotipalli shivakumar).. ఆన్ లైన్ లో స్మార్ట్ స్మాల్ క్రెడిట్​ (Small credit) అనే యాప్​లో గ‌త నెల‌ 12న  రూ.4,500 రుణం తీసుకున్నాడు.



    కుటుంబ సభ్యులను రేప్​ చేశాడంటూ..

    వారం రోజుల్లో తిరిగి  ఆ మొత్తాన్ని చెల్లించాడు.  అయినా లోన్ యాప్​ నిర్వాహకులు (Loan app) ఇంకా డ‌బ్బులు క‌ట్టాల‌ని లేదంటే నీ కుటుంబ సభ్యుల చిత్రాలను మార్పింగ్​ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తామని బెదిరించారు.. దీంతో ప‌రువు పోతుంద‌ని  భయపడిన శివ కుమార్ మ‌రో రూ.4,500 లు  నగదును ఆన్​లైన్​ ద్వారా చెల్లించాడు. ఇంతటితో క‌థ‌ ముగుస్తుంది అనుకున్నాడు.. కానీ క‌థ అప్పుడే మొద‌లైంది. లోన్ యాప్​ నిర్వ‌హ‌కులు శివ కుమార్ పాన్ కార్డు (Pan card)ను డ్ర‌గ్ డీలర్, సెక్స్ ఏజెంట్ గా  మార్పింగ్ చేసి  పోస్ట్ చేశారు.. అలాగే శివ కుమార్..  కుటుంబ స‌భ్యుల‌ను (Family Members) రేప్ చేశారు.. ఇప్పుడు వారు వేశ్య‌లుగా మారారు.. అని  మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో రాసిన పోస్టులను  జాబితాలోని స్నేహితులకు పంపించడం ప్రారంభించారు.

    కుటుంబ సభ్యులకు రేట్లు..

    ఇక వారి ఆగడాలు ఎంతదూరం వెళ్లాయంటే కుటుంబ సభ్యులకు రేట్స్ ఫిక్స్​ చేసి ( fixed the adulterers rate) పెట్టారు. ఇది తట్టుకోలేక బాధితుడు శివ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. కేసునమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. సైబ‌ర్ నేరాల గురించి ఎప్ప‌టికప్పుడు మోస పోవ‌ద్ద‌ని చెబుతున్నా కూడా యువ‌త మోస‌పోతోందని ఎడ‌ప‌ల్లి ఎస్ఐ పాండే అంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Loan apps, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు