హోమ్ /వార్తలు /తెలంగాణ /

Father killed son: దుబాయ్​ నుంచి వచ్చిన కొడుకుని నరికి చంపిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా?

Father killed son: దుబాయ్​ నుంచి వచ్చిన కొడుకుని నరికి చంపిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు పిల్ల‌ల కొసం త‌ప‌న ప‌డతారు.. పిల్ల‌లు పుట్టిన త‌రువాత వారి బంగారు భ‌విష‌త్తు కోసం క‌ష్ట‌ప‌డతారు.. వృద్దాప్యంలో తమకు పిల్ల‌లు తోడుగా ఉంటారు అనుకుంటారు.. కానీ నిజామాబాద్​లో మాత్రం తండ్రి, కొడుకు మధ్య జరిగిన గొడవ.. ఓ ప్రాణాన్ని తీసుకుంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P. Mahendar, News18, Nizamabad)

  పెళ్లైన దంప‌తులు పిల్ల‌ల కొసం త‌ప‌న ప‌డతారు.. పిల్ల‌లు పుట్టిన త‌రువాత వారి బంగారు భ‌విష‌త్తు కోసం క‌ష్ట‌ప‌డతారు.. వృద్దాప్యంలో తమకు పిల్ల‌లు తోడుగా ఉంటారు అనుకుంటారు.. కానీ నిజామాబాద్​లో మాత్రం తండ్రి, కొడుకు మధ్య జరిగిన గొడవ.. ఓ ప్రాణాన్ని తీసుకుంది. ఆస్తి విష‌యంలో తండ్రి , కొడుకు మ‌ధ్య గొడ‌వ జరిగింది.. ఆగ్ర‌హించిన తండ్రి, కొడుకును గొడ్డ‌లితో న‌రికి చంపాడు (Father Killed son).

  పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ (Nizamabad) జిల్లా భీమ్ గల్ మండలం మెండోర గ్రామ శివారు లలోని ఒడ్డెర కాలనికి చెందిన రమేశ్​కు దండ్ల సుమన్ (30) కుమారుడు..  వారం రోజుల క్రితం సుమన్​ దుబాయ్ (Dubai) నుంచి స్వ గ్రామానికి వచ్చాడు. వచ్చిన నాటి నుంచి తండ్రి రమేశ్​తో ఆస్తులకు సంబంధించిన గొడవలు జ‌రుగుతున్నాయి. అయితే నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టుకున్నారు. అయినా ఆస్తి పంపకాలు చెయ్యలేదు.

  కొడుకు సుమన్​ (ఫైల్​)

  గురువారం రాత్రి వినాయక నిమజ్జనం అనంతరం తన తండ్రి ఇంటికి ద్విచక్ర వాహనం కోసం వెళ్లాడు.. అదే స‌మ‌యంలో తండ్రి ర‌మేష్  తో కొడుకు సుమ‌న్ గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన తండ్రి రమేష్ తన కొడుకు మెడ పై పక్కనే ఉన్న గొడ్డలితో న‌రికాడు.. దీంతో మెడ భాగంలో గాయమైంది.. కొడుకు ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయాడు.. తీవ్ర ర‌క్త స్రావం కావ‌డంతో సుమ‌న్ అక్క‌డే మృతి చెందాడు. కొడుకు మృత దేహాన్ని అక్క‌డే వదిలి తండ్రి పెద్ద ర‌మేష్ పరార‌య్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

  Nagarkurnool: ఈ దొంగ మామూలోడు కాదు బాబోయ్​.. ఏకంగా ఎస్ఐ ఇంటికే కన్నం వేశాడు..

  బంధాలను తెంచేసిన ఆస్తి..

  మృతునికి భార్య జ్యోతి.. ఐదు నెలల బాబు (వేదాంత్) ఉన్నారు.  మృతుని భార్య జ్యోతి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమ్ గల్ ఎస్సై రాజ భరత్ రెడ్డి తెలిపారు. ప్రాణం లేని ఆస్తులు తండ్రి కొడుకుల‌ను శ‌త్రువుల‌ను చేసింది.. చివరకు ఒక‌రి ప్రాణాల‌ను తీసింది. ఓ ఇల్లాలిని ఒంటరిని చేసింది. ఓ బాబుకి తండ్రిని దూరం చేసింది. డ‌బ్బులు.. ఆస్తులు పోతే సంపాదించుకోవ‌చ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి పొంద‌లేమ‌ని పెద్ద‌లు చెబుతారు. ఈ మాట‌లు చెప్ప‌డానికి స‌రిపోతాయి. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఎవ్వ‌రు కూడా ప‌ట్టించుకోవడం లేదు. ఆధునిక స‌మాజంతో డ‌బ్బుకు.. ఆస్తులకు ఉన్న విలువ మ‌నుషుల‌కు, బంధాల‌కు .. బంధవ్యాల‌కు లేకుండా పోయాయి..

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Nizamabad, Son killed by father

  ఉత్తమ కథలు