(P.Mahendar,News18,Nizamabad)
ఎక్కడో పుట్టి ..ఎక్కడో పెరిగి పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒకటవుతారు. ఎలాంటి రక్త సంబంధం లేకుండా చివరి వరకు తోడు నీడగా ఉంటారు భార్యభర్తలు. ఎంతటి కష్టం వచ్చినా.. సంతోషం వచ్చినా ఇద్దరు కలిసి పంచుకుంటారు. అలా సుమారు నాలుగు దశాబ్ధాలుగా కలిసి బ్రతికిన ఓ జంట చివరకు మృత్యును కూడా కలిసే భాగం పంచుకున్నారు. ప్రతి హృదయాన్ని కలచివేసే విధంగా ఉన్న ఈఘటన కామారెడ్డి(Kamareddy)జిల్లాలో వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీ(Bank Colony)లో నివాసం ఉండే 60సంవత్సరాల గజవాడ కుబేరాని(Gajwada Kuberam)కి 55సంవత్సరాల లక్ష్మీ(Lakshmi)తో 38ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు సమీర(Sameera), సుష్మ(Sushma)కు గతంలోనే పెళ్లిళ్లు చేశారు. పెద్ద కూతురు సిద్దిపేట(Siddipeta)లో ఉంటుంది. చిన్న కూతురు కామారెడ్డిలో నివాసం ఉంటోంది. ఇద్దరు కూతుళ్లు బాగానే స్థిరపడ్డారు. వైవాహిక జీవితంలో ఎలాంటి అరమరికలు లేవు. ఒకరంటే మరొకరు విడిచి ఉండలేనంత అనురాగం, ఆప్యాయత పెనువేసుకున్నాయి. లక్ష్మీ, కుబేరం చివరి మజిలీ గడుపుతున్నారు.
దంపతుల సూసైడ్..
సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దంపతులు ఇద్దరు తమ కూతుళ్లతో ఫోన్‌లో మాట్లాడారు . ఆనందంగా ఉన్నమని కూతుళ్లకు చెప్పారు. అయితే అర్ధ రాత్రి సమయంలో కుబేరం, లక్ష్మి దంపతులు ఇంట్లో ప్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ఎనిమిది అవుతున్న ఎవరు బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు. కామారెడ్డి పట్టణ ఎస్‌హెచ్‌వో నరేష్, ఎస్సై రాములు తమ సిబ్బందిని తీసుకొని ఘటన స్తలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వృద్ధాప్యం రాకుండానే..
ఘటన స్థలంలో దంపతులు రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదని...తామిద్దరం ఇష్టపూర్వకంగానే చనిపోతున్నట్లు రాశారు. అంతే కాదు దయచేసి తమ మృత దేహాలను పోస్టు మార్టం చేయవద్దని అలాగే ఇద్దరి కర్మకాండలు ఒకే దగ్గర చేయమని సూసైడ్ లెటర్‌లో రాశారు. చనిపోయే ముందు పిల్లలతో మాట్లాడిన తర్వాత దిగిన సెల్ఫీ ఫోటోను ఫోన్‌లో గుర్తించారు పోలీసులు. అయితే దంపతుల బలవన్మరణానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. కుబేరం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నమని ఏస్ఐ తెలిపారు. గత కొంత కాలంగా కబేరం, లక్ష్మి తరచుగా అనారోగ్యా నికి గురవుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్య కారణాలతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Kamareddy