Telangana: ఇంట్లో ఉండి చనిపోయే కంటే రోడ్డుపై ప్రాణాలు వదిలితే ఎక్స్‌గ్రేషియానైనా వస్తుంది.. షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల పోరుబాటు

కార్మికుల పాదయాత్ర

నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఆసియా కాండంలోనే పెద్దది... గతంలో ఈ ఫ్యాక్టరీ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవించేవి.

  • Share this:
    నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే ఆసియా కాండంలోనే పెద్దది... గతంలో ఈ ఫ్యాక్టరీ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవించేవి. ఫ్యాక్టరీ 2015నుంచి మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. అప్పటి నుంచి పనిలేదు. జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు మూడుపూటలు వారి కుటుంబసభ్యులకు అన్నం పెట్టలేని పరిస్థిలో ఉన్నారు. 2015నుంచి పలు రకాలుగా పోరాటాలు, ఆందోళనలు చేసిన ఫలితం లేకుండాపోయింది. దీంతోతో చివరి అస్త్రంగా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు బోధన్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర కు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఎంతో మంది కార్మికులకు అన్నం పెట్టింది. ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి చూపిన ఫ్యాక్టరీ... ఇప్పుడు మూతపడడంతో కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు రైతులు కూడా ఫ్యాక్టరీ ని తెరిపించాలని ధర్నాలు, ఆందోళనలు చేసారు. కానీ ఇప్పటికి ప్రభుత్వము స్పందించలేదు. టీడీపీ అధికారంలో ఉండగా మొదటిసారి ప్రైవేటు పరం చేశారు.

    అయితే 2014ఎన్నికల్లో తెరాస అధినేత, సీఎం కెసిఆర్ వంద రోజుల్లో ప్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడుపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ గాలికివదిలేసి... 2015లో ఫ్యాక్టరీ పూర్తిగా మూతబడింది.చివరికి రైతులు నడిపించుకోండని రైతులపై భారంవేసారు. దీంతో రైతులు షుగర్ ఫ్యాక్టరీ నడడం సాధ్యంకాదు ప్రభుత్వమే నడపాలని కోరారు. కార్మికులకు గత 2015నుంచి జీతాలు లేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి.దీంతో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు బోధన్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నారు.

    ఈ పాదయాత్రకు కాంగ్రెస్, టీడీపీ, ఎర్ర జెండా పార్టీలు పుర్తి మద్దతు తెలిపాయి. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారించాలని పాదయాత్ర చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు.గత ఆరు ఏళ్లుగా జీతాలు లేక కుటుంబాలు పోషించలేక తీవ్రఇబ్బందులు పడుతన్నామని ఆవేదన వ్యక్తం చేసారు. పిల్లల స్కూల్ పీజులు కట్టలేక పోతున్నాము.... మా పిల్లల పెళ్లి లు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి... ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్యాటరీని తెరిచి తమకుకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: