హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ఆ హాస్టల్‌లో విషసర్పాలు .. పాముకాటుకు గురైన స్టూడెంట్‌ని ఏం చేశారో తెలుసా ..?

Telangana : ఆ హాస్టల్‌లో విషసర్పాలు .. పాముకాటుకు గురైన స్టూడెంట్‌ని ఏం చేశారో తెలుసా ..?

hostel student died

hostel student died

Student Died: ప్ర‌భుత్వ బీసీ బాయ్స్ హ‌స్టల్ లో ఐద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి పాము కాటుకు బలయ్యాడు. హాస్టల్ వార్డెన్ స‌రైన స‌మ‌యంలో స్పందించకపోవ‌డం వల్లే తమ బిడ్డ చనిపోయాడని విద్యార్ది తల్లిదండ్రులు హాస్టల్ దగ్గర ఆందోళనకు దిగారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  ప్ర‌భుత్వ బీసీ బాయ్స్ హ‌స్టల్‌(Boy sHostel)లో ఐద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న స్టూడెంట్‌ని పాము కరవడంతో మృతి చెందాడు. వార్డెన్ (Warden)సరైన స‌మ‌యంలో స్పందించక పోవ‌డం వల్లే విద్యార్థి మృతికి  కార‌ణ‌మ‌మని స్టూడెంట్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. హాస్టల్ దగ్గర ఆందోళనకు దిగారు. హాస్టళ్లలో సరైన భోజనం పెట్టని కారణంగా విద్యార్ధులు ఆసుపత్రులు పాలైన సంఘటనలు చూశాం. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయిన వార్తలు విన్నాం. కాని నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో ఏకంగా హాస్టల్‌లోకి విషసర్పం(Poisonous snake) వచ్చి స్టూడెంట్‌ కాటేసి చంపేయడంతో హాస్టల్ సిబ్బందిపై విమర్శలు మరింత పెరిగాయి.

  Hyderabad |Dengue : వెన్నులో వణుకుపుట్టిస్తున్న డెంగ్యూ కేసులు .. ఇన్‌పేషెంట్లుగా మారుతున్న బాధితులు

  హాస్టల్‌లో పాములు ..

  నిజామాబాద్ జిల్లా బీర్కూర్ బీసీ బాయ్స్ హాస్టల్‌లో పాము కాటుకు విద్యార్థి బలయ్యాడు. ఐదో తరగతి చదువుతున్న 12ఏళ్ల సాయిరాజ్ అనే విద్యార్థి హాస్టల్ లో పాముకాటుతో మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి హాస్టల్‌లో వాంతులు చేసుకున్నాడని సాయిరాజ్‌ను వెంటనే బీర్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. కానీ అదే సమయంలో  సాయిరాజ్ ఉన్న రూములో పామును విద్యార్థులు చంపారు. సాయిరాజ్‌ నోట్లోంచి నురగ రావడంతో పాము కాటు వేసి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

  పాము కాటుకు స్టూడెంట్ బలి..

  శుక్రవారం రాత్రి పాము కరిచి సాయిరాజ్‌ చనిపోతే హాస్టల్ సిబ్బంది శనివారం తెల్లవారు జామున సమాచారం అందించారు. దీంతో సాయిరాజ్‌ తల్లిదండ్రులతో పాటు బంధువులు మృతదేహంతో హాస్టల్ దగ్గర ఆందోళన చేపట్టారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించే ప్రసక్తి లేదని బైఠాయించారు. అయితే ఈఘటన తర్వాత నుంచి ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి బాత్ రూమ్ దగ్గర వ‌ద్ద‌ సాయిరాజ్‌ని చుట్టుకొని ఉంటే చీపురు కర్రతో కొట్టి చంపామని తోటి విద్యార్థులు తెలిపారు. ఆ పామే సాయిరాజ్‌ని కాటేసిందని చెప్పడంతో విద్యార్ధి బంధువులు మరింత కోపోద్రేకుల్యయారు.

  Telangana: మద్యం మత్తులో రోడ్డుపై రచ్చ చేసిన మహిళ .. రెండో భర్త అలా చేస్తున్నాడనే బాధతో..

  మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన..

  విద్యార్ధులు ఉంటున్న హాస్టల్‌లోకి పాము వ‌చ్చి సాయిరాజ్‌ని కాటు వేసిన విష‌యం తెలిసి కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించక పోవ‌డం వల్లే తమ బిడ్డ చనిపోయాడని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి సంఘటన జరిగితే మాకు తెల్లవారు జామున సమాచారం ఇచ్చారని ..వచ్చేలోపే బిడ్డ ప్రాణాలు పోయాయని క‌న్నీటి ప‌ర్యంతమైంది. తమ బిడ్డ చావుకు కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు సాయిరాజ్‌ తల్లిదండ్రులు. బీసీ బాయ్స్‌ హాస్టల్‌ పరిసరాల్లో గ‌డ్డి , పిచ్చి మొక్క‌లు ఎక్కువగా ఉన్నాయని...వాటిని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా పలుమార్లు పాములు హాస్టల్ ప్రాంగణంలో కనిపించినట్లుగా విద్యార్ధులు తెలిపారు. ఇందులో వార్డెన్ నిర్లక్ష్యంగా ఉండ‌టం వల్లే ఇదంతా జరిగిందంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Hostel students, Nizamabad, Telangana News

  ఉత్తమ కథలు