హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : బాన్సువాడలో మళ్లీ పోటీ చేసేది నేనే .. వారసుడి ఆశలపై నీళ్లు చల్లిన స్పీకర్

Telangana : బాన్సువాడలో మళ్లీ పోటీ చేసేది నేనే .. వారసుడి ఆశలపై నీళ్లు చల్లిన స్పీకర్

POCHARAM(FILE)

POCHARAM(FILE)

Telangana: ఆ యువ నాయ‌కుడు వార‌స‌త్వంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ‌రిలో దిగుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ వార‌సునికి నిరాసే మిగిలింది. మ‌రో సారి తానే బ‌రిలో నిలుస్తాన‌ని సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో వార‌సుని ఆశ‌లు ఆవిర‌య్యాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  రాజ‌కీయాల్లో ఓ స్థాయికి ఎదిగిన నాయ‌కుని పిల్ల‌లు వారుస‌త్వంగా రాజకీయాల్లోకి రావడం స‌ర్వ‌ సాధారణం. అయితే ఉమ్మడి నిజామాబాద్(Nizamabad)జిల్లాలో అనేక మంది నేతలు తమ వార‌సులను రాజకీయాలకు పరిచయం చేశారు.  కొందరు తండ్రిని మించిన త‌న‌యులుగా గుర్తిపు తెచ్చుకుంటే ... మ‌రికొంద‌రు కనుమరుగైపోయారు. అయితే తాజాగా  యువ నాయ‌కుడు వార‌స‌త్వంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ‌రిలో దిగుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ వార‌సునికి నిరాసే మిగిలింది. మ‌రో సారి బ‌రిలో తానే నిలుస్తాన‌ని సీనియన్‌ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy) ప్ర‌క‌టించ‌డంతో వార‌సుని ఆశ‌లు ఆవిర‌య్యాయి.

  Bhadradri: ఏజెన్సీ ఏరియాలో కూచిపూడి నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ మాస్టారు

  పార్టీ హైకమాండ్‌ నిర్ణయమే..

  నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేక‌త గుర్తింపు ఉంది. అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి సుమారు 40ఏళ్లుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో త‌నకంటు ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప‌లుదఫాలుగా మంత్రి పదవులు నిర్వహించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి...   ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన పోచారం తెలంగాణ‌ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయశాఖ మంత్రిగా రాణించి, తర్వాత స్పీకర్‌గా సభను నడుపుతున్నారు. 73 సంవత్సరాల వయసులో కూడా ప్రజాసేవలో ఉన్న పోచారంకు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో తనయుడు భాస్కర్ రెడ్డిని అసెంబ్లీకి పంపేందుకు  రంగం సిద్ధం చేస్తున్నారు అని ప్ర‌చారం జ‌రిగింది.

  వారసులకు మొండి చేయేనా..?

  వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో తనయుడు బరిలో దిగ‌ుతున్నారని అందరూ అనుకున్నారు.  ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.  భాస్కర్ రెడ్డి టీఆర్ఎస్‌లో కామారెడ్డి జిల్లాలో క్రియాశీల నేతగా ఉన్నారు. తండ్రిలాగే తన రాజకీయ ప్రస్తానాన్ని డీసీసీబీ చైర్మన్ గా మొదలు పెట్టారు.  పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి  వైద్యుడిగా స్థిరపడ్డారు. రెండో కుమారుడు సురేందర్ రెడ్డి వ్యాపారంలో స్థిరపడి తండ్రి పోచారంకు రాజకీయాల్లోచేదోడు వాదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి పూర్తిగా రాజకీయాల్లోనే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

  Telangana Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

  పెద్దాయనకే మళ్లీ ఛాన్స్ ..

  కామారెడ్డి జిల్లా  బాన్సువాడ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం పోటి చేస్తారా.. లేక త‌న వార‌సుడు బాస్క‌ర్ రెడ్డి పోటి చేస్తారా అని నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అయితే ఆ చ‌ర్చ‌కు స్పీక‌ర్ పోచారం తెరదించారు. సీఎం ఆదేశం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు తానే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచేందుకు  నిర్ణయం తీసుకున్నాన‌ని  స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు.  దీంతో త‌న వార‌సునిగా డీసీసీబీ చైర్మన్ అయిన పోచారం భాస్కర్ రెడ్డి ఆశ‌లు ఆవిర‌య్యాయి. రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా కొత్త పింఛన్ కార్డులు, సీఎం సహాయ నిధి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

  అవకాశం ఎప్పుడొచ్చేనో..

  ఒక్కో ఊరిలో గంటల కొద్దీ సమయం కేటాయిస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారం|త్సవాల్లో పాల్గొంటున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమా తెలుసుకుంటున్నారు. పనిలోపనిగా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, మరణించినా వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఇది అంతా చూస్తుంటే ఎన్నిక‌ల కోలాహ‌లం ఇప్పుడే మొద‌లైంద‌నిపిస్తుంది. రాజకీయాల్లో అవకాశం రావాలన్నా ...వారసులకు పోటీ చేసే అవకాశం దక్కాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందేనంటున్నారు నియోజకవర్గ ప్రజలు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Pocharam Srinivas Reddy, Telangana Politics

  ఉత్తమ కథలు