Home /News /telangana /

NIZAMABAD SON KILLED FATHER AND YOUNGER FATHER IN NIZAMABAD DISTRICT SNR NZB

Double Murders : పెళ్లి చేయమని అడుగుతుంటే పట్టించుకోలేదనే కోపంతో తండ్రి, బాబాయ్‌ని కొడుకు ఏం చేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Double Murders: రాఖీ పండ‌గ రోజు అందరూ రాఖీలు కట్టుని ఆనందంగా ఉన్నారు. కానీ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. అన్నదమ్ములు ఇద్దరూ దారుణంగా హత్య చేయబడ్డారు. ఇద్దర్ని చంపిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు వాళ్ల వారసుడే కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P.Mahendar,News18,Nizamabad)   

    రాఖీ పండ‌గ(Rakhi festival) రోజు అందరూ రాఖీలు కట్టుని ఆనందంగా ఉన్నారు. కానీ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.  అన్నదమ్ములు ( Brothers Murder)ఇద్దరూ దారుణంగా హత్య చేయబడ్డారు. ఇద్దర్ని చంపిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు వాళ్ల వారసుడే కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు(Police) ఎందుకు హత్య చేశాడో తెలిసి షాక్ అయ్యారు. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటనపై ఎలా స్పందించాలో తెలియని షాక్‌లో ఉన్నారు స్థానికులు.

    Students Suicide : ఔను వాళ్లిద్దరూ చనిపోయారు .. అన్నాచెల్లెలికి ఆ సంబంధం అంటగట్టడం వల్లే


    తండ్రిని బాబాయ్‌ని చంపేశాడు..
    నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రాఖీ పండుగ రోజున దారుణం జ‌రిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో 55సంవత్సరాల కర్రల అబ్బయ్య అతని సోదరుడు 50ఏళ్ల కర్రల సాయిలుని అబ్బయ్య కొడుకు కర్రల కొడుకు కర్రల సతీష్ దారుణంగా హ‌త్య చేశాడు. కని , పెంచిన తండ్రి అబ్బయ్యతో పాటు బాబాయ్ సాయిలుని సతీష్‌ పారతో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ జంట హత్యలకు కుటుంబ తగాదాలే కారణమని తెలుస్తుంది. అయితే నిందితుడు సతీష్‌కి మతిస్థిమితం లేదని తెలుస్తోంది.



    పెళ్లి చేయలేదనే కోపం..
    కొన్ని సంవత్సరాలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చిన సతీష్ అక్కడే మతిస్థిమితం కోల్పోయి ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లోనే ట్రీట్‌మెంట్ కూడా చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ మధ్యనే కొద్దిగా కోలుకున్న సతీష్‌ తనకు వివాహం చేయమని కుటుంబ సభ్యులపై పదే పదే ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. కొడుకు ఇష్టాన్ని, కోరికను తీర్చడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శనివారం సతీష్‌కి నిశ్చితార్ధం కూడా ఏర్పాటు చేశారు. ఇంట్లో అంతా సానుకూల వాతావరణం ఉన్న సమయంలో సతీష్‌ ఇంతటి కిరాతకానికి పాల్పడతాడని ఎవరూ ఊహించలేకపోయారు.

    Cyber ​​fraud : న్యాయవాదికి న్యూడ్ కాల్ చేసిన అమ్మాయిలు .. తర్వాత వీడియో చూసి షాక్


    జంట హత్యలపై అనేక అనుమానాలు ..
    గురువారం రాత్రి నిందితుడు కర్రల సతీష్ కుటుంబ స‌భ్యుల‌తో గొడవ పడ్డాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత తండ్రి అబ్బయ్య, బాబాయ్ సాయిలు వ్యవసాయ పనులు చేసుకునేందుకు పొలానికి వెళ్లేందుకు బయల్దేరిన సమయంలో సతీష్‌ ఇద్దరిపై అటాక్ చేశాడు. వ్య‌వ‌సాయ ప‌నిముట్టు పారతో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాల దగ్గరే కొబ్బరికాయ కొట్టి పూజలు చేశాడు. స్ధానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. రెండూ మృత దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి తరలించారు. నిందితుడు స‌తీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తండ్రి, బాబాయ్‌ని పౌర్ణమి నాడే ఒకేసారి హత్య చేయడంతో పలు అనుమానాలకు తావిస్తుంది.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Telangana crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు