నిజామాబాద్ జిల్లా,
న్యూస్ 18 తెలుగు , ప్రతినిదిః పి మహేందర్,
ఆస్తుల ముందు ఏ బందం అయినా దిగదుడుపే.. తొమ్మిది నెలలు కడుపు మోసి కన్న కొడుకు.. తనకు జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తల్లిని హత్య చేసాడు. వ్యసనాలకు బనిసైన కొడుకు భూమి అమ్మకుండా తల్లి అడ్డు వస్తుందని కన్నతల్లిని గొంతు నలిపి చంపిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిది లోని గండి మాసానిపేట్ కు చెందిన లచ్చి పోచమ్మ (55) .. కొడుకు సంజీవులు, కోడలు సరిత, ఇద్దరు మనవళ్ల తో కలిసి పూరి గుడిసె లో నివాసం ఉంటున్నారు. అయితే వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. సంజీవులు చెడు అలవాట్లకు బానిసై పని చేయకపోవడం తో అప్పులు పెరిగాయి. దీంతో మూడు నెలల కిందట నాలుగు గుంటల భూమి విక్రయించి అప్పులు తీర్చారు. మిగిలిన భూమిని కూడా అమ్మేద్దామని తరుచూ తల్లితో గొడవకు దిగేవాడు.
అయితే ఈ విషయమై మంగళవారం మళ్లి ఇరువురి మధ్య గొడవ జరిగింది. అయితే తల్లి భూమి అమ్మనివ్వడం లేని కోపోద్రిక్తుడైన సంజీవులు తల్లి మెడకు టవల్ చూట్టి బిగించాడు.. అయితే తల్లి పోచమ్మకు ఊపిరి ఆడకా చనిపోయింది.. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిదిలోని గండి మాసానిపేట్ కు చెందిన లచ్చి పోచమ్మ (55) .. కొడుకు సంజీవులు, కోడలు సరిత, ఇద్దరు మనవళ్లతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు... అయితే వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది... సంజీవులు చెడు అలవాట్లకు బానిసై పని చేయకపోవడం తో అప్పులు పెరిగాయి... దీంతో మూడు నెలల కిందట నాలుగు గుంటల భూమి విక్రయించి అప్పులు తీర్చారు. మిగిలిన భూమిని కూడా అమ్మేద్దామని తరుచూ తల్లితో గొడవకు దిగేవాడు.
అయితే ఈ విషయమై మంగళవారం మళ్లి ఇరువురి మధ్య గొడవ జరిగింది... అయితే తల్లి భూమి అమ్మనివ్వడం లేని కోపోద్రిక్తుడైన సంజీవులు తల్లి మెడకు టవల్ చూట్టి బిగించాడు.. అయితే తల్లి పోచమ్మకు ఊపిరి ఆడకా చనిపోయింది.. కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Nizamabad, Telangana