Home /News /telangana /

NIZAMABAD SHOPPING MALL STAFF GIVE ACID BOTTLE TO CUSTOMER ASKING FOR DRINKING WATER IN NIZAMABAD SNR NZB

OMG : నిజామాబాద్‌లో షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్లక్ష్యం..మంచినీళ్లడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చాడు

(నీళ్లడిగితే..యాసిడ్ ఇస్తారా)

(నీళ్లడిగితే..యాసిడ్ ఇస్తారా)

OMG: నిజామాబాద్‌లో బట్టల షాపుకు పెళ్లి షాపింగ్‌కి వెళ్లిన కస్టమర్‌ ప్రాణాలతో సిబ్బంది చెలగాటమాడారు. దాహం వేస్తోంది మంచినీళ్లివ్వమని అడిగితే యాసిడ్‌ బాటిల్ ఇచ్చాడు. చూసుకోకుండా కస్టమర్ తాగడంతో ప్రాణపాయస్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    ఏ వ్యాపారస్తుడికైనా కస్టమర్ దేవుడితో సమానం అంటారు. వినియోగదారుడి రూపంలో వచ్చి వ్యాపారుడ్ని ఆర్ధికంగా ఆదుకునే భగవంతుడని ప్రతి వ్యాపారి భావిస్తారు. కాని నిజామాబాద్‌(Nizamabad)జిల్లాలో ఓ బడా వ్యాపార సంస్థ తమ షాపుకి వచ్చిన కస్టమర్(Customer)ప్రాణాలతో చెలగాటమాడటం కలకలం రేపింది. పెద్ద వస్త్ర దుకాణం(Clothing store)గా పేరున్న షాపుకి వెళ్లిన కస్టమర్ బట్టలు కొనుగోలు చేస్తూ దాహం కావడంతో మంచినీళ్లు అడిగాడు. అయితే షాపులో పని చేస్తున్న గుమస్తా కస్టమర్ నీళ్లు(Water)అడిగితే నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో చివరికి అతని ప్రాణాలకు చేటు ఏర్పడింది.

    మంచినీళ్లు అడిగితే యాసిడ్ ఇచ్చాడు..
    నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సంఘటన అందర్ని షాక్‌కి గురి చేసింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అహ్మద్‌నగర్‌కు చెందిన విజయ్‌కుమార్ పెళ్లి బట్టల షాపింగ్ కోసం కుటుంబ సభ్యులను తీసుకొని నగరంలోని గాంధీచౌక్‌లోని సుల్తాన్ షాపింగ్ మాల్ కు వచ్చారు. షాపింగ్ చేస్తూ మధ్యలో దాహం వేయడంతో మంచినీళ్లు కావాలని అక్కడే ఉన్న బాయ్‌ని మంచి నీళ్లు ఇవ్వాలని కోరాడు. అయితే అక్కడ ఉన్న గుమస్తా వాటర్‌ బాటిల్ ఇచ్చాడు. దాహంతో ఉన్న విజయ్‌కుమార్‌ వెంటనే బాటిల్‌లో ఉన్నది మంచినీళ్లే అనుకొని తాగేశాడు. బాటిల్‌లోని యాసిడ్‌ సుమారు 25మిల్లీ లీటర్లు తాగడంతో గాఢత తక్కువ ఉండటంతో మొదట ఏమి అనిపించలేదు.

    (నీళ్లడిగితే యాసిడ్ ఇస్తారా)
    (నీళ్లడిగితే యాసిడ్ ఇస్తారా)


    అంత నిర్లక్ష్యమా ..
    మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన కొద్ది సేపటికే విజయ్‌కుమార్‌ కడుపులో మంట మండుతోందని విలవిల్లాడుతూ పడిపోయాడు. విజయ్‌కుమార్‌తో వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆశ్చర్యపోయి షాపింగ్ మాల్ నిర్వాహకుల సాయంతో హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు విజయ్‌కుమార్‌కి ట్రీట్‌మెంట్‌ చేసి కొద్దిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తీసుకెళ్లమని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు విజయ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

    ఇది చదవండి: కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కు .. ఇప్పుడెలా ఉందో ..అక్కడేం జరుగుతుందో తెలుసా



    చాపు తప్పి కన్నులొట్టపోయినట్లైంది..
    విజయ్‌కుమార్ అస్వస్థతకు గురవడానికి కారణమైన యాసిడ్‌ బాటిల్‌ని గుర్తించిన కుటుంబ సభ్యులు షాపింగ్‌ మాల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తన తండ్రి ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం జరిగింతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాహం అయిందని మంచినీళ్లు అడిగితే యాసిడ్ ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితుడు విజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు. అసలు అంత పెద్ద వస్త్ర దుకాణంలో యాసిడ్ బాటిల్ ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి బాధితుడు విజయ్‌కుమార్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నారు.

    ఇది చదవండి: ఒక్క గదిలో 10మంది అమ్మాయిలా.. చూడండి సార్‌ ఇంతకన్న దారుణం ఏమైనా ఉంటుందా

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు