హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

Telangana : మండవ ఈసారి పోటీ చేయడం పక్కా .. ఏ పార్టీ నుంచంటే..?

Mandava Venkateswara Rao

Mandava Venkateswara Rao

Telangana: ఉమ్మ‌డి రాష్ట్రంలో చ‌క్రం తిప్పిన సీనీయ‌ర్ నేత‌.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సైలెంట్ అయ్యారు. తాజాగా  రైతుల విష‌యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌ని తీరుపై మాజీ మంత్రి మండ‌వ స్పందిచ‌డం ఇప్పుడు చ‌ర్య‌నీయ ఆంశంగా మారింది.  అయితే మండ‌వ ఇప్పుడు పైర్ అవ్వ‌డం వేనుకున్నా ఆంతర్యమేమిటి ..? మండ‌వ దారి ఏటు వైపనేది రాజ‌కీయ చ‌ర్చ జ‌రుగుతుంది.             

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిజామాబాద్(Nizamabad)జిల్లా నుంచి ద‌శ‌బ్దాల పాటు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. రాష్ట్రం రాజ‌కీయ‌ల్లో కీలకంగా వ్య‌వ‌హ‌రించారు.      ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో మండ‌వ వెంక‌టేశ్వ‌రరావు(Mandava Venkateswara Rao) ఉన్నారు.  ఎన్టీఆర్(NTR),చంద్రబాబు(Chandrababu)కు రైట్ హ్యాండ్‌గా ఉండేవారు. నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా గుర్తింపు పోందారు. తన సామాజిక వర్గానికి అండ‌గా నిలిచారు.  తెలంగాణలో టీడీపీ(TDP) అధికారం కోల్పోయినప్పటి నుంచి మండవ వెంకటేశ్వరరావు సైలెంట్ అయ్యారు మండవ వెంక‌టేశ్వ‌రరావు. 2019 పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్(KCR) నేరుగా మండవ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయార‌ు. దీంతో సైకిల్ దిగి కారులో రాకీయ ప్రయాణం మొదలుపెట్టారు.

  KCR| Munugodu: మునుగోడుపై కేసీఆర్ భారీ ప్లాన్.. ఏకంగా అంతమంది ఎమ్మెల్యేలు రంగంలోకి..?

  ఎన్నికల బరిలోకి మళ్లీ మండవ..

  ఈ జర్నీ మండవకు పెద్దగా కలిసి రాలేదు. ఆతర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  సీఎం కుతూరు  కల్వకుంట్ల కవిత ఓట‌మితో మండ‌వ రాజ‌కీయ భ‌విష‌త్తు తారుమారైంది. ఎంపీగా క‌విత‌ను గెలిపించి ఉంటే సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి పెంచి త‌న‌కు ఎదైన ప‌ద‌వి కావాల‌ని అడిగేవారు. కానీ ఓట‌మి కార‌ణంగా ఏం చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. అయితే ఆనాటి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల్లో మండవ అంత చురుగ్గా కనిపించ లేదు. అధిష్టానం కూడా ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈపరిణామాలతోనే మండ‌వ పార్టీ మారుతార‌ని ప్రచారం జ‌రిగింది.

  ఏ జెండా పట్టుకుంటారో ..?

  రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మండ‌వ వేంక‌టేశ్వ‌రరావు  ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని నిర్ణయాలు, విధానాలతో రైతులు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు బాగా కురిసి ..ధాన్యం దిగుబడి బాగా జరిగితే అటు కేంద్ర ప్రభుత్వం గానీ.. ఇటూ రాష్ట్ర ప్రభుత్వం గానీ ధాన్యం కొనుగోలు మీద శ్రద్ధ చూపడం లేదనే విషయాన్ని ఆయన బాహాటంగానే చర్చించారు.

  YS Sharmila : YS షర్మిలపై మరో పోలీస్ కంప్లైంట్ .. SC,ST చట్టం కింద కేసు నమోదు చేయాలంటున్న దళిత సంఘాలు

  సీనియర్‌లు గెలిచే ఛాన్సుందా..?

  గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న మండవ ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడ‌డం చర్చనీయాంశమైంది. అయితే మండ‌వ మ‌ళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా అందుకే ప్రజాసమస్యలపై తన వాయిస్‌ని వినిపిస్తున్నారనే టాక్ నెలకొంది. వచ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగితే ఏ పార్టీ నుంచి పోటి చేస్తారు..? ఎంత వరకు ఆయన ప్రయత్నం ఫలిస్తుంది..? అనే చర్చ జిల్లా ప్రజల్లో నెలకొంది. అనుభవం ఉన్న నేతలు రాజకీయాల్లో మరోసారి గెలిచే అవకాశం లేకపోలేదనే టాక్‌ కూడా ఉంది.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Telangana Politics