Home /News /telangana /

NIZAMABAD SARPANCH HUSBAND COMMITTED SUICIDE DUE TO DEBT IN NIZAMABAD DISTRICT SNR NZB

Telangana : పురుగుల మందు తాగి సర్పంచ్ భర్త సూసైడ్ .. కారణం అదేనంట

Telangana : మంత్రి నియోజకవర్గంలోనే ఓ సర్పంచ్‌ భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.  అప్పుచేసి గ్రామపంచాయితీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక పురుగుల మందు తాగాడు.

Telangana : మంత్రి నియోజకవర్గంలోనే ఓ సర్పంచ్‌ భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అప్పుచేసి గ్రామపంచాయితీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక పురుగుల మందు తాగాడు.

Telangana : మంత్రి నియోజకవర్గంలోనే ఓ సర్పంచ్‌ భర్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అప్పుచేసి గ్రామపంచాయితీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో వడ్డీలు కట్టలేక పురుగుల మందు తాగాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India
    (P.Mahendar,News18,Nizamabad)
    స‌ర్పంచ్ (Sarpanch)అంటే గ్రామానికి ప్ర‌థ‌మ పౌరుడు. గ్రామాభివృద్ది వారి చేతుల్లోనే ఉంటుంది అంటారు. స‌ర్పంచ్ గ్రామ‌స్తులు వారి గ్రామంలో వారికి అత్య‌వ‌స‌ర‌మైన ప‌నుల‌ను ఎంచుకోని ప‌నులు చేసుకొవ‌చ్చాని ప్ర‌భ‌ుత్వం ప్ర‌క‌టించింది. దీంతో స‌ర్పంచ్‌లు ఉత్స‌హంతో ప‌నులు ప్రారంభించి పూర్తి చేశారు. కానీ ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన బిల్లులు స‌కాలంలో అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ప‌తున్నారు. అభివృద్ది కోసం తీసుకు వ‌చ్చిన అప్పులకు వ‌డ్డీలు పెర‌గడంతో స‌ర్పంచ్‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. తాజాగా నిజామాబాద్(Nizamabad)జిల్లాకు చెందిన ఓ స‌ర్పంచ్ భ‌ర్త అప్పుల పాలై చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య(Suicide)చేసుకున్నారు.

    Telangana : సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐసీసీసీ ప్రారంభం .. ఐదు టవర్లలో నిఘా వ్యవస్థ పటిష్టం



    సర్పంచ్‌ల గోస ..
    నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ, రిజ‌ర్వేష‌న్‌లో భాగంగా ముత్తెమ్మ స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. గ్రామంలోని అభివృద్ధి పనులతో పాటు గ్రామా పంచాయతీ నిర్వహించాల్సిన పనుల కోసం సర్పంచ్ ముత్తెమ్మ ఆమె భర్త మల్లేష్ అప్పులు తెచ్చి ప‌నులుపూర్తి చేశారు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులను కూడ ప్రభుత్వానికి పంపారు. అయితే స‌కాలంలో బిల్లులు రాక.. తెచ్చిన అప్పులు కట్టలేక ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ప‌డ్డారు సర్పంచ్ దంపతులు.



    అప్పులు తీర్చలేక ఆత్మహత్య..
    ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో అప్పుల వాళ్లు డ‌బ్బులు అడ‌గ‌డంతో వారికి అప్పు క‌ట్టే ప‌రిస్థితి క‌నిపించలేదు. దీంతో చేసేదేమి లేక‌ బుధవారం వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ భర్త మల్లేష్. అతడ్ని వైద్యం కోసం ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుప‌త్రి వైద్యులు చికిత్స అందించారు. గురువారం తెల్లవారుజాముల మ‌ల్లేష్ చికిత్స‌ పొందుతూ మృతి చెందాడు. సర్పంచ్ భర్త మల్లేష్ మృతితో వడ్డెర కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

    Hyderabad : U20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన తొలి తెలంగాణ యువ‌తి .. కరోనాని జయించిన మనోధైర్యం ఆమెది


    పరిష్కారమార్గమేంటి..?
    స్వ‌యానా జిల్లా మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్పంచ్ భ‌ర్త బిల్లులు రాక ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చ‌ర్య‌నీయ ఆంశంగా మారింది. మ‌రో వైపు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై క‌ల్లేడ స‌ర్పంచ్ భ‌ర్త హ‌త్యాయత్నానికి పాల్పడంతో పాటు మ‌రో స‌ర్పంచ్ భర్త ఆత్మ‌హ‌త్య చేసుకొవ‌డంతో జిల్లాలో స‌ర్పంచ్‌ల ప‌రిస్థితి ఎలా ఉంది .? ఎందుకు అప్పుల పాల‌వుతున్నారనే విషయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఆలోచించాలంటున్నారు జిల్లా ప్రజలు.
    First published:

    Tags: Nizamabad, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు