NIZAMABAD RTC DRIVER COMMITS SUICIDE DUE TO WORK STRESS IN KAMAREDDY DISTRICT SNR NZB
Kamareddy: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ .. కారణం అదేనట
(ఈ చావుకు కారకులెవరూ)
Kamareddy: ఆర్టీసీ డ్రైవర్ చేతిలో బస్సు స్టీరింగే కాదు.. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు కూడా ఉంటాయి. బస్సు జాగ్రత్తగా నడుపక పోతే జరిగే నష్టాన్ని ఎవరు అంచన వేయాలేరు. అయితే బస్సు నడిపే డ్రైవర్‌పై ఒత్తిడి లేకుండా ఉంటేనే బస్సు ప్రయాణం సుఖంగా జరుగుతుంది. ఈ చిన్న విషయాన్ని గుర్తించలేని ఆర్టీసీ అధికారులు డ్రైవర్లపై పని ఒత్తిడి పెంచడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తోటి ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు.
(P.Mahendar,News18,Nizamabad)
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షింతం కాదు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అని అధికారులు ప్రచారం చేస్తారు. అయితే ఆర్టీసీలో డ్రైవర్లను మాత్రం టార్గెట్లు, ఓటీల పేరుతో ఒత్తిడికి గురి చేయడంతో వాళ్లే జీవితంపై విరక్తి చెందుతున్నారు. కామారెడ్డి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అధికారుల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది.
గతంలో ఎంతో ఠీవిగా ఉండే ఆర్టీసీ డ్రైవర్ (RTC driver)ఉద్యోగం ప్రస్తుతం ఓ నరకయాతనగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాతబడిపోయిన బస్సులతో మైలేజీ Mileageతీసుకురావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడం, అధిక సమయం డ్యూటీ వేయడం వంటి కారణాలతో పాటు మరికొన్ని సమస్యలతో ఆర్టీసీ డ్రైవర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కామారెడ్డిKamareddy జిల్లాలో కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ని అధికారులు డ్యూటీ(Duty)లో చేరాల్సిందేనని పట్టుబట్టడంతో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన బండి స్వామి గౌడ్ కామారెడ్డి డిపోలో బస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య శిరీష. ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్న స్వామిగౌడ్ కొద్ది రోజులుగా మూలశంక వ్యాధితో బాధపడుతున్నాడు. 15రోజుల క్రితమే డ్యూటీకి సెలవు పెట్టి పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడు. స్వామిగౌడ్ డ్రైవర్ కావడంతో డ్యూటీ సమయంలో ఎక్కువగా కూర్చొవాల్సి ఉంటుంది. తనకున్న మూలశంక సమస్యతో డ్యూటీ చేయడం సాధ్యం కాదని భావించి లీవ్ పెట్టాడు.
ఆరోగ్యం బాగోలేదన్నా వినరా..
అనారోగ్యంతో లీవ్ పెట్టిన స్వామిగౌడ్‌కి కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ఉన్నతాధికారులు ఫోన్ చేసి తప్పని సరిగా డ్యూటీలో చేరాలని ఆదేశించారు. పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న స్వామిగౌడ్ కూర్చొవడమే కష్టంగా ఉన్న సమయంలో గంటల తరబడి డ్యూటీ చేయాలని ఆదేశించడంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాడు. తన సమస్య ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ తాను పని చేస్తున్న ఆర్టీసీలో పని భారం పెరిగిందని ..అధికారుల ఒత్తిడితో బస్సు నడపడం కష్టం అవుతుందని భావించే సూసైడ్ చేసుకుంటున్నట్లుగా లేఖలో పేర్కొన్నాడు స్వామిగౌడ్.
ఆ కుటుంబానికి దిక్కెవరూ..
కేవలం 35సంవత్సరాల స్వామిగౌడ్ ..ఆర్టీసీలో పనిభారం తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబాన్ని పోషించాల్సిన భర్త బలవన్మరణం చేసుకోవడంతో భార్య శిరీష బోరున పిలపిస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు తోటి ఉద్యోగులు విషయం తెలుసుకొని విచారం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న భిక్కనూరు పోలీసులు స్వామిగౌడ్ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకున్న సమయంలో ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేయడం వల్లే స్వామిగౌడ్ చనిపోయాడని...దిక్కులేని తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.