హోమ్ /వార్తలు /తెలంగాణ /

RS Praveen Kumar : రాబోయే ఎన్నికలకు బీఎస్పీ పక్కా వ్యూహం .. ఆ జిల్లాలో మెజార్టీ స్థానాలపై కన్నేసిన RS ప్రవీణ్‌కుమార్

RS Praveen Kumar : రాబోయే ఎన్నికలకు బీఎస్పీ పక్కా వ్యూహం .. ఆ జిల్లాలో మెజార్టీ స్థానాలపై కన్నేసిన RS ప్రవీణ్‌కుమార్

RS PRAVEEN KUMAR(FILE)

RS PRAVEEN KUMAR(FILE)

Telangana: తెలంగాణ రాజకీయాల్లో బ‌హుజ‌న సమాజ్ పార్టీ త‌న మార్కును చూపించేందుకు పావులు కదుపుతోంది. బీఎస్పీలోకి ఐపీఎస్‌ అధికారి చేరడంతో ఆ పార్టీలో జోష్ వ‌చ్చింది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ పదవి చేపట్టిన తర్వాత ఆయన వచ్చే ఎన్నికలను ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ జిల్లాలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ టార్గెట్ ఏంటో ఏంటీ..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nizamabad, India

  (P.Mahendar,News18,Nizamabad)

  తెలంగాణ రాజకీయాల్లో బ‌హుజ‌న సమాజ్ పార్టీ త‌న మార్కును చూపించేందుకు పావులు కదుపుతోంది. బీఎస్పీ(BSP)లోకి ఐపీఎస్‌ అధికారి చేరడంతో ఆ పార్టీలో జోష్ వ‌చ్చింది. బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ పదవి చేపట్టిన తర్వాత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్(RS ​Praveen kumar)వచ్చే ఎన్నికలను ల‌క్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. బీఎస్పీకి ఏ ఏ జిల్లాలో ఏఏ నియోజకవర్గాల్లో ఆదరణ ఉంది. అనే విష‌యాల‌పై లెక్కలు వేసుకుంటున్నారు.   ఉమ్మ‌డి నిజామాబాద్(Nizamabad)జిల్లాపై ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఈ మాజీ ఐపీఎస్‌ అధికారి. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బాల్కొండ(Balconda), నిజామాబాద్ అర్బన్(Nizamabad Urban), బోధన్(Bodhan), జుక్కల్(Jukkal), బాన్సువాడ(Bansuwada), కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గాల నుంచి బహుజన సమాజ్‌వాది పార్టీ నుంచి అభ్యర్ధులు ఎమ్మెల్యేలుగా పోటి చేశారు. అయితే బాల్కొండ నియోజ‌క‌వర్గంలో బీఎస్పీ నుంచి పోటీ చేసిన సునీల్ రెడ్డి అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచారు.  మిగతా చోట్ల అంతగా ప్రభావం చూపకపోయిన పోటీలో ఉన్నామనే సంకేతాలిచ్చారు. దీంతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు్మార్ ఈ జిల్లాపైనే పోక‌స్ చేస్తున్నారట.

  Telangana : BRSలో ఉద్యమాల జిల్లా నేతలకు ప్రాధాన్యత ..నెక్స్ట్ కేసీఆర్‌ పోటీ చేసేది అక్కడి నుంచేనా..!

  రాబోయే ఎన్నికలకు ఇప్పుడే వ్యూహారచన..

  ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజ‌క‌వ‌ర్గ‌ాల్లో  బహుజన్ సమాజ్‌వాది పార్టీకి ఎక్కువగా అనుకూలంగా ఉంది. బాల్కొండ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలపై  ఆ పార్టీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ , బీజేపీ , కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నప్పటికీ సిట్టింగ్‌లో ఎవరికైనా ఒకవేళ టికెట్ దక్కకుంటే ప్రత్యామ్నయం చూసుకునే అవకాశమూ లేకపోలేదు. చివరి క్షణంలో అలాంటి అభ్యర్థులు బీఎస్సీని ఆశ్రయించే అవకాశం ఎక్కువ‌గా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ లో కూడా టికెట్ ఆశిస్తున్న వారు చివరికి ఆశాభంగం కలిగితే వారు సైతం బీఎస్సీ వైపు చూసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

  ఉనికిని చాటుకునే ప్రయత్నం..

  ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన సెకండ్ క్యాడర్ లీడర్లు సైతం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యమే ధ్యేయంగా  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీల నుంచి ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారే పోటీలో ముందుంటున్నారు. బహుజనులకు అవకాశం ఇచ్చేందుకు బీఎస్పీ ముందుకు వస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఉన్నత వర్గానికి చెందిన సునీల్ రెడ్డి బీఎస్పీ నుంచే పోటీ చేశారు.  మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి మంచి పోటి ఇచ్చారు. టీఆర్ఎస్ త‌రువాత బీఎస్పీకి ఎక్క‌వ ఓట్లు వ‌చ్చాయి.

  ఆ నాలుగు నియోజకవర్గాలపై ఫోకస్..

  అయితే ఈసారి బాల్కొండలో ఉన్నత వర్గానికి చెందిన నేతకు కాకుండా బహుజనుల‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సెకండ్ ఆప్షన్ పెట్టుకున్న వివిధ పార్టీలకు చెందిన ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన నేతలు అయోమయంలో పడ్డారు. మ‌రో వైపు జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడ్ కావడంతో బీఎస్పీ ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టింది. జుక్క‌ల్‌లో కూడా ఎక్కువ‌గా ఎస్సీ, ఎస్టీ ఓట‌ర్లు ఉన్నారు. గురుకులాల్లో చ‌దివిన విద్యార్థులు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సపోర్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో జుక్కల్ సీటు కైవసం చేసుకునేందుకు ప్రవీణ్ కుమార్ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నార‌ని తెలుస్తుంది.

  Farmers Problems : మొక్కజొన్న రైతులను నిండా ముంచిన భారీ వర్షాలు .. పెట్టుబడి రావడం కష్టమేనంటూ ఆవేదన

  బీఎస్పీ టార్గెట్ అదేనా..?

  బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. అయితే అభ్యర్థిని బట్టి కూడా ఇక్కడ ఓట్లు పోల్ అయ్యాయి. పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఈసారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ఈ నియోజకవర్గంపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రజామోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో ఉంచేందుకు బీఎస్సీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు కామారెడ్డి, ఇటు ఎల్లారెడ్డి, ఇటు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ‌కీయ చ‌ద‌రంగం మొద‌లెట్టిన‌ట్లు తెలుస్తోంది. మరి ఆయ‌న వ్యూహ‌లు ఎంత‌వ‌ర‌కు విజ‌యం సాధిస్తాయో.. లేదో తెలియాలంటే ఆసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nizamabad, Rs praveen kumar, Telangana Politics

  ఉత్తమ కథలు