Home /News /telangana /

NIZAMABAD RETIRED TEACHER DONATES PROPERTY AND CASH TO COMMUNITY SERVICE IN NIZAMABAD DISTRICT SNR NZB

Telangana: సిరి,సంపదలున్న పేదరాలు..సమాజహితం కోసం పుట్టిన శ్రీమంతురాలు

(అందరి బంధువు)

(అందరి బంధువు)

Nizamabad:ప్ర‌తి మ‌నిషి పుట్టిన‌ప్పుడు ఏమి తీసుకురాడు.. పోయేట‌ప్పుడు ఏమి తీసుకుపోడు..ఉన్న‌ప్పుడే మానవ ఎదుగుద‌లకు ఉప‌యోగప‌డినా...స‌మాజం కోసం ఏంతో కొంత చేయాల‌ని మాట‌లు చెబుతారు. ఇది మాటలకు బాగానే ఉంటుంది కాని ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందరికి సాద్యం కాదు. ఆమెకు తప్ప..

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  ప్ర‌తి మ‌నిషి పుట్టి న‌ప్పుడు ఏమీ తీసుకురాడు.. పోయేట‌ప్పుడు ఏమీ తిసుకుపోడు.. ఉన్న‌ప్పుడే మానవ ఎదుగుద‌లకు ఉప‌యోగప‌డినా...స‌మాజం కోసం ఏంతో కొంత చేయాల‌ని మాట‌లు చెబుతారు. ఇది మాటలకు బాగానే ఉంటుంది కాని ఆచ‌ర‌ణ‌లో మాత్రం అందరికి సాద్యం కాదు. నిజామాబాద్ (Nizamabad)జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు రిటైర్డ్ ఉపాధ్యాయురాలుత‌న సంప‌ద‌ను స‌మాజహితం కోసం ఖర్చు చేస్తు అంద‌రికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చివ‌ర‌కు త‌న శారీర‌న్ని సైతం వైద్య క‌ళాశాల‌(Medical College)కు రాసి ఇచ్చారు. జిల్లాలోని బోధన్(Bodhan)పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు జి. సరోజిన‌మ్మ‌(Sarojinamma).1963 నుంచి 2000 వ‌ర‌కు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వ‌హించారు. ఎంతో మందికి విద్యాబుద్దులు నేర్పించారు. 2000 సంవ‌త్స‌రంలో ఉపాధ్యాయురాలుగా ప‌ద‌వి విర‌మ‌ణ పోందారు. భర్త వెంకట్రావ్(Venkatrao)2016లో చనిపోయారు. ఒంట‌రిగా ఉంటున్న స‌రోజిన‌మ్మ‌ స‌మాజం కోసం ఏమైన చేయాల‌ని అనుకున్నారు.

  అందరి బంధువు..
  ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడానికే వెనుకాడే ఈరోజుల్లో సరోజనమ్మకు బోద‌న్ టౌన్‌లోని 26వ వార్డు వాణిజ్య ప్రాంతం. ఇక్కడ గజం స్థలం మార్కెట్లో రూ.40 వేలు పలుకుతోంది. అలాంటి చోట‌ 177 గజాల స్థలంలో రేకుల ఇంటిలో సరోజినమ్మ‌ నివాసముంటున్నారు. తన అనుభవంలో కొన్ని సంఘటనలు, విశ్రాంత మహిళా ఉద్యోగుల వెతలు చూసి చలించారు. పట్టణానికి దూర ప్రాంతం నుంచి వచ్చి ఒకరోజు ఉండాల్సి వస్తే ఎక్కడా వసతి సౌకర్యం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అనుకున్నారు ఈ పెద్దావిడ.తనకు పరిచయస్తులు ఎవరు వచ్చినా తన ఇంట్లనే ఆశ్రయం కల్పిస్తున్నారు సరోజనమ్మ. ఇలా తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారంగా తన తదనంతరం ఈ ఇంటిని వసతి కోసం వినియోగించుకునేందుకు అనువుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇంటిని రాసిచ్చారు.

   Retired teacher donates property and cash to community service in Nizamabad district|నిజామాబాద్ జిల్లాలో ఆస్తి,నగదును సమాజసేవకు దానం చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు,
  (అందరి బంధువు)


  నిస్వర్ధ సేవకురాలు..
  కరోనా కష్టకాలంలో అద్దె ఇంట్లోకి శవం రానివ్వకపోవ‌డంతో వారు ప‌డిన బాధలు మ‌రొక‌రు ప‌డ‌కూడదని భావించారు. అద్దె ఇళ్లలో ఉండే వాళ్ల కోసం ఏమైనా చేయాల‌ని ఆలోచించారు. సరోజనమ్మ అందులో భాగంగానే వార్డు మాజీ కౌన్సిలర్ దామోదర్‌తో చ‌ర్చించారు. అలాంటి వారి కోసమే భవనం నిర్మించాలని ఇద్దరూ నిర్ణయించడంతో వెంటనే లక్ష రూపాయల నగదును ఇచ్చారు సరోజనమ్మ. స్థలం కొంటానంటే 10 లక్షలు, భవనం అయితే ఖర్చు మొత్తం భరిస్తానని మాజీ కౌన్సిల‌ర్ దామోద‌ర్ కు హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ. 10 లక్షలు రూపాయ‌ల‌తో కుటుంబ సభ్యులుండటానికి విశ్రాంత గదులు.. శవాన్ని భద్రపరచడానికి ఫ్రీజర్ స‌హా అన్ని వసతులుండేలా నమూనా సిద్ధం చేయించారు.

  నిజమైన శ్రీమంతురాలు...
  గుర్రాల సరోజనమ్మ దయార్థ హృదయంతో తన సొంత డబ్బుతో ధర్మస్థలం నిర్మించేందుకు సంకల్పించారు. అలాంటి ధర్మస్థలం నిర్మాణానికి పట్టణంలోని హిందూ దహన వాటిక పక్కన మే 11న సరోజనమ్మ సమక్షంలో భూమి పూజ ఘనంగా జరిగింది.. బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి, బోధన్ RDO రాజేశ్వర్ భూమి పూజ చేశారు. సరోజనమ్మ ధర్మస్థల్ పేరుతో నిర్మిస్తున్న భవన ప్రాథమిక పనులు మొదలయ్యాయి.

  ఆస్తే కాదు శరీరం కూడా దానమే..
  త‌న‌ స్థిరాస్తిని మహిళల ప్రయోజనం కోసం.. నగదును ధర్మ కార్యాలకు వెచ్చిస్తున్న ఆమె ఉద్యోగ పింఛనుపై ఆధారపడి జీవిస్తున్నారు. భర్త వెంకట్రావ్ 2016లో చనిపోయారు. ఆమెకు పిల్లలు లేరు. త‌న‌కు చేతనైనంత సాయం చేస్తూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమవుతున్నారు. చివరకు తన శరీరాన్ని సమాజ శ్రేయస్సుకే ఉపయోగించాలని వైద్య కళాశాలకు రాసిచ్చారు. భర్త, పిల్లలు లేని తనకు ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలన్నదే ఆశయంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆస్తిని బంధువుల్లో ఎవరికి ఇచ్చినా బాగుండదని భావించినట్లు తెలిపారు. అందుకే ఈసాయం చేయడానికి సంకల్పించానని చెప్పారు సరోజనమ్మ. తన ఆస్తిని ప్రజాహితం కోసం ఖర్చు చేస్తానని తనకొచ్చే పింఛన్‌తో వెళ్లదీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చివరకు తన మరణానంతరం శారీరాన్ని కూడా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌కు రాసి ఇచ్చాని చెప్పారు స‌రోజిన‌మ్మ.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Citizen Services, Nizamabad, Teacher

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు