హోమ్ /వార్తలు /తెలంగాణ /

నిజామాబాద్‌లో ఆలస్యంగా పోలింగ్... ఉదయం 8 గంటలకు ప్రారంభం... కారణం ఇదీ...

నిజామాబాద్‌లో ఆలస్యంగా పోలింగ్... ఉదయం 8 గంటలకు ప్రారంభం... కారణం ఇదీ...

Lok Sabha Elections 2019 : దేశం మొత్తంలో ఎక్కువ సమయం పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్ నిలుస్తోంది.

Lok Sabha Elections 2019 : దేశం మొత్తంలో ఎక్కువ సమయం పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్ నిలుస్తోంది.

Lok Sabha Elections 2019 : దేశం మొత్తంలో ఎక్కువ సమయం పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్ నిలుస్తోంది.

అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలై... సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారాయన. సాధారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఈసారి వీవీప్యాడ్స్ ఉండటం వల్ల మరో గంట అదనంగా ఇచ్చారు. అందువల్ల సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. నిజామాబాద్‌లో ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మాక్‌ పోలింగ్‌ పూర్తి చేయటానికి సమయాన్ని మార్చాల్సి వచ్చిందని రజత్‌కుమార్‌ తెలిపారు. ఒక్క నిజామాబాద్‌లోనే పోలింగ్‌ సమయం మారిందని... మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

నిజామాబాద్‌లో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందువల్ల ఇప్పటికే మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. ఎంత సమయం పడుతుందన్న దానిపై అంచనా వేశారు. ఎన్నికల ఏర్పాట్లపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ఉన్న అనుమానాలను క్లియర్ చేస్తున్నారు అధికారులు. ఎన్నికల తేదీని మార్చాలన్న అభ్యర్థుల ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. అందువల్ల అభ్యర్థులు తక్కువ సమయంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. ఓ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది. ఒక్కో సెక్టార్‌ అధికారి వెంట ఒక్కో ఇంజినీరును పెట్టారు. రాష్ట్రానికి అదనపు కేంద్ర పోలీసు బలగాలు కావాలని కోరారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో చేర్చుకోబోతున్నారు.


ఇవి కూడా చదవండి :

పెందుర్తి ఎమ్మెల్యే కబ్జాదారుడు... ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్


నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల... ఎలా ఉంటుంది... కాంగ్రెస్‌కి షాక్ ఇస్తుందా...

భద్రాచలం మాదే... మేమే అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు సంచలన ప్రకటన

పసుపు-కుంకుమ నిధులకు బ్యాంకుల బ్రేకులు... ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పాల్సిందేనా...

First published:

Tags: Election Commission of India, Nizamabad, Nizamabad S29p04, Telangana, Telangana News

ఉత్తమ కథలు