(P.Mahendar,News18,Nizamabad)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay )... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ Dharmapuri Arvindమధ్య ఏం జరుతోంది. ఇప్పుడు ఇదే తెలంగాణ(Telangana)లో హాట్ టాఫిక్ గా మారింది. ఎప్పుడు ఒకరికొకరు సపోర్టుగా ఉండే వాళ్ల మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది..? ఈమధ్య కాలంలో వీరిద్దరూ ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నారు. ఇద్దరు ఒకేసారి ఎంపిలుగా పార్లమెంట్‌కు వెళ్లారు. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో బీజేపీ(BJP) బలోపేతానికి కారణం కావాల్సిన వాళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు. పార్టీలోకి ఆ నేతను ఆహ్వానించడమె.. జిల్లా పార్టీ ఆధ్యక్షడు కూడా కారణామా అనేది జిల్లాలో చర్చనీయ ఆశంగా మారింది.
రెండు కత్తులు ఒకే ఒరలో ..
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న బీజేపీ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు ముప్పుగా మారాయా..! ఒకవైపు జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మి నర్సయ్య, మరోవైపు బాల్కొండ ముత్యాల సునిల్ రెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరికీ వారే జిల్లాకు చెందిన ఎంపీ అరవింద్‌కు వ్యతిరేకంగా జంత కట్టినట్లుగా పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఇవే జిల్లా కమలం పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే చంద్రయ్యపై దాడి జరిగిందనే ప్రచారం కూడా ఉంది. అంతే కాదు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మార్పు గురించి సైతం వివాదంలో భాగంగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి బండి సంజయ్ కి ధర్మపురి అరవింద్ కు మధ్య జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినారాయాణ , బాల్కొండ ముత్యాల సునీల్ రెడ్డి లే కారణం అని ఆ పార్టీ నేతలే బహిరంగంగానే అంటున్నారు.
అంతర్గత విభేదాలు..
ఇప్పటికే బాల్కొండకు చెందిన మల్లిఖార్జున్‌రెడ్డికి మద్దతు ఇస్తున్న అరవింద్ మొండి పట్టుతో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న యెండల లక్ష్మినారాయణకు ఎంపి ఆర్వింద్ ఇద్దరు జిల్లాలో చేరో గ్రుప్‌ను నడుపుతున్నారు. అయితే ఆర్వింద్ ఎంపిగా ఎన్నికైన తర్వాత తన అనుచరుడు బస్వా లక్ష్మి నారాయణను జిల్లా అద్యక్షుడిగా నియమించారు. అయితే ఇప్పుడు బస్వాతో కూడా ఎంపి ఆర్వింద్‌కు సఖ్యత లోపించింది. దీంతో పార్టీ అధ్యక్షుడ్ని మార్చాలనే అలోచనలో ఎంపి ఆర్వింద్ ఉన్నారు. అయితే ఇప్పుడు బస్వా, యెండలతో జట్టు కట్టాడు. రాష్ట్ర అధ్యక్షుడు బండికి సంజయ్‌కి దగ్గరయ్యాడు.
అర్వింద్ వర్సెస్ బండి..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ధర్మపురి అర్వింద్ ఖండించారు. అవి పార్టీకి సంబంధం లేదని..బండి సంజయ్ వ్యక్తిగతమని చెప్పడం వెనుక ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న కోల్డ్‌వార్ కాస్తా బయటపెట్టినట్లైంది. దీంతో పార్టీ క్యాడర్ ఒకరకంగా.. ప్రజలు మరో రకంగా అర్ధం చేసుకుంటున్నారు. బండి సంజయ్‌పై ఎన్నడూ మాట్లాడని అర్వింద్ తన మనసులో మాటను బయటపెట్టాడని..ఈ విషయం పార్టీ హైకమాండ్‌కి కూడా అర్ధమైందనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
కొత్తగా చేరే వారితోనే చిక్కంతా..
అయితే అర్వింద్ బండి సంజయ్‌కి మధ్య గ్యాప్ రావడానికి మరో కారణం కనిపిస్తోందంటున్నారు నేతలు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు బండి సంజయ్ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ముత్యాల సునీల్ రెడ్డితో టచ్‌లో ఉన్నారని రేపో మాపో పార్టీలో చేరే అవకాశం ఉంది. సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని. ఆర్ధికంగా బలమైన వ్యక్తి కావడమే కాకుండా .. రెండు రాష్ట్రల్లో ఆయన ట్రావెల్స్ నడుస్తోంది.
పంతం నీదా నాదా..
రాజకీయ పరిణామాల రీత్యా చివరకు బీస్పి నుంచి టికెట్ తీసుకొని బాల్కొండ అసెంబ్లీకి పోటి చేసారు.. అయితే రెండో స్థానంలో నిలిచారు... బాల్కొండ టికెట్ ఆశించినా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డికే టికెట్ ఇచ్చారు... కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించడంతో ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంపై పట్టు పెరిగింది. దీంతో సునీల్ బీఆర్ఎస్ కు దూరమయ్యాడు. సునీల్ గత ఏడాదిన్నరగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే బండి సంజయ్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. సునీల్ రెడ్డి చేరికను అరవింద్ వ్యతిరేకిస్తున్నారు. అర్వింద్ నిజామాబాద్ ప్రాంతంలో బలమైన నాయకుడిగా దూసుకుపోతున్నారు. సునీల్ రెడ్డి ధనవంతుడు కావడం, పార్టీలో చేరితే టికెట్ దక్కే అవకాశం ఉండడంతో పాటు టిక్కెట్ కోసం పార్టీలో చేరుతున్న సునీల్ రెడ్డిని అరవింద్ వ్యతిరేకిస్తున్నారు.
ఏం జరుగుతుందో..
ఆయన చేరిక పెండింగ్ లో ఉన్నప్పటికీ, సునీల్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ పార్లమెంట్ ప్రాంతంలో తన కార్యకలాపాలను పెంచుతున్నట్లుగా సమాచారం. మరోవైపు చేరికలు చూసుకుంటున్న ఈటెల రాజేందర్ సునీల్ రెడ్డి మంచి సంబంధాలు ఉన్నాయి... సునీల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమవడంతో సంజయ్ పై అరవింద్ ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతల కారణంగా రాష్ట్రంలోని బిజెపిలో వివాదాలు తప్పవనే ప్రచారం జోరందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Dharmapuri Arvind, Nizamabad, Telangana Politics