హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: BRS ఎమ్మెల్యే హత్య కుట్రభగ్నం.. మహిళ ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ ,డిటోనేటర్స్ సీజ్

Crime News: BRS ఎమ్మెల్యే హత్య కుట్రభగ్నం.. మహిళ ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ ,డిటోనేటర్స్ సీజ్

Jeevanreddy(file photo)

Jeevanreddy(file photo)

Crime News:నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరు తెచ్చారు..ఎందుకు తెచ్చారని ప్రశ్నిస్తే ..ఓ ఎమ్మెల్యే హత్యాయత్నం కేసులో నిందితుడు తెచ్చి పెట్టాడని చెప్పడంతో అలర్ట్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

నిజామాబాద్ (Nizamabad)జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు. అసలు మహిళ ఇంట్లో పేలుడు కోసం వాడే జిలెటిన్ స్టిక్స్ (Jiliten sticks)ఎలా వచ్చాయి..? ఎందుకున్నాయి..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తే కొత్త విషయం బయటపడింది. గతంలో జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే(Armor MLA) జీవన్‌రెడ్డి(Jeevan reddy)పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆ కేసులో నిందితుడిగా గుర్తించిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తే ఈ పేలుడు పదార్ధాలను మహిళ ఇంట్లో దాచినట్లుగా తేలడంతో పోలీసులు మరోసారి డైలమాలో పడ్డారు. జైల్లో ఉన్న వ్యక్తి ఇదెలా చేశాడో విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

టార్గెట్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో రూరల్ పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఎంఐజీ-122 ఇంటిలో 95 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మ‌హిళ ఇంట్లో పేలుడు ప‌దార్థాలను చ‌క‌చ‌క్యంగా గుర్తించిన పోలీసులు ఆ పేలుడు ప‌దార్థ‌లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పై మరోసారి హ‌త్యయ‌త్నం చేసేందుకే భద్రపరిచినట్లుగా తెలిసి షాక్ అయ్యారు. హత్య కుట్రను భగ్నం చేశారు. అయితే  ఇంటి యజమానురాలు బొంత సుగుణను పోలీసులు  అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. పోలీసుల విచారణలో సుగుణ తన ఇంట్లో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ ఉంచిన‌ట్లుగా చెప్పిందన్నారు సీఐ. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.

మహిళ ఇంట్లో జిలెటిన్ స్టిక్స్..

గతేడాది హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంట్లో తుపాకితో ఎమ్మెల్యే హత్యకు కుట్రపన్నిన వ్యక్తి ప్రసాద్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం అతను చంచల్ గూడా జైల్లో జైలులో ఉన్నాడు. ప్రసాద్ గౌడ్ భార్య మాక్లుర్ మండలం కల్లేడ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఆమెకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం చేయడానికి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశిచడం, మారణాయుధాలు కలిగి ఉండడంతో జైలుకుపంపారు.

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై మళ్లీ సండే ఫన్ డే షురూ ..ప్రత్యేక ఆకర్షణగా మ్యూజికల్ ఫౌంటెయిన్‌

పాత నేరస్తుడి పథకమేనా..

ఆ కేసులో అరెస్టైన ప్రసాద్‌గౌడ్ జైలు నుంచి విడుదలైన తర్వాత పేలుడు పదార్థాలను సేకరించి అవసరం వచ్చినప్పుడు వాడేందుకే దాచి పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చంచల్ గుడా జైల్లో ఉన్న ప్రసాద్‌గౌడ్‌ను పిటి వారెంట్‌పై తీసుకొచ్చి విచారించే యోచనలో పోలీససులు ఉన్న‌ట్టు తెలుస్తుంది.

First published:

Tags: BRS, Nizamabad police, Telangana crime news

ఉత్తమ కథలు