(P.Mahendar,News18,Nizamabad)
ముక్కు పచ్చలారని రెండేళ్ళ బాబుతో పాటు తల్లి ఇద్దరూ ఆనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపింది. భర్తే హత్య చేశాడడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాదు మృతురాలి తల్లిదండ్రులకు గిట్టని వాళ్లే హత్య చేయించారని భర్త అంటున్నాడు. ఇందులో ఎవరు చెప్పేది నిజమో తెలియక స్థానికులు అయోమయంలో పడ్డారు. నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో జరిగిన రెండు అనుమానాస్పదమృతి కేసులో అసలు నిజాన్ని రాబట్టేందుకు పోలీసులు(Police)కేసును అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దోషుల్ని పట్టుకుంటామంటున్నారు.
అనుమానాస్పదమృతి.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ శివారు పెద్ద వాగు పరిసరాల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న తల్లీ కొడుకుల మృతదేహాలను పోలీసులు వెలికి తీసారు. మృతులు నవీపేట్‌కు చెందిన లత ఆమె కుమారుడు హర్షగా గుర్తిం చారు. మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు మోర్తాడ్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం అత్తారింటి నుంచి లత కొడుకును తీసుకొని సోమవారం మోర్తాడ్ కు బయలుదేరినట్లు తెలిపారు. లత కుటుంబీకులు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. వాళ్లంటే గిట్టని వాళ్లు, వాళ్లతో ఆర్దిక గొడవలు ఉన్న వాళ్లే లతను, పసివాడ్ని హత్య చేసి ఉంటారని లత భర్త రాజశేఖరే బంధువులు అనుమానిస్తున్నారు.
తల్లి , బిడ్డ మృతి ..
ఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ ఇరువర్గాలకు వాగ్వాదం జరిగింది. మర్చురీ దగ్గరే గొడవ పడ్డారు. చనిపోయిన మహిళ తమ్ముడు బావను చంపుతానంటూ బెదిరించి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నారు.మా చెల్లి లతను అల్లుడ్ని మా బావ రాజశేఖరే హత్య చేసాడని మృతురాలు సోదరుడు వెంకటేష్ ఆరోపిస్తున్నారు. మృతురాలి ఆడబిడ్డ చిట్టీ, తోటి కోడలు నాగలక్ష్మి లతను చిత్రహింసలు పెట్టారని ఆరోపించాడు.
దోషులు ఎవరో తేలాలి..
నిజమాబాద్ గంగస్థానంలోని ఓ ఫ్లాట్ అమ్మిన డబ్బుల్లో కూడా డబ్బులు ఇవ్వమని బెదిరించినట్లుగా మృతురాలి సోదరుడు వెంకటేష్ తెలిపాడు . తన సోదరిని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారని వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జూలై 20వ తేదిన మోర్తాండ్‌కు వచ్చిన రాజశేఖర్ తన చెల్లెల్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారని చివరకు వాళ్లు అదే చేశారని మృతురాలి సోదరుడు పోలీసులకు తెలిపాడు.మరోవైపు మృతురాలి బంధువులు 63వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో ఆందోళన చేయడం సరికాదని పోలీసులు వారికి నచ్చచెప్పి వెనక్కి పంపించారు. అయితే మొత్తం మీద లత మృతికి గల కారణాలను ఆన్వేషించే పనిలో పోలీసులు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Death, Nizamabad, Telangana News