దుప్పటి ఉన్నంతా వరకే కాళ్లు చాపుకోవాలని పెద్దలు ఊరికే చెప్పలేదు.. నీ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా నీ ఖర్చులు ఉండాలని చెప్పకనే చెప్పారు.. ఆదాయం చారాణా.. ఖర్చులు బారాణ ఉన్న వారు చివరకు తప్పుడు దారిని ఎంచుకుంటున్నారు. ఓ యువకుడి వృత్తి మేస్త్రీ (Mason)పని.. ప్రవృత్తి చోరీలు (Theft).. తన జల్సాల కోసం దొంగగా మారాడు. అయితే మూడు పువ్వులు .. ఆరు కాయలుగా సాగిపోతున్న ఆ యువకుని చోరీలకు పోలీసులు బ్రేక్ వేశారు. చివరకు కృష్ణ జన్మ స్థానానికి పంపారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.. ఏసీపీ రామారావు (ACP Ramarao) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు బోదన్ పట్టణంలో మేస్త్రీ పని చేసేవాడు. అయితే తన జల్సాలకు ఆ డబ్బులు సరిపోక పోవడంతో ఏలా గైన ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు.. అనుకున్నట్టుగానే తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకున్నాడు. వృత్తి మేస్త్రీ పని.. ప్రవృత్తి చోరీలుగా మార్చుకున్నాడు.
దీంతో తన జల్సాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆచన్పల్లి బైపాస్ రోడ్డులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఈ షాదుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆసలు విషయం బయటు వచ్చింది.
గత కొద్ది రోజులుగా నాలుగు ఇళ్లల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు.. గంజ్ రోడ్, లక్ష్మీనగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, శక్కర్ నగర్ ఏరియాలో ని పలు ఇళ్లల్లో దొంగతనం చేసినట్లు చెప్పాడని ఏసీపీ రామారావు వెల్లడించారు.. నాలుగు చోట్ల చేసిన చోరీ కేసుల్లో ఏడు తులాల బంగారు అభరణాలు, 6 మొబైల్ ఫోన్లు, ఒక టీవీ, హోం థియేటర్, రెండు స్మార్ట్ వాచ్ లు.. కెమెరాతో పాటు హార్డ్ డిస్క్ రికవరీ చేవామని ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సై మచ్చేంధర్ రెడ్డి, కానిస్టేబుళ్లు షేక్ సర్, శ్రీకాంత్, రవి, రాజేష్, శంకర్లను ఏసీపీ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Nizamabad, Theft, Thief Arrested