Home /News /telangana /

NIZAMABAD POLICE BUSTED ANTI SOCIAL ELEMENTS ACTIVITIES IN NIZAMABAD AND ONE MAN ARRESTED PAH

అమాయకులే టార్గెట్.. మతం ముసుగులో ఉగ్రవాద చర్యలకు ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి అరెస్టు.. ఎక్కడంటే..

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పోలీసులు

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పోలీసులు

Nizamabad: అమాయక ముస్లిం యువతను మత విద్వేషాలు రెచ్చగొట్టేలా... అల్లర్లకు ఉసిగొల్పేలా శిక్షణ ఇస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఈ పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా సంస్థ ఉద్దేశమని డీసీపీ అర్వింద్ బాబు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్య‌క్తి పీఎఫ్ఐ సానుభూతి ప‌రున్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
(P.Mahendar,News18,Nizamabad) Nizamabad.

నిజామాబాద్ (Nizamabad) పోలీస్ క‌మీష‌న‌ర్ కార్య‌లయంలో డీసీపీ అర్వింద్ బాబు మీడియాకు వివ‌రాలు వెళ్ల‌డించారు. నిజామాబాద్ న‌గరంలోని ఆటోనగర్, ఉస్మానియా మస్జిద్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గమనించిన పోలీసులు ఫాలో అయ్యారు. ఆటో నగర్ లో ఓ ఇంట్లో పాపులర్ ఫ్రoట్ ఆఫ్ ఇండియా పేరుతో 2 బ్యానర్లు, కనిపించాయి. పోలీసులు లోనికి వెళ్లి చూడ‌గా.... ఒక వైట్ రైటింగ్ బోర్డు, ఒక బర్దాన్, 15 వెదురు బొంగు కర్రలు, మూడు నాంచాకులు, 3 సెట్ల లూస్ పేపర్ బుంచులు, మూడు హాండ్ బుక్ లు, ఒక నోట్ బూక్, కొన్ని బస్, ట్రైన్ టిక్కెట్స్ లు, ఒక పోడియం, స్పీకర్ లనులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న అబ్దుల్ ఖాద‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పుస్తకాల్లో భారత దేశ వ్యతిరేక కార్యక్రమాలు గురుంచి, హిందువులకు వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా ఉంది. దీంతో నిందితుడైన అబ్దుల్ ఖాదర్ ను విచారించగా న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.. మా పీఎప్ ఐ సంస్థ‌ ముఖ్య ఉద్దేశం పైకి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు కనిపిస్తూ ఇంటర్నల్ గా మా ఎజెండా ప్రకారం పనులు చేస్తూ ముస్లిం లోని అమాయకుల‌ను.. చురుకైన యువకులను ఎంపిక చేసుకుంటారు.

వారిలో హిందూ వ్యతిరేక భావజాలం నూరి పోసి తర్వాత వారికి అన్నీ రకాల ట్రైనింగ్ లు ఇచ్చి ముఖ్యంగా ఫిజికల్ ట్రైనింగ్ లో తర్ఫీదు ఇచ్చి వారిని ఒక మానవ విస్పోటంగా మార్చుతారు... అవ‌స‌రం అయిన‌ప్పుడు వారిని రెచ్చ‌గోట్టి అసాంఘిక కార్యక్రమాలు, ఇతర మతస్తుల మీద దాడి చేయిస్తారు. ఈ PFI నిజామాబాద్, ఇతర చోట్ల సేవా కార్యక్రమాల ముసుగులో మాత‌ విద్వేషాలు రెచ్చగొట్టేలా... దేశానికి వ్యతిరేకంగా హిందూ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తూ శిక్షణ ఇస్తున్నట్లు నిందితుడు అబ్దుల్ ఖాదర్ చెప్ప‌ర‌ని డీసీపీ తెలిపారు.

ఈ సంస్థ నిషేదిత సిమి. ప్రస్తుతం ఈ సిమి పీఎఫ్ఐ గా రూపాంతరం చెందింది. PFI సంస్థను జార్ఖండ్ ప్రభుత్వం నిషేదించిoదని పోలీసులు తెలిపారు. నిందితున్ని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. PFI జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ తమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరా తీస్తున్నారు. గత నెలలో కూడా ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Telangana crime

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు