Home /News /telangana /

NIZAMABAD POCHARAM SRINIVAS REDDY SONS HOPING FOR A BANSWADA TICKET NEXT ELECTIONS SNR

Telangana Politics: పోచారం అడ్డా ఎవరిది బిడ్డా .. నెక్స్ట్ బాన్సువాడ బాద్‌షా ..?

(బాన్సువాడ బాద్‌షా..?)

(బాన్సువాడ బాద్‌షా..?)

Telangana Politics:ఎన్నికలకు ఇంకా టైముంది. కాని వాళ్లు మాత్రం ఆ నియోజకవర్గ టికెట్‌ని ఆశిస్తున్నారు. తండ్రి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే కావాలని ఒకరు ..కాదు తానకే పార్టీ టికెట్ ఇస్తుందనే కాన్ఫిడెన్స్‌లో మరొకరు ఉన్నారు.ఇంతకీ ఆ అన్నదమ్ముల్లో అధిష్టానం ఎవరికి ప్రాధ్యానత ఇస్తుందోనన్న చర్చ ఇప్పటి నుంచే జరుగుతోంది.

ఇంకా చదవండి ...
రాజకీయల్లో పోటీ ప్రత్యర్ధులతో ఉంటుంది. కాని ఆ నియోజకవర్గంలో మాత్రం సొంత వాళ్ల మధ్య పోటీ నెలకొంది. సొంతవాళ్ల మధ్య పోటీ ఏంటని ఆశ్చర్యపోకండి..ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు. వాళ్లు ఎన్నికల బరిలో లేరు. మరీ పోటీ దేనికో తెలుసా. తండ్రి ఇలాఖాలో తానే బాద్షా కావాలనే ఆలోచన ఆయన ఇద్దరి కొడుకుల్లో ఉందట . ఒకే ఎమ్మెల్యేకి చెందిన ఇద్దరు కొడుకులు తండ్రి వారసత్వ రాజకీయంగా ఆ అసెంబ్లీ సెగ్మెంట్‌పై కన్నేశారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరగబోతుందన్నదే జిల్లాలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

బాన్సువాడ బాద్షా ఎవరో..
రాజకీయాల్లో పోటీ ఎప్పుడూ ప్రత్యర్ధులతోనే కాదు కొన్ని సందర్భాల్లో సొంత వాళ్లతో కూడా ఉంటుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ (Banswada) అసెంబ్లీ నియోజకవర్గానికి(Assembly constituency)సంబంధించిన టాపిక్ ఇది. బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Pocharam Srinivas Reddy) అడ్డా. ప్రస్తుతం ఆయన అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. ప్రెజెంట్‌ సిస్ట్యూవేషన్ ఓకే కాని ఫ్యూచర్‌ ఏంటీ అనే విషయంపైనే ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో స్పీకర్‌ ఇలాఖా నుంచి పోటీ చేయాలన్నది ఇద్దరు అన్నదమ్ముల ఆలోచన. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ముగ్గురు కుమారులు. పెద్దాయన రవీందర్‌రెడ్డి(Ravinder Reddy)డాక్టర్ కావడం వల్ల రాజకీయాలకు కాస్త అంటి ముట్టనట్లుగా ఉన్నారు.

(పోచారం అడ్డా ఎవరికి బిడ్డా)


పోచారం సన్స్‌ పొలిటికల్ ఎంట్రీ..
స్పీకర్‌గారి మిగిలిన ఇద్దరు కుమారుల్లో రెండో కొడుకు సురేందర్‌రెడ్డి, చివరి కుమారుడు భాస్కర్‌రెడ్డి ఇప్పుడు బాన్సువాడ అసెంబ్లీ సీటుపై మనసుపడ్డట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బాన్సువాడ సీటు దక్కించుకోవాలని తండ్రి అడ్డాలోనే తిరిగి గులాబీ జెండాను ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నారు అన్నదమ్ములిద్దరు. తండ్రి తప్పుకోవాలే గాని ఇద్దరూ ఎమ్మెల్యే సీటుకు అర్హులే అన్నట్లుగా నియోజకవర్గంలో ఎవరి పంథాలో వారు ముందుకెళ్తున్నారు. తండ్రి రాజకీయ అనుచరుడిగా, డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు చిన్నకుమారుడు భాస్కర్‌రెడ్డి. రెండో కుమారుడు సురేందర్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు కావడంతో డైరెక్టుగా ఐటీశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఒకే ఒరలో రెండు కత్తులు..
ఇద్దరిలో ఏ ఒక్కరూ తక్కువేం కాదు అన్నట్లుగా పొలిటికల్ గ్రిప్‌ మెయిన్‌టెన్ చేస్తున్నారు. నియోజకవర్గ పబ్లిక్‌లో ఫాలోయింగ్‌ సంపాధించుకున్నారు. బాన్సుబాడ నియోజకవర్గాన్ని రెండుగా విభజించి చెరో నాలుగు మండలాలను పంచుకున్నారు పర్యటనలు, ప్రచారాలు, పబ్లిక్‌ ఈవెంట్స్, ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. బాన్సువాడ, బీర్కూర్, నస్రూల్లాబాద్, వర్నీ మండలాలకు ఇన్‌చార్జ్‌గా భాస్కర్‌రెడ్డి ఉన్నారు. రెండో కుమారుడు సురేందర్‌రెడ్డి కోటగిరి, మోస్త్రా,రుద్రూర్‌, చందూర్‌ మండలాల ఇన్‌చార్జ్‌గా అక్కడి ప్రజలకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. తమ క్యాడర్‌ని కలుపుకొని ముందుకుపోతున్నారు.

టికెట్‌ దక్కేదెవరికో..
ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే పార్టీలో సీటు ఆశించే వారి సంఖ్య సహజంగా ఎక్కువగానే ఉంటుంది. కాని బాన్సువాడ నియోజకవర్గం పరిస్థితి ఇంకా టిపికల్‌గా ఉంది. ఒకే పార్టీ ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు సీటు ఆశిస్తూ ఉండటంపై తీవ్రచర్చ జరుగుతోంది. మరి పార్టీ అధిష్టానం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ టికెట్‌ని పోచారం సన్స్‌లో ఎవరి కేటాయిస్తుందో చూడాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Bansuwada, Pocharam Srinivas Reddy, Telangana Politics

తదుపరి వార్తలు