(P.Mahendar,News18,Nizamabad)
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్వచ్చంద సంస్థలు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రతియేడు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసే రవితేజ యూత్(Ravi Teja Youth) సభ్యులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్(Plaster of Paris) వద్దు.. మట్టి వినాయకులు ముద్దు అనే నినాదంతో అతిపెద్ద మట్టి విగ్రహాలను 2012 నుంచి ఏర్పాటు చేస్తున్నారు.ఈ యేడు 54 అడుగుల ఎత్తుల్లో బారీ మట్టి విగ్రహాన్ని సిద్దం చేసారు.. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మట్టి వినాయకుడి(Clay Ganesha) విగ్రహం నిజామాబాద్(Nizamabad)జిల్లాలో చవితి ఉత్సవాలకు సిద్దమైంది.
మట్టి గణపతే మహాగణపతి..
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులతో తయారు చేసిన గణపతులను పూజించ వద్దంటూ గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా మట్టి వినాయకులను పూజించేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏ ఏటి కాయేడు వీటి తయారీ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో స్కూల్స్, కాలేజీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అయితే నగరంలోని రవితేజ యూత్ క్లబ్ సభ్యులు ఒక అడుగు ముందుకు వేశారు. గత 2012 నుంచి అతిపెద్ద మట్టి వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
భారీ లంబోధరుడు..
రవితేజ యూత్ క్లబ్ 1988 నుంచి వినాయకున్ని ప్రతిష్టిస్తున్నారు. అయితే 2012 నాటికి 25 సంవత్సరాలు పూర్తి అయన సందర్బంగా యూత్ సభ్యులు మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 36 మంది యూత్ సభ్యులు ఉండడంతో మొదట 2012లో 36 అడుగులు, 2013లో 45,2014లో 47,2015లో 52, 2016లో 54, 2017లో56, 2018లో 58, 2019 లో 60 అడుగుల బారీ లంబోదరుడిని ప్రతిష్టించి జిల్లా వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే 2020,2021లో కరోనా పరిస్థితుల కారణంగా చిన్న సైజ్‌లో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈసారి 54అగుడుల మలేషియాలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆకారంలో కోల్‌కతా కళాకారులు 10 మంది 15 రోజులు శ్రమించి ఈ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గత ఆరు సంవత్సరాలుగా ఉత్తమ గణపతి అవార్డును కూడా సొంతం చేసుకుంటున్నారు.
54అడుగుల ఎకో గణేష్..
తెలంగాణ రాష్ట్రంలోనే ఈసారి ఎక్కడా లేని విధంగా 54 అడుగుల ఎత్తైన మట్టి వినాయకుడ్ని తయారు చేశారు. ఇందుకోసం కోల్‌కతా నుంచి వచ్చిన 10మంది కళాకారులు ఈ భారీ విగ్రహానికి ప్రత్యేక గంగమట్టితో పాటు స్థానిక చెరువు మట్టిని వెదురు కట్టెలు, ఎండు గడ్డిని ఉపయోగించి ఈవిగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం రవితేజ యూత్ వారు సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. భారీ లంబోదరున్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాము ప్రతి ఏటా ఇలాంటి ఎత్తైన విగ్రహాలను ప్రతిష్టిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.ప్రతి రోజు నిత్యన్నదాన, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మట్టి విగ్రహమే ముద్దు..
రవితేజ యూత్ ఆధ్వర్యంలో 2012 నుంచి బారీ మట్టి వినాయకులను ఏర్పటు చేస్తున్నమని యూత్ అధ్యక్షుడు నీలగిరి రాజు తెలిపారు. 36 మంది యూత్ సభ్యులు కలిసి పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను ఏర్పాటు చేస్తున్నాము. ఇలా భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో మట్టి వినాయకులపై ఆవగహన పెరుగుతుందని మా అభిప్రాయమని తెలిపారు. వినాయక చవితి నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తారు. భారీ వినాయకుడ్ని గంగా జలాలతో ఇక్కడే నిమజ్జనం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికై ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాను ఎర్పాటు చేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi, Nizamabad, Telangana News