Nizamabad:నాలుగు నెలల పసిపాపను వదిలించుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ చెత్తకుండి దగ్గర వదిలివెళ్లారు. అంత అమానుషంగా ఎందుకు వదిలివెళ్లారో తెలిస్తే షాక్ అవుతారు.
(P.Mahendar,News18,Nizamabad)
పిల్లలు కావాలని ఎందరో తల్లిదండ్రులు పరితపిస్తున్న రోజులు ఇవి. సంతానం కోసం రోజూ డాక్టర్లను సంప్రదిస్తున్న వాళ్లు కొన్ని వేలమంది ఉన్నారు. సంతానప్రాప్తి ప్రసాధించమని ఆలయాల చుట్టూ తిరిగి పూజలు చేసి మొక్కుకుంటున్న వాళ్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే పండంటి బిడ్డను మద్యం మత్తులో చెత్తకుప్ప దగ్గర వదిలివెళ్లారు దంపతులు. ఈదయనీయ సంఘటన ప్రతి ఒక్కరి మనసుల్ని కదిలించింది. నిజామాబాద్(Nizamabad) టౌన్‌లోని సంతోష్‌నగర్ (Santosh Nanger)ఇంద్రపూర్ కాలనీకి చెందిన ధర్మారం ప్రియాంక(Dharmaram Priyanka), పోశెట్టి(Poshetti)దంపతులకు నాలుగు నెలల పాప ఉంది. గురువారం భార్యభర్తలిద్దరూ అర్దరాత్రి సమయంలో ఫూటుగా మద్యం(Alcohol) తాగి మత్తులో నాలుగు నెలల(4Months baby) పాప పవిత్ర(Pavithra)ను శ్రీదేవి టాకీస్(Sridevi Talkies) ఎదురుగా ఉన్న చెత్తకుండి దగ్గర వదిలివెళ్లారు. పసిపాప ఏడుపు విన్న స్థానికులు టౌన్టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్తలానికి చేరుకొని పవిత్రను జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
చెత్తకుప్ప దగ్గర పసిపాప..
పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను పాడుబడ్డ చెత్తకుప్ప దగ్గర వదిలివెళ్లిన పోశెట్టి,ప్రియాంక దంపతులకు మద్యం మత్తు దిగిపోగానే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. రాత్రి మద్యం మత్తులో మా పాపను వదిలివెళ్లామని పోలీసుకు చెప్పారు. ఎందుకు వదిలి వెళ్లారని పోలీసులు ప్రశ్నించడంతో పాపకు పక్క చెలిపేలు వచ్చాయని బ్రతకం కష్టమని చెప్పడం వల్లే వదిలివెళ్లామని తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లాలో పసిపాపను డస్ట్‌బిన్ దగ్గర వదిలిపెళ్లిన పేరెంట్స్ | Parents abandon infant near dustbin in Nizamabad district" width="1200" height="800" /> (బిడ్డను వద్దనుకున్న తల్లిదండ్రులు)
మద్యం మత్తులో వదిలివెళ్లిన పేరెంట్స్..
పసిపాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు బిడ్డను వదిలివెళ్లిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. విచారణ చేస్తున్నామని పాప ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉందన్నారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణ కేంద్రంలో ఉందని విచారణ అనంతరం తల్లిదండ్రులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.
కౌన్సిలింగ్ ఇస్తున్న అధికారులు..
నవమాసాలు మోసి కన్నబిడ్డను అనారోగ్య సమస్య వచ్చిందని చెత్తకుప్ప దగ్గర వదిలివెళ్లడం సరికాదని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ప్రియాంక, పోశెట్టికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు పక్కన నెలల పసికందును వదిలేస్తే ఏ కుక్కో ఎత్తుకెళ్లి ఉంటే ఏం చేసేవారని ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పసిపాప తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.