Home /News /telangana /

NIZAMABAD ONE PERSON WAS KILLED IN A CLASH OVER A NEEM TREE IN NIZAMABAD DISTRICT SNR NZB

OMG: నిజామాబాద్ జిల్లాలో చెట్టు కోసం చంపాడు .. వార్నీఆ చెట్టు కోసం మర్డరా

(వేప చెట్టుకోసం హత్య)

(వేప చెట్టుకోసం హత్య)

OMG: ఇంటి ముందు ఉన్న వేప చెట్టు రెండు కుటుంబాల మధ్య గొడవకు కారణమైంది. చినికి చినికి గాలివాన కాస్త తుఫానుగా మారినట్లు చిన్న గొడవ కాస్తా ఒకరి రక్తం కళ్ల చూసే వరకు వెళ్లింది. చెప్పుకోవడానికే విడ్డూరంగా ఉన్న ఘర్షణ జరిగిన తీరు అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. కానీ ఆ ఊరిలో  ఎదురు ఎదురు ఇళ్లలో ఉండే రెండు కుటుంబాలు చిన్న విషయంలో గొడవపడ్డారు. గొడవ కాస్తా రెండు కుటుంబాల మధ్య వైరాన్ని పెంచింది. కేవలం ఇంటి ముందున్న వేప చెట్టు విషయంలో వాళ్లు పరస్పరం గొడవపడేవాళ్లు. ఆ తగాదాలు కాస్తా పతాకస్థాయికి చేరడంతో ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణలోనే ఒకరు ప్రాణాలు బలివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజామాబాద్(Nizamabad జిల్లా మెండోరా(Mendora)మండలం దూదిగాం(Doodigam)గ్రామానికి చెందిన  30సంవత్సరాల సంసోని వసంత్ కుమార్(Samsoni Vasant Kumar), కుడాల బుచ్చ‌న్న(Kudala Buchanna)ఎదురెదురు నివాసాల్లో ఉంటున్నారు. కొద్దిరోజులుగా వీరి ఇంటి ముందున్న వేప చెట్టు(Neem tree)కోసం గొడపడుతూ ఉండేవాళ్లు. ఈ నెల 2వ తేదిన కూడా వేపచెట్టు విషయంలోనే ఘర్షణ పడ్డారు. గొడవ జరుగుతున్న సమయంలో బుచ్చన్న ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేక వసంత్ కుమార్ తలను గోడకేసి బాదాడు. తలకు దెబ్బతగలడంతో వసంత్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కొడుకుని వసంత్‌ తల్లి గాయాల‌తో ఉన్న కొడుకును ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టింది.

  ప్రాణం తీసిన వేపచెట్టు..
  ఆ తర్వాత సరిగ్గా వారం రోజుల పాటు వసంత్‌ సరిగ్గా భోజనం తీసుకోకపోవడం, నీరసానికి గురయ్యాడు. ఈనెల 9వ తేదిన వసంత్ ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అదే రోజు వసంత్ కుమార్‌ అంత్యక్రియలు నిర్వహించారు. గొడవ విషయం అంతా మర్చిపోయారు. వసంత్ కుమార్ తల్లి బిడ్డ చనిపోయిన విషయాన్ని బంధువుల దగ్గర ప్రస్తావించడంతో మళ్లీ కేసు కొత్త మలుపు తిరిగింది. వేప చెట్టు విషయంలో బుచ్చన్న వసంత్‌ తల గోడకేసి బాదడం వల్లే చనిపోయాడని బంధువులు భావించారు. వెంటనే పోలీసులను సంప్రదించారు. శనివారం మృతుని బందువులు మెండోరా పోలీస్ స్టేషన్ వచ్చి బుచ్చన్న కక్ష్య పూరితంగానే వసంత్ కుమార్‌ని కొట్టి చంపాడని కంప్లైంట్ చేశారు.  చెట్టుకోసం జైలుపాలు..
  సహజ మరణంగా క్లోజ్ చేసిన కేసు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. ఆదివారం ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్  భూమిలో పూడ్చి పెట్టిన వసంత్‌కుమార్‌ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు వసంత్‌కు బలమైన దెబ్బలు తగలడం వల్లే చనిపోయినట్లుగా నిర్ధారణ కావడంతో అతనిపై దాడి చేసిన కుడాల బుచ్చన్నను అరెస్ట్ చేసినట్లుగా సీఐ, ఇన్ఛార్జి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు.  వేప చెట్టు విషయంలో రెండు ఫ్యామిలీలు కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యేదని..మాట మాట పెంచుకొని చివరకు కొట్టుకోవడం వల్ల ఒకరు చనిపోతే మరొకరు జైలుపాలయ్యారు.

  ఇది చదవండి: సిద్దిపేట జిల్లాలో మద్యం తాగి లారీ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్..ముగ్గురు బలి  రెండు కుటుంబాలకు నష్టం..
  వేపచెట్టు కోసం జరిగిన ఘర్షణలో రెండు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. కోపాలు, విభేదాలతో సాధించేది ఏమి ఉండదని సామరస్యంగా పరిష్కరించుకునే చిన్న సమస్యను పెద్దది చేసుకొని రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Nizamabad District

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు