ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ (Safety) పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డేంజరో చెప్పే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవల తమిళనాడులోని వేలూరులో చార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ పేలి (Electric Bike Fire) ఓ వ్యక్తి, అతని కూతురు మృతి చెందిన ఘటన మరువక ముందే తెలంగాణలోనూ అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది.
చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో..
నిజామాబాద్ (Nizamabad) లో ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ (battery) పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో ఒక్కసారిగా దాని బ్యాటరీ పేలింది. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ (Charging) పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం (Fire accident) జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దుర్ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి (Ramakrishna died) చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
వరంగల్‌లో..
తెలంగాణలోని వరంగల్‌లో సోమవారం ప్యూరీఈవీ (PureEV)కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో (PureEV E-Scooter Catches Fire) మంటలు చెలరేగాయి. దీనితో కలిపి గత ఏడు నెలల్లో ఏకంగా 4 ప్యూర్ ఈవీ స్కూటర్లు మంటల్లో దగ్ధం కావడం గమనార్హం. మూడు వారాల కిందటే ఒక ప్యూర్ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooters) అగ్ని ప్రమాదానికి గురయ్యింది. మళ్లీ ఇప్పుడు ఈ కంపెనీ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఏప్రిల్ 18న వరంగల్‌లో Epluto 7G ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగినట్లు ప్యూరీఈవీ డీలర్షిప్ తెలిపింది. ఈ ఘటనపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
మంటలు చెలరేగుతున్న ఘటనలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరగవచ్చనే అనుమానం ఉన్న ఈ-స్కూటర్ల బ్యాచ్‌ను ఆయా తయారీదారులు రీకాల్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గత ఆరు నెలల్లో ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) రెండు స్కూటర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సదరు కంపెనీ కనెక్టర్, బ్యాటరీలను తనిఖీ చేయడానికి.. అవసరమైతే వాటిని రిపేర్ చేయడానికి ఏప్రిల్ 15న 3,215 యూనిట్ల ప్రైజ్ ప్రో స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Died, Electric Bikes, Fire Accident, Nizamabad