Home /News /telangana /

NIZAMABAD OLD WOMAN COMMITS SUICIDE IN NIZAMABAD COLLECTORATE AFTER HER SON REGISTERED HER HOUSE SNR NZB

Nizamabad: కొడుకు చేసిన మోసానికి గాయపడ్డ తల్లి మనసు .. ఘోరాన్ని తట్టుకోలేకే ఆత్మహత్యాయత్నం

(అమ్మ ఆత్మహత్యాయత్నం)

(అమ్మ ఆత్మహత్యాయత్నం)

Nizamabad: కొడుకు మోసం చేశాడని తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. నిజామాబాద్‌కి చెందిన రుక్మబాయి తన పేరుతో ఉన్న ఇంటిని అనుమతి తీసుకోకుండా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో తల్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంది.

    (P.Mahendar,News18,Nizamabad)
    ఆస్తి కోసం ఆరాటపడే వాళ్లకు సెంటిమెంట్స్ ఉండవు. అమ్మా. నాన్నా అన్న, తమ్ముడు,చెల్లి , అక్క వంటి రక్తసంబంధాలను సైతం తెంచుకుంటారు. నిజామాబాద్‌(Nizamabad)లో కూడా ఓ కొడుకు కన్నతల్లి కన్నీటికి కారణమయ్యాడు. వృద్ధాప్యం వచ్చిన తల్లికి నిలువ నీడ లేకుండా చేయడంతో ఎలా బ్రతకాలని వృద్ధురాలు ఏకంగా నిజామాబాద్ కలెక్టరేట్‌(Collectorate) ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అందర్ని విస్మయానికి గురి చేసింది.

    ఇంటి పేపర్లు తనతో మార్చుకున్న
    నిజామాబాద్ న‌గ‌రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన వడ్డేపు రుక్మ‌బాయి పేరుతో ఉన్న ఇంటిని కొడుకు సాగర్ ఆమె అనుమతి లేకుండానే అతని పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. రుక్మబాయి భర్త కృష్ణ 12ఏళ్ల క్రితం చనిపోయాడు. అతను చనిపోవడంతో...ఆ ఇల్లు రుక్మబాయి పేరుతో మారింది. రుక్మాబాయి కృష్ణకు రెండో భార్య. తనకు ఒక కుమార్తె ఉంటంతో ఆమెతో కలిసి ఉంటోంది. మొదటి భార్య కొడుకు అయినటువంటి సాగర్..పిన తల్లి పేరుతో ఉన్న ఇంటిని తన పేరుతో రెండు నెలల క్రితమే బదలాయించుకున్నాడు. కొడుకు చేసిన మోసం తెలుసుకున్న వృద్దురాలు కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. అక్కడే ప్రగతిభవన్‌ పక్కనే ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకునేందుకు ప్రయత్నం చేసింది.



    తల్లికి తెలియకుండా కొడుకు మోసం..
    కలెక్టర్ ఆఫీస్ కావడంతో అక్కడే ఉన్న మరికొందరు , భద్ర సిబ్బంది రుక్మబాయి ఆత్మహత్యాయత్నం చేసుకోవాడన్ని అడ్డుకున్నారు. ఎందుకు చనిపోవాలనుకుంటుందో అడిగి తెలుసుకున్నారు. రుక్మబాయిని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. జిల్లా అధికారి ముందే తన గోడు వెళ్లబోసుకుంది. తత‌న గొడు వెళ్ల‌బోసుకుంది. తన కొడుకు ఆస్తి కోసం కక్కూర్తి పడితే మున్సిపల్ అధికారులు సైతం అతనికి సహాకరించారని రుక్మబాయి ఆరోపించారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని కలెక్టర్‌తో తన గోడు చెప్పుకుంది.

    ఇది చదవండి: గర్భిణి విషయంలో చేయకూడని తప్పు చేశారు ఆ డాక్టర్లు .. కప్పి పుచ్చుకునే క్రమంలోనే ప్రాణాలు తీశారు



    న్యాయం చేయండి సారూ..
    మహిళ చెప్పిన విషయాన్ని ఆలకించిన కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. బాధితురాలు అడిగినట్లుగా ఇంటిని రెండు భాగాలుగా చేసి ఒకటి మొదటి భార్య కొడుకైన సాగర్‌కి..రెండో భాగం రుక్మబాయి కుమార్తెకు కేటాయించాలని కోరింది. తన భర్త మిగిల్చిన పోయిన ఇల్లు తప్ప తమకు వేరే ఏ ఆధారం లేదని ...ఒకవేళ తమకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యే శరణ్యమని వేడుకుంది రుక్మబాయి.

    ఇది చదవండి : ఆ పని చేయవద్దన్నందుకు భార్యను కొట్టి, వాతలు పెట్టి చంపిన భర్త .. ఎక్కడంటే


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Land dispute, Nizamabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు