హోమ్ /వార్తలు /telangana /

Nizamabad: మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. నిజామాబాద్​ పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు.. పూర్తి వివరాలివే..

Nizamabad: మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. నిజామాబాద్​ పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు.. పూర్తి వివరాలివే..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

మైనర్ బాలికపై అత్యాచారం (rape) చేసి గ‌ర్బ‌వ‌తిని చేసిన‌ కేసులో జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు సెషన్స్ జడ్జి (Special POCSO Court Sessions Judge) సీహెచ్ పంచాక్షరీ బుధవారం సంచ‌ల‌న  తీర్పు  ఇచ్చారు.

(P. Mahendar, News18, Karimnagar)

మైనర్ బాలిక (Minor Girl)పై అత్యాచారం (rape) చేసి గ‌ర్బ‌వ‌తిని చేసిన‌ కేసులో జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు సెషన్స్ జడ్జి (Special POCSO Court Sessions Judge) సీహెచ్ పంచాక్షరీ బుధవారం సంచ‌ల‌న  తీర్పు ను  (Judgement) ఇచ్చారు. ఇద్ద‌రు నిందితుల‌కు ఒక‌రికి జీవితఖైదు.. ఆయనకు సహక రించిన  మ‌రోక‌రికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాధిత బాలిక‌కు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌రిహారం అందించాల‌ని జ‌డ్జి సిఫార్సు చేశారు.. బాలికపై అత్యాచార ఘటన ఆరేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జ‌రిగింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ లో  తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో 16 ఏళ్ల బాలికను భయపెట్టి ఆర్మూర్ కు చెందిన షేక్ నిజాముద్దీన్ (19) పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఎవ‌రికైన చెబితే చంపుతాను అని బ‌య‌పెట్టాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిజాముద్దీన్ కు లోరే శనిదేవ్ అలియాస్ రాజు (24) అనే వ్యక్తి సహకరించాడని కేసు పెట్టింది. ఈ మేరకు 2016 డిసెంబర్ 15న కేసు నమోదు చేసిన ఆర్మూర్ పోలీసులు.. దర్యాప్తు  పూర్తి చేసి నివేదికను అప్పటి ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమి షనర్ శివ కుమార్ కు అందజేశారు. అయితే నేర విచారణను పూర్తి చేసి అభియోగ పత్రాన్ని ఏసీపీ (ACP) కోర్టులో సమర్పించారు.

ప్రత్యేక ఫోక్సో కోర్టు (Special POCSO Court) విచారణలో భాగంగా 14 మంది సాక్షుల వాంగ్మూలాలను విచారించారు. దీంతో నేరం రుజువు కావడం తో వారికి శిక్ష విధిస్తూ తీర్పు వెలువ‌రించారు.  షేక్  నిజాముద్దీన్ కు సెక్షన్ 376 (1) అత్యాచారం కు ఏడేళ్ల కఠిన శిక్ష..  రూ.5 వేలు జరిమానా.. సెక్షన్ 506  చంపుతానని బెదిరించడం కు రెండేళ్ల జైలు.. రూ. 2 వేలు జరిమానా.. ఎస్సీ, ఎస్టీ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 3(1)(8)(జీ) ప్రకారం ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా..  సెక్షన్ 3(2) (8) ప్రకారం జీవిత కారాగార శిక్ష..  రూ. 5 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.  అయితే రెండో ముద్దాయి శనిదేవ్ కు సెక్షన్ 376 (1) రెడ్ విత్ సెక్షన్ 109  నేరాన్ని ప్రేరేపించినందుకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా.. సెక్షన్ 506 చంపుతానని బెదిరించడం నేరానికి రెండేళ్ల కఠిన శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి పంచాక్షరీ తీర్పు చెప్పారు.

అయితే శిక్ష కాలాన్ని ఏక కాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాధిత బాలికకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ రూ.4 లక్షల పరిహారం అందజే యాలని జడ్జి సిపార్సు చేశారు. తీర్పు ప్రతి స్వీకరిం చిన నెల రోజుల్లో పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక పై అత్యారం చేసిన కేసులో నిందితుల‌కు త‌గిన శిక్ష ప‌డింద‌ని బాలిక కుటుంబ స‌భ్యులు ఆనందం వ్య‌క్తం చేశారు..

First published:

Tags: Courts, Minor girl, Minor girl raped, Nizamabad

ఉత్తమ కథలు