హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: మందు పార్టీలో కలిసిన ఆ నలుగురు బైక్‌లపై వెళ్తూ ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

Crime News: మందు పార్టీలో కలిసిన ఆ నలుగురు బైక్‌లపై వెళ్తూ ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

Thieves Arrest

Thieves Arrest

Crime News:స్నేహితుల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. పక్కన తిరిగే వాళ్లకు మంచి సలహాలు ఇచ్చే వాళ్లు కొందరైతే. చెడు అలవాట్లకు బానిసలైన ఓ వ్యక్తి మిగిలిన ముగ్గుర్ని నేరస్తులుగా మార్చాడు. అసలు వీళ్లంతా కలిసి ఏం చేశారో తెలుసా.

  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

స్నేహమేరా జీవితం.. స్నేహ‌మేరా శాశ్వ‌తం అనే ప‌ద‌లు స్నేహానికి అర్థం చెబుతాయి. కాని కొన్ని చెడు స్నేహాలు పక్కవాళ్లను కూడా త‌ప్పుదారి ప‌ట్టిస్తాయి. చెడ్డవాడితో సహవాసం చేసే కంటే అతడికి దూరంగా ఉండటం మేలని పెద్దలు చెబుతుంటారు. కాని అలాంటి వాటిని పట్టించుకోకుండా స్నేహం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ముగ్గురు యువకులకు ఆనుభ‌వ పూర్వ‌కంగా తెలిసొచ్చింది. పరిచయంతో స్నేహితులుగా మారిన నలుగురు యువకుల్లో ఒకడు చెప్పిన మాటలు విని మిగిలిన వాళ్లంతా నేరాలకు పాల్పడి జైలు పాలయ్యారు.

నగరంలో ఆ నలుగురు..

నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన కుమ్మం శ్రావణ్ యాదవ్, ఇటుకల మహేష్ , బక్కెట్టి నితిన్ , సూర్యవంశీ సాయికుమార్ అనే నలుగురు యువకులు స్నేహితులు. తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం కలిసి మద్యం తాగడం చేస్తుండే వాళ్లు. ఈక్రమంలోనే సూర్యవంశి  సాయికుమార్ గతంలో జైలుకి వెళ్లి వచ్చాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసైన సాయికుమార్ తమ జల్సాలకు డబ్బులు సరిపోవడం లేదని..అలాంటి కోరికలు తీర్చుకోవాలంటే అందరం కలిసి దొంగతనాలు చేస్తే ఈజీగా డబ్బు వస్తుందని మిగిలిన వాళ్లకు చెప్పాడు. ఫ్రెండ్ మాటలు విని దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా తాళాలు ఉన్న ఇల్లు, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ లను చోరీ చేసే వాళ్లు. అయితే ఈ నెల 4న నిజామాబాద్‌లోని ఆర్టీసీ కాలనీలో మధ్యాహ్నం తాళం వేసిన ఇంటిలోకి చొరబడి చోరీ చేశారు.

జల్సాల కోసం చోరీలు ..

ఈ నలుగురు యువకులు ఇంట్లో చోరీ చేసి బంగారు నగలు, వెండి ఆభరణాలు వెంట బెట్టుకుని బైక్‌పై తిరుగుతున్నారు. మార్వాడీగల్లీలో తిరుగుతున్న ఈ నలుగురి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆదుపు లోకి తీసుకుని విచారిస్తే ఆస‌లు విష‌యం బయటపడిందని ఏసీపీ కిర‌ణ్ కుమార్  చెప్పారు. బైక్‌లు, టూవీలర్లు చోరీ చేసి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Telangana: రైతులతో కన్నీరు పెట్టిస్తున్న వర్షాలు .. ఆ జిల్లాలో ఎంత నష్టం జరిగిందో తెలుసా..

చెడగొట్టిన సహవాసం..

పట్టుబడిన నిందితుల నుంచి 15 గ్రాముల‌ బంగారు నెక్లెస్, బంగారు జడ పువ్వులు, రెండు తులాల బంగారం గోలుసు, ఒక బంగారు ఉంగ‌రం, వెండి ప‌ట్టాగొలుసులు, నాలుగు మోట‌ర్ సైకిల్ లు, రెండు స్కూటిల‌ను స్వాదినం చేసుకున్నారు.  చెడు వ్యస‌నాల‌కు అల‌వాటు ప‌డితే వాటి కోసం ఇలాంటి నేరాలు చేయాల్సి వచ్చి జైలుపాలవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చెడు అలవాట్లు ఉన్న స్నేహితులకు దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.

First published:

Tags: Nizamabad District, Telangana crime news

ఉత్తమ కథలు