హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : సివిల్స్‌లో నిజామాబాద్ బిడ్డకు 136వ ర్యాంక్ ..అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్న స్నేహ

Nizamabad : సివిల్స్‌లో నిజామాబాద్ బిడ్డకు 136వ ర్యాంక్ ..అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్న స్నేహ

(మాట నిలబెట్టుకున్న కూతురు)

(మాట నిలబెట్టుకున్న కూతురు)

upsc result 2021 topper:లక్ష్యం ఓటమిని గుర్తు చేయదు. చేరుకోవాల్సిన గోల్‌ని మాత్రమే గుర్తు చేస్తోంది. సివిల్స్‌ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన స్నేహ విషయంలో అదే జరిగింది. మూడు సార్లు ప్రయత్నించినప్పటికి ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో..రెట్టింపు పట్టుదలతో నాల్గో సారి ప్రయత్నించి 136ర్యాంక్ సాధించింది.

ఇంకా చదవండి ...

  (P.Mahendar,News18,Nizamabad)

  కృషి, పట్టుదల ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు నిజామాబాద్ బిడ్డ‌(Nizamabad)స్నేహ. సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించాలన్న తన గోల్‌ని రీచ్ అయ్యేందుకు ఒకటి రెండు సార్లు ఫలితాలు నిరాశపరిచినా వెనకడుగు వేయలేదు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి..అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. 2021 సివిల్స్‌ ఫలితాల్లో(Civils‌ results) 136 ర్యాంక్‌ సాధించి తన సత్తా చాకుటుంది నిజామాబాద్ జిల్లాకు చెందిన స్నేహ. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీకి (Ambedkar Colony)కి చెందిన అరుగుల స్నేహ(Arugula sneha కు తల్లి పద్మ(Padma), చెల్లెలు సుప్రియ(Supriya)ఉన్నారు. తల్లి పద్మ కామారెడ్డి కలెక్టరేట్(Kamareddy Collectorate)లోని పే అండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎం ట్రీ ఆపరేటర్(Data Entry Operator)గా పనిచేస్తున్నారు. చెల్లెలు సుప్రియ హైదరాబాద్(Hyderabad)లో సంగీతం టీచర్(Music teacher)గా పనిచేస్తున్నారు.

  అమ్మకిచ్చిన మాట కోసం..

  సివిల్ ర్యాంకర్ స్నేహ‌ 8వ తరగతి నుంచే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో 3వ తరగతి నుంచి టెన్త్ వరకు చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి..అటుపై నాగపూర్ ఎన్ఐటి (నేషనల్ ఇన్సిటి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్ 2017లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వెంటనే స్నేహ సివిల్స్ వైపు దృష్టి సారించారు. సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టారు.  సివిల్స్ కోసం ఢిల్లీలోని వాజీరాం అండ్ ర‌వి ఇన్సిటిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు. ఢిల్లీలోని ఫోరమ్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్ సంస్థల్లో టెస్టులు రాశారు. హైదరాబాద్ లోని బాలలత మేడమ్ వద్ద మాక్ ఇంటర్వ్యూలు చేశారు.

  (అమ్మకి మాటిచ్చింది..నిలబెట్టుకుంది)

  నాల్గో ప్రయత్నంలో ..

  స్నేహ సివిల్స్‌ చేయాలన్న బలమైన కోరిక కారణంగా మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా అర్హత పొందలేదు. రెండో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత కాలేదు. మూడోసారి అటెంప్ట్ చేశారు. ఇంటర్‌వ్యూ వరకు వెళ్లి ఒక్క మార్కు తేడాతో ర్యాంకు కోల్పోయారు. లక్ష్యాన్ని చేధించాలన్న ధృడ సంకల్పంతో నాలుగో ప్రయత్నంలో భాగంగా 136వ ర్యాంక్‌ సాధించించి తెలంగాణ బిడ్డ.

  అపజయాలను లెక్కచేయక..

  తనకు 136వ ర్యాంక్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు స్నేహ. త‌న త‌ల్లికి ఇచ్చిన మాట కోసం ఎంతో క‌ష్ట‌మైన సివిల్ స‌ర్విస్‌లో విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. ఎంతో శ్రమ, ఓర్పుతో అనుకున్నది సాధించుకున్న స్నేహ నేటి యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఓటమితో నిరాశపడటం వల్లే ప్రయోజనం ఏమి ఉండదని..అనుకున్న గోల్‌ని సాధించేందుకు ఏకాగ్రత, పట్టుదల ఉంటే విజయం దానంతటక అదే మనల్ని వరిస్తుందని నిరూపించించారు స్నేహ.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Civil Services, Nizamabad, UPSC

  ఉత్తమ కథలు