NIZAMABAD NIZAMABAD DISTRICT YOUTHS CALLED A PARTY AND THREW ACID ON A PERSON SNR NZB
Telangana:నిజామాబాద్‌లో దావత్‌కు పిలిచి దారుణం..వామ్మో వెయ్యి రూపాయలు ఇవ్వలేక..
(దావత్ పేరుతో దారుణం)
Nizamabad:సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొనుక్కోవడం అతని ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టింది. ఫ్రెండ్స్ కదా అని నమ్మినందుకు మోసం చేశారు. అంతటితో వదిలిపెట్టకుండా దావత్‌కి పిలిచి దారుణానికి పాల్పడ్డారు. జస్ట్ మిస్ లేదంటే ఏకంగా ప్రాణాలే పోయేవి.
(P.Mahendar,News18,Nizamabad)
ఫ్రెండ్స్ అంటే స్నేహానికి ప్రాణం ఇచ్చే వాళ్లని అందరూ అంటారు. కాని వాళ్లు మాత్రం అట్లాంటి వాళ్లు కాదు. ఫ్రెండిషిప్ పేరుతో చోరీ సొత్తును అంటగట్టి స్నేహితుడ్ని మోసం చేశారు. ఇదేంట్రా బాబు అని వాడు నిలదీస్తే..పార్టీ ఇస్తాం రమ్మని తీసుకెళ్లి ప్రాణాలు తీసేంత పని చేశారు. స్నేహితుల పేరు చెబితేనే భయపడే విధంగా ప్రవర్తించారు నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో కొందరు దుర్మార్గులు. టౌన్‌లోని బాబాన్సహబ్ పహాడ(Baban Sahab Pahada)కు చెందిన షేక్ సలీం(Saleem) అతని ఫ్రెండ్స్ రంజానీ(Ramzani) ఫారూఖ్(Farooq)మతిన్(Matin)దగ్గర వెయ్యి రూపాయలకు ఓ సెకండ్ హ్యాండ్(Second hand)మొబైల్ కొనుక్కున్నాడు. పాపం ఫ్రెండ్స్ కదా అనే నమ్మకంతో ఫోన్(Cell Phone) కొంటే తర్వాత తెలిసింది అది దొంగిలించిన సొత్తు అని వెంటనే భయపడి ఫోన్ వెనక్కి ఇచ్చి తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వమన్నాడు. ఇక్కడే స్నేహితుల ముసుగులో ఉన్న ముగ్గురు నిజస్వరూపం బయటపడింది.
పైసల కోసం ప్రాణాలు తీస్తారా..
షేక్ సలీంకి డబ్బులు తిరిగి ఇచ్చే వంకతో అతడికి దావత్ ఇస్తామని పిలిపించారు త్రీ ఇడియట్స్. ముగ్గురూ మూడు వేల ఐదు వందలు సలీంకి ఇచ్చారు. ఇంకా వెయ్యి రూపాయలు తరువాత ఇస్తామన్నారు. ఇస్తామన్న వెయ్యి రూపాయలు ఇవ్వకపోవడంతో సలీం స్నేహితుల్ని గట్టిగా అడిగాడు. అంతే కాదు మీరు దొంగతనంగా తెచ్చిన ఫోన్‌ని తనకు అమ్ముతారా అంటూ అవమానపరుస్తూ మాట్లాడాడు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నారు ముగ్గురు దుర్మార్గులు. వెయ్యి రూపాయల కోసం పదే పదే అడుగుతున్న సలీంని చంపాలని పథకం వేసుకున్నారు.
ఫోన్ కొన్నందుకు శిక్ష..
మర్డర్ స్కెచ్‌లో భాగంగానే రంజానీ, ఫారూఖ్, మతిన్ సలీంని పార్టీ ఇస్తామని పిలిపించారు. సిక్స్త్ టౌన్‌లోని డెయిరీఫాం దగ్గర అందరూ కలిసి మద్యం తాగారు. మత్తులో ఉన్న షేక్ సలీంను కర్రలతో కొట్టారు. అటుపై వాహనాల బ్యాటరీల్లో వాడే యాసిడ్ పోసి పరారయ్యారు. పార్టీ పేరుతో ఫ్రెండ్స్ చేసిన కిరాతకానికి సలీం వీపు మొత్తం కాలిపోయింది. గట్టిగా కేకలు వేయడంతో బాధితుడ్ని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తరలించారు స్థానికులు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
ముగ్గురు స్నేహితుల కిరాతకం..
విషయం తెలుసుకున్న సలీం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. తమ బిడ్డపై దారుణానికి పాల్పడిన ముగ్గురిపై సిక్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం వెయ్యి రూపాయల కోసం ఓ వ్యక్తిని...తోటి స్నేహితుడ్ని చంపడానికి స్కెచ్ వేశారని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.