Home /News /telangana /

NIZAMABAD NIZAMABAD DISTRICT TRS LEADER MANDAVA VENKATESWARA RAO IS PREPARING TO JOIN BJP SNR NZB

Telangana : మూడేళ్లకే టీఆర్ఎస్‌పై మండవకు విరక్తి ..! అందుకే పార్టీ చేంజ్.. ముహుర్తం ఎప్పుడంటే ..?

Mandava (file photo)

Mandava (file photo)

Telangana politics: 40ఏళ్లు సైకిల్‌ గుర్తు పార్టీలో ఉన్న పెద్దమనిషిని గులాబీ బాస్ స్వయంగా ఇంటికి వెళ్లి కారెక్కమని కోరారు. తీరా పార్టీలో చేరిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఆయన్ని పట్టించుకున్నదే లేదు. అందుకే ఆయన కారు దిగి..కమలం గూటికి వెళ్లాలని చూస్తున్నారట. ఇంతకీ ఆ పెద్దాయన ఎవరంటే.

ఇంకా చదవండి ...
  (P.Mahendar,News18,Nizamabad)
  ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌Andhra Pradeshలో ఒక వెలుగు వెలిగినా సీనియర్ నాయ‌కుడు. టీడిపి(TDP) పాల‌న‌లో ప‌లు మంత్రిత్వ శాఖ‌ల‌లో సేవ‌లందించారు. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu)కు అత్యంత ఆప్తుడు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్న  ఆ నేతను సీఎం కేసీఆర్ (KCR)స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించడంతో సైకిల్ దిగి కారెక్కారు. పార్టీ మారిన నాటి నుంచి నేటి వరకు ఆయనకు ఎలాంటి పదవి, ప్రాధాన్యత కల్పించకపోవడంతో అసంతృప్తి చెందారు. ఈ టైమ్‌లోనే ఆయన్ని బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా సంప్రదించింది. దాంతో ఈ సీనియర్ లీడర్ గులాబీ పార్టీ(TRS)కి గుడ్ బై చెప్పి కమలం కండువా మార్చుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ జిల్లాలో గట్టిగా వినిపిస్తోంది.

  Telangana | Job scam : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ కుంభకోణం..ఆ ఎమ్మెల్యేను జైల్లో పెట్టాలి : సోమారపు  మండవ మార్పు ఖాయమేనా..!
  నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుపై అప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 ఎన్ని కలకు  దూరంగా ఉండటంతో ఆయన పొలిటికల్‌గా ఫేడవుట్ అయ్యారని అనుకున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన నేత, సీఎం కేసీఆర్‌తో టీడీపీలో పనిచేసిన సమయంలో సాన్నిహిత్యం ఉండటంతో 2019 ఏప్రిల్ 5న మండవను టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు గులాబీ బాస్. ఆ మరుసటి రోజే టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరారు మండవ. టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన మండవ‌కు పార్టీలో సముచిత స్థానం, కీలక బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. మూడేళ్లు గడిచినప్పటికి ఏమి జరగలేదు.  కారు దిగేందుకు ఇవే కారణాలా..?
  మండవ టీఆర్ఎస్‌లో అడుగుపెట్టడానికి కొద్ది రోజుల ముందే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. ఆ టైమ్‌లోనే మండ‌వకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. జూన్ 2వ తేదితో డిఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా పదవి కాలం కూడా ముగియడంతో మండవకు ఆ అవకాశం దక్కుతుందని భావించారు. కానీ  ఎక్కడా మండవ పేరు వినిపించకపోవడంతో ఆయన అసంతృప్తిగానే పార్టీలో కొనసాగుతున్నారు.

  అసంతృప్తితోనే ..
  కేవలం నిజమాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తున్న కవితకు 2019లోక్‌సభ ఎన్నికల్లో మండవ ప్లస్ అవుతారనే కేసీఆర్‌ భావించారు. ఆమె ఓడిపోవడంతో మండవను మర్చిపోయారు గులాబీ బాస్. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన టీఆర్ఎస్‌ని వీడనున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీనికి బలం చేకూర్చే విధంగా బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం. అందుకు మండవ వెంక‌టేశ్వ‌ర రావు కూడా సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

  Telangana | TRS : కారు గుర్తు పార్టీలో కుమ్ములాటలు.. ఛైర్మన్లు వర్సెస్‌ కౌన్సిలర్లు  కమలం పార్టీనే బెటరా..?
  ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మండవకు జిల్లాలో మంచి పేరుంది. చంద్రబాబు క్యాబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన మండవ వెంకటేశ్వరరావు వివాదరహితుడు, కూల్ లీడర్ అనే గుర్తింపు ఇప్పటికి ఉండటంతో బీజేపీ అక్కన చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిస్థితులు అన్నీ తారుమారు కావడంతో మండవ పొలిటికల్ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరడమే బెటర్ అని భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆగస్ట్ 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం కండువా మార్చుకోబోతున్నారని విశ్వసనీయ సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Bjp, Nizamabad, Telangana Politics, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు